Ntr | sukumar | new stills

Ntr stylish new look for sukumar movie

Ntr new look for sukumar movie, Ntr sukumar movie title Nannaku Prematho, Rakul Preet singh romance with NTR, Jagapathi babu in NTR next film, NTR movie updates, NTR stills, NTR posters, NTR latest stills, NTR Sukumar news, NTR Sukumar movie news, NTR Sukumar movie, NTR movie news, NTR movie updates, Temper, Ntr, Sukumar, Jagapathi Babu, Rakul Preet singh

Ntr stylish new look for sukumar movie: Young tiger latest upcoming movie with director sukumar. rakul preet singh heroine. devisriprasad music.

బాబోయ్... ఎన్టీఆర్ స్టైలిష్ న్యూ లుక్ ఇదేనా?

Posted: 05/07/2015 12:17 PM IST
Ntr stylish new look for sukumar movie

‘టెంపర్’ వంటి భారీ హిట్ చిత్రం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఇండియా లిమిటెడ్‌ పతాకంపై నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే లండన్ లో షూటింగ్ ప్రారంభమయ్యింది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ ను సుకుమార్ చాలా స్టైలిష్ గా చూపించబోతున్నాడని గతకొద్ది రోజులుగా వార్తలొస్తూనే వున్న విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ఇదివరకే ‘టెంపర్’ సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపించాడు. ఇంతకంటే స్టైలిష్ గా అంటే ఎలా వుండబోతున్నాడా అని అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ నెలకొంది. కానీ ఇందుకు భిన్నంగా ఎన్టీఆర్ కొత్తలుక్ తో దర్శనమిచ్చి షాకిచ్చాడు.

తాజాగా నందమూరి జానకీరామ్ తనయుడు మాస్టర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దానవీరశూరకర్ణ’ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ముఖ్య అతిథులుగా విచ్చేసారు. ఇక్కడ ఎన్టీఆర్ ను చూసిన వాళ్లంతా ఒక్కసారిగా షాకయ్యారు.

ఎన్టీఆర్ తన స్టైలిష్ లుక్ ను పక్కన పెట్టేసి, బాగా గడ్డం పెంచేసి ఓ దేవదాసులా తయారయ్యాడు. మరి ఈ లుక్ సుకుమార్ సినిమాకోసమేమో అని అందరూ భావిస్తున్నారు. ఒకవేళ సుకుమార్ సినిమాలోని ఎన్టీఆర్ లుక్ ఇదే అయితే... ఇక సినిమా ఎలా వుండబోతుందో... సుకుమార్ ఎలాంటి ప్రయోగాలు చేయబోతున్నాడోనని నందమూరి అభిమానులు మరింత కంగారు పడుతున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ సరసన తొలిసారిగా రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ప్రముఖ నటుడు జగపతి బాబు ఇందులో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లుగా తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Ntr  sukumar  new stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more