Renu desai birthday special interview pawan kalyan divorce comment

renu desai interview, renu desai birthday special interview, renu desai interview on pawan kalyan, renu desai on pawan kalyan, renu desai movies, pawan kalyan movie updates, pawan kalyan gopala gopala first look photo teaser, renu desai pawan kalyan children, tollywood latest news updates

renu desai birthday special interview pawan kalyan divorce comment : tollywood and pawan kalyan fans interestingly talking about renu desai birthday special interview issue. renu desai says by twitter that on her birth day december 4th she will give a special interview and reveal personal issues for the first time

నీ క్లారిటీలో చాలా కన్ఫ్యూజన్ ఉంది రేణు

Posted: 12/03/2014 11:26 AM IST
Renu desai birthday special interview pawan kalyan divorce comment

పబ్లిసిటీ.., పాపులారిటీ అనే ఫీలింగ్ లో ఉండే సినిమా ప్రముఖులు ఇందుకోసం ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. తరుచుగా వెరైటీ, వివాదాస్పద కామెంట్లు చేస్తూ జనాల నోళ్ళలో నానుతుంటారు. ఎందుకిలా అంటే.., ఇలా చేస్తేనే కదా వారంటూ ఒకరున్నట్లు అందరికి తెలిసేది అని అంటారు. ఒకప్పటి నటి, ప్రస్తుత నిర్మాత కమ్ దర్శకురాలు రేణు దేశాయ్ కూడా ఇదే పార్ములాను ప్రయోగించింది. టాలీవుడ్ ట్రెండింగ్ పదమైన పవన్ ను పట్టుకుని పాపులారిటీ సంపాదిస్తోంది. ఎప్పుడూ పవన్ బేస్ గా ఏదో ఒక కామెంట్ చేస్తూ... ‘లేడీ ఆఫ్ ది డే’గా మీడియాలో నిలుస్తుంది.

ఇక పుట్టినరోజున ప్రత్యేక ఇంటర్వ్వూ పేరుతో ప్రస్తుతం టాలీవుడ్ మీడియాకు మైండ్ హీటెక్కించే స్టేట్ మెంట్ విడుదల చేసింది. సినిమాకు విడుదలకు ముందు ప్రోమో వచ్చినట్లుగా.., ఇంటర్య్వూకు ముందుగా వ్యక్తిగత విషయాలు, ఎప్పుడూ చెప్పని అంశాలు చెప్తాను అంటూ క్రేజ్ క్రియేట్ చేసుకుంటోంది. ‘నా పుట్టినరోజైన డిసెంబర్ 4న ప్రత్యేకమైన ఇంటర్య్వూ ఇస్తున్నాను. తొలిసారి నా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడబోతున్నాను. గురువారం రోజు మీ అందర్నీ యూట్యూబ్ లో కలుస్తాను’ అని ట్విట్టర్ లో కామెంట్ చేసింది. ఈ కామెంట్ ను చూస్తే బర్త్ డే రోజున కేవలం తన వ్యక్తిగత విషయాలను మాత్రమే వివరిస్తానని చెప్పినట్లు అర్థమవుతోంది. పవన్, పెళ్లి, విడాకుల గురించి మాట్లాడుతానని చెప్పలేదు. అయితే పెళ్లి కూడా వ్యక్తిగత విషయమే కదా అని బ్రాడ్ మైండ్ వ్యక్తులు కొందరు క్వశ్చన్లు వేయటంతో ఈ కామెంట్ కాస్తా కన్ఫూజన్ గా మారింది.

పెళ్లి అయి.., పిల్లలు పుట్టిన తర్వాత కొంతకాలం క్రితం పవన్-రేణు దేశాయ్ ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఆ తర్వాత పవన్ ఎప్పుడూ రేణు గురించి ఎక్కువగా స్పందించలేదు కానీ.., ఈమె మాత్రం నిత్యం నీ నామ స్మరణే స్వామి అంటూ టైం వచ్చినప్పుడల్లా పవన్ గురించి ఏదో ఒకటి మాట్లాడేస్తుంది. మరి పుట్టినరోజున ఇచ్చే ఇంటర్య్వూలో ఇంటిగుట్టు కూడా బయట పెడుతుందా.., లేక ఇప్పటికింతే అంటూ ముగిస్తుందా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ కూడా ఎదురుచూస్తోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  renu desai  interview  birthday  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more