Director Shankar is planning to make robo sequel movie with 300 crores budget | Rajinikanth | Chiyan Vikram

Shankar robo 2 movie budget 300 hundred crores rajinikanth vikram

director shankar, rajinikanth, robo sequel, chiyan vikram, tollywood gossips, telugu movies, kollywood news, robo 2 movie updates, shankar movies, shankar gossips, rajinikanth robo movie

shankar robo 2 movie budget 300 hundred crores rajinikanth vikram : According to kollywood gossips the news going viral that shankar is making robo sequel with 300 crores budget.

శంకరా.. మరీ ఎక్కువైపోయిందిగా!

Posted: 05/30/2015 04:09 PM IST
Shankar robo 2 movie budget 300 hundred crores rajinikanth vikram

ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకుల్లో తమిళ దర్శకుడు శంకర్ ఒకడు. ఓ సినిమాను ఏ విధంగా తెరకెక్కిస్తే ప్రేక్షకులు చూస్తారో అనే ప్రశ్నకు సరైన సమాధానంగా శంకర్ పేరుని చెప్పుకుంటారు. ఎందుకంటే.. ఇంతవరకు ఈయన తెరకెక్కించిన సినిమాలన్నీ ఆ రేంజిలో హిట్ అయ్యాయి కాబట్టి. అయితే.. నిర్మాతలతో మరీ ఎక్కువ ఖర్చు చేయిస్తాడని ఈయనకు పేరుంది. కానీ.. ఎంత బడ్జెట్టుతో అయితే శంకర్ సినిమా తీస్తాడో.. అందులో ప్రతి రూపాయి విలువ కనిపిస్తుంది. అంత అద్భుతంగా తెరకెక్కించే ఈ దర్శకుడు.. ఇటీవలే ‘ఐ’ సినిమాతో కాస్త పరాభావం ఎదుర్కొన్నాడు. ‘ఐ’ చిత్రాన్ని అందంగా తెరకెక్కించడంలో శంకర్ సక్సెస్ అయ్యాడు కానీ.. మ్యాజిక్ చేయలేకపోయాడు. దీంతో తాను తీయబోయే తదుపరి చిత్రంతో ఎటువంటి తప్పులు దొర్లకుండా వుండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

‘రోబో’ లాంటి వండర్ సినిమాను తెరకెక్కించి సరికొత్త రికార్డులకు తెరదీసిన శంకర్.. ఆ సినిమాకు సీక్వెల్ రూపొందించి సంచలనం సృష్టించేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్ర్కిప్టు పని చివరిదశకు చేరిందని కోలీవుడ్ యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ‘రోబో’ కంటే ఈ చిత్రం మరింత అద్భుతంగా వుండబోతుందని, ప్రేక్షకులు ఆశ్చర్యపోయే విధంగా సరికొత్త కథాంశంతో శంకర్ ముందుకు రానున్నాడని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇక ఈ సినిమాలోనూ సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు విలన్ గా షారుఖ్ నటిస్తాడని వార్తలొచ్చాయి కానీ.. వాటిలో ఏమాత్రం వాస్తవం లేదని తాజా సమాచారం. దీంతో ఆ విలన్ పాత్రలో మరో హీరో విక్రంను తీసుకుంటున్నారని చెబుతున్నారు. అయితే.. ఈ విషయంపై ఇంకా అధికారిక వార్తలు వెలువడాల్సి వుంది.

ఇదిలావుండగా.. శంకర్ సినిమా అంటే దాని బడ్జెట్ భారీ స్థాయిలో వుంటుందన్న విషయం తెలిసిందే! ‘ఐ’ చిత్రాన్ని రూ.180 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించి ఇండియన్ హిస్టరీలోనే సరికొత్త రికార్డు సృష్టించిన ఈ డైరెక్టర్.. ‘రోబో’ సీక్వెల్ కి అంతకంటే ఎక్కువే బడ్జెట్ వెచ్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు రూ.300 కోట్లు బడ్జెట్ శంకర్ నిర్మాతలతో వెచ్చిస్తున్నాడని కోలీవుడ్ లో టాక్! అయితే.. ఇందులో నిజనిజాలు ఎంతవరకు వున్నాయో తెలీదు. ఒకవేళ అది నిజమైతే.. సినిమా సక్సెస్ అయితే ప్రాబ్లమ్ లేదు కానీ ‘ఐ’లాగే షాక్ తగిలితే నిర్మాతలు రోడ్డున పడాల్సిందేనని అంటున్నారు. కానీ.. అంత బడ్జెట్ తో నిర్మించినప్పటికీ ఖచ్చితంగా వసూళ్లు వస్తాయన్న నమ్మకాన్ని కొందరు వెలిబుచ్చుతున్నారు. మరి.. ఈ బడ్జెట్ విషయంపై ఎంతమాత్రం నిజముందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : director shankar  robo sequel  rajinikanth  chiyan vikram  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more