jr ntr and hrithik roshan movies are releasing overseas same day

Jr ntr and hrithik roshan movies are releasing overseas same day

jr ntr movies, jr ntr overseas, hrithik roshan movies, janatha garrage overseas, janatha garrage outside bussiness, hrithik roshan vs jr ntr

jt ntr and hrithik roshan movies are coming on this august same date. the overseas business already done. now problem is screens. they are number of screens occupying bollywood movies.

మనిద్దరి మధ్యనే గట్టిపోటీ...!

Posted: 06/08/2016 02:01 PM IST
Jr ntr and hrithik roshan movies are releasing overseas same day

ఇప్పటివరకు మన టాలీవుడ్ స్టార్ హీరోల మధ్యనే పోటీ ఉండేది. కానీ, ఇప్పుడు టాలీవుడ్ నుంచేకాకుండా మన హీరోలు ఇతర పరిశ్రమల హీరోలతోనూ పోటీపడాల్సి వస్తోంది. ప్రస్తుతం తమిళ హీరోలతో ఇబ్బంది పడుతున్న కుర్రాళ్లు ఇప్పుడు బాలీవుడ్ హీరోలతోనూ సై అనాల్సి వస్తోంది. అసలు విషయం ఏంటంటే,

ఓవర్సీస్ మార్కెట్ అనేది సినిమా పరిశ్రమకు ఎంతో ఇంపార్టెంట్. అన్ని సినీ పరిశ్రమలు అక్కడ వసూళ్లపైనే ఎక్కువ దృష్టిపెడతాయి. ఇప్పుడు టాలీవుడ్ కూడా ఓవర్సీస్ నే నమ్ముకుని చాలా సినిమాలు హై బడ్జెట్ లో తీస్తున్నాయి. ముఖ్యంగా మన స్టార్ హీరోలంతా అక్కడి అభిమానాన్నే కాదు సొమ్మును క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఈ పోటీకి ఎన్టీఆర్ తో సై అంటున్నాడు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్.
'నాన్నకు ప్రేమతో' సినిమాతో ఓవర్సీస్ లో మంచి మార్కెట్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల డైరక్షన్ లో తెరకెక్కే జనతాగ్యారేజ్ ని కూడా భారీ స్క్రీన్లపై విడుదల చేయాలనుకుంటున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 12న విడుదల చేయడానికి రెడీ అయ్యారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ హీరో హృతిక్ కూడా అదే రోజున తన 'మొహొంజో దారో' సినిమాను విడుదల చేయబోతున్నాడు. దీంతో ఓవర్సీస్ లో స్క్రీన్ల కోసం డిమాండ్ ఏర్పడుతోంది. ఇప్పుడు ఈ హీరోల సినిమాల మద్యనే ఎక్కువగా పోటీ జరుగుతోంది. అయితే, బాలీవుడ్ సినిమా అంటేనే ఓవర్సీస్ లో పడి చచ్చే జనం ఇప్పుడు తెలుగు సినిమాలు కూడ అదే రేంజ్ లో రావడం అనేది టాలీవుడ్ లో శుభసూచకం అని చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
 
ఎవరు ఎక్కువ స్క్రీన్లను ముందుగా బుక్ చేసుకుంటారో వాళ్లకే కలెక్షన్లు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి ఇటు ఎన్టీఆర్ అటు హృతిక్ లో ఎవరు పోటీలో నెగ్గుతారన్నది ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది.  
 
- మూర్తి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jr ntr  hrithik roshan  janatha garage  mohamjo dhari  jr ntr vs hrithik  overseas bussiness  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more