Rajnikanth linga movie story copy allegations court dismissed case

rajnikanth linga movie, linga movie news, copy allegations, linga movie copy allegations, rajnikanth linga movie, linga movie release date, linga movie review, linga movie photos, linga movie posters, linga movie songs, linga movie actresses, rajnikanth latest news, rajnikanth movies, sonakshi sinha, sonakshi sinha hot photos, anushka shetty

rajnikanth linga movie story copy allegations court dismissed case

హమ్మయ్యా.. చివరకు రజనీకి ఊరట లభించింది!

Posted: 12/03/2014 09:25 PM IST
Rajnikanth linga movie story copy allegations court dismissed case

తమనుతాము ప్రచారం చేసుకోవడం కోసమో లేక ఇతరులను డామినేట్ చేయడం కోసమో తెలీదుగానీ.. ఈమధ్య కొంతమంది దర్శకనిర్మాతలు తమ సినిమాలను కాపీ కొడుతున్నారంటూ పెద్ద సినిమాలపై ఇండస్ట్రీలో తెగ ఫిర్యాదులు ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అయితే ఇటువంటి వివాదాలు ఇప్పటికే ఎన్నో చోటుచేసుకున్నాయి.. ఇంకా జరుగుతూనే వున్నాయి కూడా! ఈమధ్యకాలంలో టాలీవుడ్’లో ఆ సమస్యలు కాస్త తగ్గుముఖం పట్టాయికానీ.. తమిళంలో మాత్రం ఇంకా పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. బడాహీరోలను టార్గెట్ చేసుకుని వారి సినిమాల విడుదలకు ముందు కాపీ కొట్టారంటూ కంప్లైంట్లు చేస్తున్నారు. ఇక ఈ జాబితాలో రజనీ ‘లింగ’ కూడా చేరిపోయిన విషయం తెలిసిందే!

తమిళ సూపర్’స్టార్ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘లింగ’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. రజనీ జన్మదిన వేడుకల సందర్భంగా గ్రాండ్’గా చిత్రాన్ని విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు ఎప్పటినుంచో సిద్ధం చేసుకున్నారు. అయితే ఇంతలోనే దర్శకుడు రవికుమార్ తమ కథను కాపీ కొట్టి ‘లింగ’ చిత్రాన్ని తీశాడంటూ ఓ దర్శకనిర్మాత కోర్టుకెక్కాడు. దీంతో ఆ మూవీ టీమ్ ఆందోళనల్లో మునిగిపోయింది. విడుదలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోగా.. కాపీ వివాదం వల్ల ఎక్కడ ఆగిపోతుందోనని యూనిట్ వర్గాలతోపాటు రజనీ అభిమానులు, చిత్రాన్ని భారీరేటుకు కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు తెగ టెన్షన్ పడిపోయారు.

ఇదిలావుండగా.. ఈ విషయమై విచారణ చేపట్టిన కోర్టు ఆ సినిమాపై వున్న ‘కాపీ’ ఆరోపణలను కొట్టిపారేసింది. ‘లింగ’ కథ కాపీ కొట్టింది కాదని తేల్చి పారేసింది. దీంతో ఆ చిత్రం టీమ్ ఊపిరి పీల్చుకున్నారు. ముందుగా అనుకున్నట్లుగానే రజనీ పుట్టినరోజు డిసెంబర్ 12న ఏ అడ్డంకులు లేకుండా విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో అనుష్క శెట్టి, సొనాక్షి సిన్హా కథనాయికలుగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్టుతో నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 3వేల థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన చిత్రం ఇంత భారీ స్థాయిలో విడుదల కావడం ఇదే మొదటిసారి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : superstar rajnikanth  ks ravikumar  sonakshi sinha  anushka shetty  linga movie  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more