Mega Daughter Niharika's Wedding Fixed? మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,?

Mega daughter niharika s wedding fixed marriage in august

Mega daughter Niharika, Naga Babu’s daughter Niharika, Niharika tying the knots, latest social media post, Niharika, Niha marriage, coffee cup, ‘Ms Niha’, ‘Ms Niha’ and “Mrs.?”, Niha wedding, Chiranjeevi, IPS officer, Son, Naga Shaurya, Prabhas, Tollywood, movies, Entertainment

Looks like Naga Babu’s daughter Niharika is tying the knots. Going by her latest social media post, Niharika who writes her name in a short form as Niha, she is becoming misses. Posted a Starbucks coffee cup that has the name of ‘Ms Niha’ written it. But she did strike off ‘Ms Niha’ and wrote “Mrs.?”. This has led to speculations that her wedding has been fixed.

మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

Posted: 06/18/2020 06:26 PM IST
Mega daughter niharika s wedding fixed marriage in august

మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పెట్టిన తాజాపోస్టు. అమె ఓ కాఫీ కప్పును పోస్టు చేసి దానిపై మిస్ నిహా అని రాసి వుంది. మిస్ అన్న పదాన్ని కట్ చేసిన ఆమె.. మిస్సెస్ అని వున్న పదాన్ని జతచేసింది. ఇక పైపెచ్చు దాని పక్కన ఓ క్వశ్చన్ మార్క్ కూడా పెట్టింది. దీంతో మెగా అభిమానుల్లో ప్రశ్నలు ప్రస్పుటించాయి,

నిహారిక పెళ్లి విషయంలో ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి. ఎవరికి తోచిన విధంగా వాళ్లు రాసారు. రెబల్ స్టార్ ప్రభాస్ తో అమెకు పెళ్లి కుదిరిందని కూడా రూమార్లు వచ్చినా.. వాటిని అమెతో పాటు నాగబాబు కూడా ఖండించారు. ఆడపడుచు అందులోనూ మెగా ఫ్యామిలీకి చెందిన ఆడపడచు కావడంతో ఈ రూమర్ల వస్తుంటాయని తెలిసి.. తొలుత మౌనంగా వున్నా.. తరువాత కాసింత ఘాటుగానే మెగాస్టార్ చిరంజీవి వార్న్ చేసేసరకి ఆ వార్తలకు చెక్ పడింది. ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయండీ అని చిరంజీవి అన్న మాటతో మీడియా వదిలేసింది. అయితే ఆ తరువాత కొన్నాళ్లకు నాగబాబు ఓ మీడియాతో ఇంటర్య్యూలో నిహరిక పెళ్లి విషయాన్ని ప్రస్తావించారు.

ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌లతో బిజీగా మారిన నిహారికకు త్వరలో పెళ్లి చేసేస్తామని నాగబాబు చెప్పారు. అందులోనూ వచ్చే ఏడాది నిహారిక పెళ్లి ఉంటుందని అన్నారు. తప్పకుండా వచ్చే వేసవిలో నిహారిక పెళ్లి ఉంటుందని చెప్పారు. ఇక అప్పటికీ సంబంధాలను చూస్తున్నామనే చెప్పారు. వరుడ్ని వెతికే పనిలోనే వున్నామని.. అన్నివిధాల మంచి కుటుంబం నుంచి సంబంధం వస్తే పరిశీలిస్తామని అన్నారు. అయినా అప్పటికే వరుడు కూడా ఫిక్స్ అయ్యాడా.? అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వచ్చాయి. ఇక కొణిదెల వారి ఇంటి నుంచి ఎప్పుడు ఆ శుభవార్త వస్తుందోనని మెగా ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.  

