Biodiversity conference to be held in hyderabad

Hyderabad, India, United Nations, Gujarat, New Delhi, South Korea, Larsen Toubro, Global Warming, London, Seoul, Istanbul, MCI, CoP 11 Biodiversity Summit,CoP 11 Biodiversity Summit news,CoP 11 Biodiversity Summit photos,CoP 11 Biodiversity Summit videos, searchCoP 11 Biodiversity Summit

Conference of Parties-11, Global Biodiversity Conference to be held in Hyderabad next month. More than 5,000 delegates, including some heads of State are likely to participate. Prime Minister Manmohan Singh is likely to inaugurate the mega convention to be held during October 1-19.

biodiversity-conference-to-be-held-in-hyderabad.png

Posted: 09/14/2012 02:54 PM IST
Biodiversity conference to be held in hyderabad

Biodiversity_Conference

XI-Conferenceజీవ వైవిధ్యంపై ఇదో అంతర్జాతీయ వేడుక! మొత్తం 193 దేశాల ప్రతినిధులు... కొందరు దేశాధినేతలు, అన్ని దేశాల పర్యావరణ మంత్రులు, ఉన్నతాధికారులు, రెం డువేల మందికిపైగా పాత్రికేయులు... మొత్తంగా సుమా రు పదివేల మంది విదేశీ ప్రతినిధులు! దీనికి మన హైదరాబాద్ వేదిక! 'ప్రకృతిని రక్షించు. అది నిన్ను రక్షిస్తుంది!' ఇదీ నినాదం! ఇది ప్రభుత్వాల విధానం కావాలి!అందుకు ఇప్పటిదాకా ఏంచేశాం? ఇకపై ఏం చేయాలి? ఇందులో ఎవరి బాధ్యత ఎంత? ఇవీ మనముందున్న ప్రశ్నలు. దీనికి సమాధానం కనుగొనడమే జీవ వైవిధ్య సదస్సు ముఖ్య లక్ష్యం. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (కాప్) పేరిట ఇప్పటిదాకా పది సదస్సులు జరగ్గా.. ఇది కాప్-11. ఐరాస 2011-20ని జీవవైవిధ్య దశాబ్దంగా ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలి సదస్సు ఇదే! దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.450 కోట్లదాకా ఖర్చు చేస్తున్నాయి.

ఎవరెవరో వస్తారు! ఏవేవో మాట్లాడుకుంటారు! ఎన్నెన్నో తీర్మానాలు చేస్తారు! ఇందులో ఏ ఒక్కటీ సామాన్యుడికి అర్థం కాదు! అవి అమలయ్యాయో, లేదో కూడా తెలియదు! పది సదస్సుల్లో జరిగింది దాదాపు ఇదే! హైదరాబాద్ సదస్సు మాత్రం ఇందుకు భిన్నంగా నిలవనుంది. శాస్త్రవేత్తల నుంచి సామాన్యులదాకా అందరికీ అర్థమయ్యేలా చర్చలు జరుగుతాయని, తీర్మానాలు చేస్తారని నిర్వాహకు లు చెబుతున్నారు. అయినా... ప్రస్తుతం ఏదీ దాచేస్తే దాగే పరిస్థితి లేదు.1992లో బ్రెజిల్‌లో 'ధరిత్రీ సదస్సు' జరిగింది. అప్పటి తీర్మానాల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. పాషాణ పాకాల్లాంటి తీర్మానాల సారాంశం మేధావులకే అంతు చిక్కలేదు. అప్పట్లో మీడియా కూడా విస్తృతంగా లేదు. ఇప్పుడు పరిస్థితి మారింది. కాప్-11కు వివిధ దేశాలనుంచి 2000 మంది జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు హాజరవుతున్నారు. ప్రతి అంశంపైనా మీడియా కన్ను వేస్తుంది. చర్చలు, సమావేశాలు, ఒప్పందాలు ఏమేరకు సామాజిక, పర్యావరణ సంబంధమైనవో... లేక ఆర్థిక పరమైనవో అప్పటికప్పుడే నిగ్గు తేలిపోతుంది.

వైవిధ్యమా... స్వార్థమా?

జీవ వైవిధ్య సదస్సులో అగ్రదేశాల స్వార్థమే లేదా? కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు అస్సలు లేవా? ఇవి కొందరు పర్యావరణవేత్తల సందేహాలు! ఇవి అర్థం లేనివేమీ కావు! ఒకచోట చేరి... ఒక దేశానికి, ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకమైన జీవ, జంతుజాతుల సమాచారాన్ని తెలుసుకుని... వాటిపైనా మేధోపరమైన హక్కులు కల్పించుకోవడమనే రహస్య అజెండా ఈ సదస్సు వెనుక ఉందని పర్యావరణ నిపుణులు వాదిస్తున్నా రు. ఇరవై ఏళ్లలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన అనేక సదస్సుల తీర్మానాలు పెద్దగా అమలైన దాఖలాలు లేవని గుర్తుచేస్తున్నారు.పైగా... వెనుకబడిన, మూడో ప్రపంచ దేశాలకు చెందిన వైవిధ్య సంపదను బడా దేశాలు, బడాబడా కార్పొరేట్ కంపెనీలు సొంతం చేసుకోవడం గమనార్హం. "దీనికి భారత వ్యవసాయ పరిశోధన మండలి నిర్వాకమే ఉదాహరణ. ఈ సంస్థ బహుళ జాతి సంస్థల కన్నుసన్నల్లో నడుస్తోంది. 40 వేల రకాల మొక్కలు, వృక్షాలకు చెందిన వివిధ రకాల జన్యు వనరుల జెర్మ్‌ప్లాసమ్‌లను సదరు సంస్థ బహుళ జాతి కంపెనీలకు అప్పగించింది'' అని పర్యావరణ వేత్తలు ఆరోపించారు. నిజానికి... ఇలా వ్యవహరించడం గతంలో జీవ వైవిధ్య సదస్సుల్లో చేసిన తీర్మానాలకు విరుద్ధం. అయినా, ఇది జరుగుతూనే ఉంది. మనకు కావాల్సింది కార్పొరేట్ అనుకూల జీవ వైవిధ్యం కాదని... అందరికీ పనికొచ్చే ప్రజా వైవిధ్యం అని చెబుతూ హైదరాబాద్‌లోనే పోటీ సదస్సు కూడా జరగనుంది.

కాప్-11 ముఖ్య లక్ష్యాలు..

* అందరికీ అందుబాటులో వైవిధ్యం...
* పేదరిక నిర్మూలనకు జీవ వైవిధ్యం
* జీవ వైవిధ్యాన్ని సాధించడం ఎలా?
* నగరాల నుంచి దేశ ప్రభుత్వాల వరకు అనుసరించాల్సిన ప్రణాళికల రూపకల్పన
* జీవ వైవిధ్య అభివృద్ధికి పరస్పర సహకారం
* సంప్రదాయ పరిజ్ఞానాన్ని సంరక్షించుకునేందుకు చట్టబద్ధ వ్యవస్థ
* సాంస్కృతిక, స్వదేశీ, స్థానిక ప్రజల ప్రతిభా వారసత్వాల రక్షణకు నైతిక నియమావళి ఏర్పాటు
* పంటలు, మొక్కల సంరక్షణపై అంతర్జాతీయ స్థాయి ప్రణాళిక.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Swine flu in hyderabad
Skywalk near secunderabad station soon  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more