వంశీ ఆశలను తారక్ ఎందుకు సమాధి చేశాడు? | NTR Didn't Like Vakkantham's Story

Ntr didn t like vakkantham s story

Junior NTR Didn't Like Vakkantham's Story, NTR Didn't Like Vakkantham's Story, Kalyan Ram clear airs on Vamshi's Project, NTR Vakkantham vamshi Project, Why Vamshi-NTR movie shelved

Kalyan Ram clear airs on Vamshi's Project with NTR.

ఎన్టీఆర్ కి అస్సలు నచ్చలేదంట

Posted: 10/17/2016 01:18 PM IST
Ntr didn t like vakkantham s story

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎవరి మూడ్ ఎలా మారిపోతుందో తెలియటం లేదు. ముందు ఓకే అయినా బడా ప్రాజెక్టులు సైతం ఉన్న పళంగా మారిపోతున్నాయి. అనుకున్న కాంబినేషన్ లు కాకుండా, హఠాత్తుగా రాత్రికి రాత్రే మొత్తం ‘కథ’ అంతా మారిపోతుంది. రీసెంట్ గా ఎన్టీఆర్ తదుపరి చిత్ర విషయంలోనూ ఇదే జరిగిన విషయం తెలిసిందే.

అశోక్, ఉసరవెల్లి లాంటి డిజాస్టర్ కథలు అందించినప్పటికీ, టెంపర్ తో తన లైఫ్ ని టర్న్ చేశాడు యాంకర్, రచయిత వక్కంతం వంశీ. అందుకే గ్యారేజ్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అతనితో చేయాలని డిసైడ్ అయ్యాడు తారక్. గ్యారేజ్ షూటింగ్ మధ్యలో ఉండగానే వంశీ స్క్రిప్ట్ వినిపించడం, అది ఓకే అయిపోవటంతో మరో రైటర్ మెగా ఫోన్ పట్టనున్నాడని అంతా అనుకున్నారు. కానీ, సీన్ రివర్స్ అయ్యింది. వంశీతో సినిమా తూచ్ అంటూ ఎన్టీఆర్ పక్కకు తప్పుకున్నాడు. ఆ వెంటనే ఆ అవకాశం మళ్లీ పూరికే దక్కింది.

ఆపై వంశీ ఆ ప్రస్టేషన్ ను మీడియా సాక్షిగా ప్రదర్శించాడు. కొంత మంది మూలంగా ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుందని ఓపెన్ గా ఫైర్ అయ్యాడు. దీంతో సోదరుడు కళ్యాణ్ రామ్ అసలు ఆ ప్రాజెక్టు ఎందుకు మిస్సయ్యిందో ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు సమాచారం.

వంశీ స్టోరీ లైన్ చెప్పినప్పుడు తాను విన్నానని, ఆపై సినిమాను ప్రొడ్యూస్ చేసేందుకు సిద్ధమైనట్లు చెప్పాడంట. అయితే ఆ తర్వాత చెప్పిన కథ నచ్చకపోవటం మూలంగానే సినిమాను పక్కన పెట్టామని కళ్యాణ్ వివరించాడని తెలుస్తోంది. ఒకవేళ వంశీ కథలో మార్పులతో వస్తే చేస్తారా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వకపోవటం విశేషం. ఇంకోవైపు పూరినే దీనంతటికి కారణం అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన వంశీ డైరక్షన్ ఆశలు సమాధి అయినట్లే అని అనుకోవాలేమో ! చూద్దాం మరేవరైనా అవకాశం ఇవ్వకపోతారా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vakkantham Vamshi  Direction  Junior NTR  Story Problem  shelved  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more