ఇదే సమయంలో నిహారిక పెట్టిన తాజా పోస్టు మీడియా సంస్థలకు చక్కని కాఫీ లాంటి వార్తను అందించింది, అంతే కరోనా కలకలంతో చతికిల పడ్డ మీడియా సంస్థలకు కావాల్సినంత రాసుకునేందుకు వార్త లభించింది. స్టార్ బక్స్ కాఫీ కప్ మీద `మిస్ నీహ` అని రాసి ఉండగా.. మిస్ అన్న పదాన్ని కొట్టేసి.. మిస్సెస్ (Mrs) అనే పదాన్ని జోడించి దాని పక్కన క్వశ్చన్ మార్క్ పెట్టింది. దాన్ని తన ఇన్ స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేసి `ఉహ్.. వాట్?` అని కామెంట్ చేసింది. ఈ పోస్టును చూసిన చిరంజీవి కూతుళ్లు సుస్మిత, శ్రీజ కూడా కామెంట్లు పెట్టారు. ఎందుకు (Why) అంటూ నిహారికను ప్రశ్నించారు. దీంతో నిహారిక పెళ్లి ఊహాగానాలకు ఊతమిచ్చినట్లు అయ్యింది. కొందరు నెటిజనులు అప్పుడే ఆమెకు కంగ్రాట్స్ కూడా చెప్పేశారు. అయితే మరికొందరు మాత్రం ఇదంత సినిమా ప్రమోషన్ కోసమేనంటున్నారు.

ఈ విషయాలను పక్కన బెడితే పెళ్లి కుదిరిందన్న వార్త మాత్రం నిజమని ఫీల్మ్ నగర్ వర్గాల టాక్. నిహారిక పెళ్లిపై త్వరలోనే మెగా ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని కూడా ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇక దీంతో మరిన్నీ ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇంతకీ మెగా డాటర్ వరించనున్న వరుడు ఎవరు.? ఏం చేస్తుంటాడు.? సినిమారంగానికి చెందినవాడేనా.? లేక మరెవరు.? ఏ సామాజిక వర్గానికి చెందినవాడు.. అతనికి అన్నదమ్ములు ఎంతమంది.? అక్కాచెలెళ్లు ఎంతమంది.? ఇలా అభిమానుల మదిలో అనేకానేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే చిరంజీవి సామాజిక వర్గానికే చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి.. ఐపీఎస్ అధికారి కుమారిడితో నిహారిక నిఖా పక్కా అయ్యిందని ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం.

నిహారికకు కాబోయే వరుడు ఎంఎన్సీ కంపెనీలో ఉన్నతమైన పోస్టులో అధికారిగా వ్యవహరిస్తున్నారని సమాచారం, మెగాస్టార్ చిరంజీవికి దృష్టికి ఈ విషయం రావడంతో ఆయన పచ్చజెండా ఊపారని.. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు కూర్చని మాట్లాడారని సమాచారం. ఇక ఆగస్టుతో ప్రారంభం కానున్న శ్రావణ మాసంలో కళ్యాణ బాజాభజంత్రీలు కూడా మ్రోగవచ్చని సినీవర్గాల సమాచారం. పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా.. నిహారిక తనకు కాబోయే వరుడితో ఒకటిరెండు పర్యాయాలు కలిసి మాట్లాడుకున్నారని.. ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న తరవాత పెళ్లికి అంగీకారం తెలిపారని.. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లిని నిశ్చయించుకున్నారని సమాచారం. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Niharika  Wedding  Mega Daughter  Naga Babu  Chiranjeevi  Varun Tej  IPS officer  Son  Naga Shaurya  Prabhas  Tollywood  

Other Articles

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

  • Allu arjun trivikram srinivas film titled alakananda

    ఆ సెంటిమెంటునే అల్లుఅర్జున్-త్రివిక్రమ్ సినిమా.?

    Apr 26 | త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కాంబినేషన్లోని సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథ ఇది. కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్న త్రివిక్రమ్, కీలకమైన పాత్ర కోసం 'టబు'ను... Read more

Today on Telugu Wishesh