నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘లయన్’ చిత్రం విడుదల మళ్లీ వాయిదా పడింది. ముందుగా ‘లయన్’ చిత్రాన్ని మే 1న విడుదల చేయాలనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ చిత్రాన్ని మే 8కి వాయిదా వేసారు. కానీ తాజా సమాచారం ప్రకారం మే 8న కూడా ‘లయన్’ విడుదల అవ్వట్లేదని తెలిసింది.
ఫైనాన్సియల్ సమస్యల వల్ల ‘లయన్’ చిత్రాన్ని మే 14 లేదా 15 తేదికి వాయిదా వేసినట్లుగా సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అలాంటిది ఇలా ‘లయన్’ సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేస్తుండటంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.
ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మించిన ఈ చిత్రం ద్వారా సత్యదేవా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. త్రిష, రాధిక ఆప్టేలు హీరోయిన్లుగా నటించారు. మణిశర్మ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మాస్ హిట్ గా నిలిచాయి.
ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని, U/A సర్టిఫికెట్ ను దక్కించుకుంది. ఈ సినిమా మొత్తం సమయం 149 నిమిషాలు. ఫస్ట్ హాఫ్ 76 నిమిషాలు, సెకండ్ హాఫ్ 73 నిమిషాలు. ఇటీవలే విడుదలై ఈ చిత్ర ట్రైలర్లు, పాటలకు భారీ స్పందన వస్తుంది. మరి కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more