ఈ మధ్య ఓ అవార్డుల వేడుక కార్యక్రమంలో స్పెషల్ డాన్స్ చేస్తూ, తన హాటు క్లీవేజును భారీగా ప్రదర్శించి, తన ఎద అందాలను బహిర్గతం చేసి హాట్ టాపిక్ గా నిలిచిన సెక్సీ భామ రాగిణి ద్వివేది మరోసారి వార్తల్లో నిలిచింది. కన్నడలో హాటు హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ఇటీవలే తెలుగులో హీరో నానితో కలిసి ‘జెండాపై కపిరాజు’ చిత్రంలో నటించింది. కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో తెలుగులో అవకాశాలు రావడం లేదు.
కానీ కన్నడంలో మాత్రం ఈ అమ్మడికి భారీ క్రేజ్ వుంది. తన హాట్ హాట్ అందాలతో అక్కడి ప్రేక్షకులకు పిచ్చేక్కించేస్తోంది. అలాంటి ఈ అమ్మడిని ఓ నిర్మాత తన గర్ల్ ఫ్రెండ్ గా ప్రకటించుకోవడంతో... రాగిణి కోపం నషాలానికెక్కినట్లయ్యింది. నాకు తెలియకుండా నేనెలా వేరే వాళ్లకు గర్ల్ ఫ్రెండ్ ను అవుతానని రాగిణి ఆ నిర్మాతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాగిణి తన గర్ల్ ఫ్రెండ్ అని, తానే రాగిణికి బాయ్ ఫ్రెండ్ అంటూ కన్నడ చిత్ర నిర్మాత శివప్రకాష్ ప్రకటించడంతో రాగిణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుతం రాగిణి ‘నాట్టికోలి’ అనే కన్నడ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు జరిగాక.. సరిగ్గా షూటింగ్ రోజే ఈ న్యూస్ తెలియడంతో... రాగిణి షూటింగ్ కు వెళ్లలేదట.
దీంతో ఈ ‘నాట్టికోలి’ చిత్ర నిర్మాతకు దాదాపు ఐదున్నర లక్షల వరకు నష్టం వచ్చినట్లుగా సమాచారం. ఈ విషయంపై నిర్మాతల సంఘంలో శివప్రకాష్ పై ఫిర్యాదు చేసారు. మరి నిర్మాతల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కానీ శివప్రకాష్ చేసిన కామెంట్లకు రాగిణి తీవ్రంగా స్పందించింది.
తాను ఎవరితో డేటింగ్ చేయట్లేదని, శివప్రకాష్ కావాలనే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని, ఇందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఒక మహిళపై వేలెత్తి చూపే ముందు వారి కుటుంబసభ్యుల గురించి కూడా కాస్త దృష్టిలో వుంచుకోవాలిని, ఇలాంటి తప్పుడు పనులు చేయడం తప్పంటూ శివప్రకాష్ రాగిణి ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే శివప్రకాష్ పై నిర్మాతల సంఘంలో ఫిర్యాదు చేయాల్సిందిగా ‘నాట్టికోలి’ చిత్ర నిర్మాతలకు సూచించింది తానేనని చెప్పుకొచ్చింది. మరి ఈ విషయంపై ఎవరు, ఎలా స్పందిస్తారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more