Comedian cum hero sunil movie offers comedy roles tollywood directors

sunil latest news, hero sunil news, comedian sunil news, tollywood news, telugu film industry, hero sunil movies, comedian sunil movies, sunil movies, sunil photos, sunil tollywood, tollywood directors

comedian cum hero sunil movie offers comedy roles tollywood directors : Comedian turned hero sunil getting comedy roles offers from telugu directors.

ఆశగా వేచిచూస్తున్నా.. నిరాశే ఎదురవుతోంది!

Posted: 01/23/2015 05:39 PM IST
Comedian cum hero sunil movie offers comedy roles tollywood directors

కమెడియన్’గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సునీల్.. ఆ తర్వాత ‘అందాలరాముడు’ చిత్రంలో హీరోగా మారిన విషయం తెలిసిందే! ఏ విధంగా అతనిని ప్రేక్షకులు కమెడియన్’గా ఆదరించారో.. అదేవిధంగా హీరోగా చేసిన చిత్రాలను కూడా అంతే ప్రోత్సహించారు. దీంతో తన దశ తిరిగిందని భావించిన సునీల్.. కామెడీ ట్రాక్’ను వదిలేసి హీరోగా నిరూపించుకునేందుకు ఎక్కువ దృష్టి సారించాడు. అనుకున్నవిధంగానే మొదట్లో అతనికి ఆఫర్లు వరుసగా వచ్చాయి. ఇక దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘మర్యాదరామన్న’ చిత్రంలో నటించిన అనంతరం ఇతని క్రేజ్ అనూహ్యంగా పెరిగిపోయింది. అప్పుడు ఓ స్టార్ హీరోకు దక్కాల్సిన మర్యాదలూ ఇతనికి దక్కడంతో ఇతనితో మూవీలు తీసేందుకు దర్శకనిర్మాతలు క్యూ కట్టారు. అప్పట్లో నటించిన ‘పూలరంగుడు’ మంచి విజయమే సాధించింది.

అయితే.. ఆ మూవీ తర్వాత నటించిన ‘మిస్టర్ పెళ్లికొడుకు’, ‘భీమవరం బుల్లోడు’ చిత్రాలు పరాజయంపాలయ్యాయి. ఆ దెబ్బతో నిర్మాతలకు లాభం కాదు కదా.. ఖర్చు పెట్టిన డబ్బులు కూడా రాలేదు. నిర్మాతతోపాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా నష్టపోయారు. ఆ దెబ్బతో సునీల్ కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా వుండాల్సి వచ్చింది. ఏ దర్శకనిర్మాతలు కూడా అతనిని సంప్రదించలేదు. ఇప్పటికీ సునీల్ ఖాళీగానే వున్నాడు. ఒక్కసారిగా రెండు చిత్రాలు భారీగా ఫ్లాప్ కావడంతో సునీల్’కి హీరో ఫేం చాలావరకు తగ్గిపోయింది. అందుకే.. దర్శకనిర్మాతలు ఇతనితో మూవీ చేయడానికి ముందుకు రావడం లేదు. ఇతనితో మూవీ చేస్తే ఖర్చు చేసిన డబ్బులైనా వెనక్కి వస్తాయో లేదోనని భయపడుతున్నారని సమాచారం!

ఇదిలావుండగా.. సునీల్ కామెడీ అంటే ప్రేక్షకులు ఇప్పటికీ ఇష్టపడతారు. ఎందుకంటే.. సన్నివేశాలకు తగ్గట్టు తన ఫేస్ ఎక్స్’ప్రెషన్స్’తోనూ, డైలాగ్ డెలీవరీతోనూ ప్రేక్షకులను ఇట్టే నవ్వించేసే నటనప్రతిభతో ఇతనికే సొంతం! అంతెందుకు.. ఇతను హీరోగా నటించిన మూవీలన్నీ కామెడీ ట్రాక్’తో నడిచినవే! అందుకే.. ప్రస్తుతం హీరోగా కాకపోయిన దర్శకులు ఇతనికి కామెడీ పాత్రలకు ఆఫర్లు ఇస్తున్నారని ఇండస్ట్రీలో వార్తలొస్తున్నాయి. ఇప్పటికే కొందరు దర్శకులు సునీల్’కి ఫోన్ చేసి.. ‘కమెడియన్ రోల్ చేస్తావా?’ అంటూ ఆఫర్లు ఇచ్చారట! అయితే తిరిగి కామెడీ ట్రాక్’లోకి వెళ్తే తన ఇమేజ్ ఎక్కడ దెబ్బతింటుందోనన్న భయంతో సునీల్ వాటిని సున్నితంగా తిరస్కరించాడట!

అయినా కూడా కొందరు దర్శకులు తరుచూ ఫోన్స్ చేస్తూ సునీల్’ను కమెడియన్’గా నటించాల్సిందిగా కోరుకుంటున్నారట! ఇలా నిత్యం తనకు ఫోన్ కాల్స్ రావడంతో విసుగెత్తిన సునీల్.. అసహనం వ్యక్తం చేసినట్లు ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. అతను ఎట్టిపరిస్థితుల్లోనూ కమెడియన్ ట్రాక్’లో తిరిగి రాకూడదని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడని సమాచారం! మరి.. సునీల్ ఇలాగే మొండికేస్తూ వస్తున్న ఆఫర్స్’ను తిరస్కరిస్తే.. అతని కెరీర్ ఇబ్బందుల్లో పడే అవకాశముందని సినీవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : comedian cum hero sunil  tollywood directors  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more