Pawan kalyan latest movie gabbar singh 2 movie updates

pawan kalyan latest news, pawan kalyan gabbar singh 2 movie, pawan kalyan movie updates, pawan kalyan press meet, pawan kalyan interview, pawan kalyan gossips, pawan kalyan photos, pawan kalyan gabbar singh movie, gabbar singh 2 movie updates, gabbar singh 2 movie story

pawan kalyan latest movie gabbar singh 2 movie updates : pawan kalyan is ready to do his latest movie gabbar singh 2. the script work is almost complete and pre production works on progress. from february this movie goes floor on shooting process.

ఎట్టకేలకు పవన్ రంగంలోకి దిగిపోయారంతే!

Posted: 01/23/2015 06:18 PM IST
Pawan kalyan latest movie gabbar singh 2 movie updates

ఏ పనినైనా ప్రారంభించడానికి ముందు అందుకు కావాలసిన అన్ని వ్యవహారాలను చక్కదిద్దుకున్న తర్వాత చేసుకుంటే.. అది మంచి కార్యరూపం దాల్చుతుందని అంటుంటారు! అటువంటి సమయాల్లో ఓర్పుతోపాటు ఆత్మవిశ్వాసం వుంటే.. ఆయా పనులను ఇంకా బాగా రూపుదిద్దుకోవచ్చు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే.. ఆయన కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. అందరిలాగా దుందుడుకుగా వ్యవహరించకుండా సమయానుకూలంగా ఒకదాని తర్వాత మరొక నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు కొనసాగుతున్నారు. అందుకే.. ఆ మధ్య పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఈయన.. కొన్నాళ్లపాటు మూవీలపై దృష్టి సారించలేదు. అనంతరం మళ్లీ సినిమాలపై దృష్టి సారించిన ఈ నటుడు.. ప్రేక్షకులు మెచ్చే కథనం ‘గోపాలా గోపాలా’తో గ్రాండ్’గా ఎంట్రీ ఇచ్చారు.

నిజానికి ఈ ‘గోపాలా గోపాలా’ చిత్రం కంటే పవన్ ‘గబ్బర్ సింగ్-2’ మూవీ చేయాల్సి వుండేది. మొదటి భాగం తీసిన వెంటనే దీనిని తెరకెక్కించాలని ఆయన అనుకున్నారు కానీ.. అప్పట్లో ఎదురైన కొన్ని పరిణామాల నేపథ్యంలో దానిని నిలిపివేయడం జరిగింది. తిరిగి ప్రారంభించాలని పవన్ స్వయంగా రంగంలోకి దిగినా.. ఎక్కడైనా తప్పు దొర్లుతుందోమోనన్న భయంతో ఆ మూవీకి కాస్త గ్యాపిచ్చారు. ఇంతలోనే నిర్మాత సురేష్ బాబు ‘గోపాలా గోపాలా’ స్ర్కిప్ట్’ను ఆయన ముందుంచగా.. అప్పుడున్న పరిస్థితుల్లో ఆ మూవీ చేస్తేనే బెటర్ అని భావించి అందుకు వెంటనే ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఆ చిత్రం మంచి విజయం సాధించడంతోబాటు కలెక్షన్లను బాగానే రాబట్టుకుంటోంది.

ఇక ఆ చిత్రం అనంతరం ఖాళీగానే వున్న పవన్.. ఇదే మంచి సమయమని భావించి తిరిగి తన పాత ప్రాజెక్ట్ ‘గబ్బర్ సింగ్-2’ చిత్రాన్ని సెట్స్’పైకి తీసుకెళ్లే పనిలో నిమగ్నమైపోయారు. స్వయంగా తన పెన్నుకు పనిచెప్పి కథ రాసుకున్న పవన్.. ఇందులో ‘జానీ’ మూవీలాగా తప్పులు చోటు చేసుకోకూడదనే భావనతో దర్శకుడు బాబీ సహాయాన్ని తీసుకున్నారు. అతనికే దర్శకత్వ బాధ్యతలు కూడా అప్పగించారు. దీంతో వీరిద్దరి ముందుగా స్ర్కిప్ట్ పనిపై దృష్టి సారించారు. ‘గబ్బర్ సింగ్’ చిత్రంతో ఎటువంటి పోలికలు లేకుండా సరికొత్త ఎలిమెంట్స్’ను జోడించాలనే ఉద్దేశంతోనే ఎక్కువ సమయం స్ర్కిప్ట్ మీద వర్క్ చేయాల్సి వచ్చింది. పవన్, బాబీ దగ్గరుండి ఈ పనిని నిర్వర్తించడం జరిగింది.

అయితే.. ఎలాగోలా చివరికి స్ర్కిప్ట్ బాగా రావడంతో పవన్ తన ‘గబ్బర్ సింగ్-2’ ప్రాజెక్ట్’ను స్టార్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం! తానే దగ్గరుండి ఈ మూవీ వ్యవహారాలను ఇన్నాళ్లూ చూసుకున్న నేపథ్యంలో అన్ని సవ్యంగానే వున్నాయనే ఆలోచనతోనే పవన్ ఎట్టకేలకు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ మూవీపై ఆయన సన్నిహితులు అందించిన సమాచారం ప్రకారం.. ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్స్ పనులు చివరిదశకు చేరుకున్నాయి. ఫిబ్రవరి నుంచి ఈ మూవీ సెట్స్’పైకి తీసుకెళ్లే ఆలోచనలో చిత్రం టీ వుందని, గ్యాప్ లేకుండా త్వరగా షూటింగ్ ముగించుకుని త్వరలోనే అభిమానుల ముందుకు రావడం ఖాయమని వాళ్లు పేర్కొంటున్నారు.

అలాగే.. గతంలో పవన్ నడుం నొప్పితో సర్జరీ చేయించుకున్నట్లుగా వచ్చిన వార్తలను కూడా వాళ్లు కొట్టిపారేశారు. ఈ మూవీ స్ర్కిప్ట్ పవన్ ఎక్కువ ధ్యాస తీసుకోవడంతో కాస్త గ్యాప్ పాటించాల్సి వచ్చిందని వాళ్లు పేర్కొన్నారు. పవన్ కూడా షూటింగ్’లో పాల్గొనేందుకు సిద్ధంగా వున్నారని, త్వరలోనే గబ్బర్ అవతారంలో ఆయన్ను వీక్షించవచ్చునని వాళ్లు తెలుపుతున్నారు. ఇక ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మిస్తుండగా.. అనిషా ఆంబ్రోస్ హీరోయిన్’గా నటించనుంది. ఏదిఏమైనా.. ఈ చిత్రానికి పవన్ ఎన్నాళ్లూ టైమ్ తీసుకున్నా.. మంచి నిర్ణయమే తీసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more