కన్ఫూజన్ లో కొందరు ఎక్కువ చేస్తే.., ఇంకొందరు ఏం చేయాలో తెలియకుండా ఉంటారు. ఇందులో డైరెక్టర్ క్రిష్ రెండవ టైప్ అనుకుంటా. మెగా ఫ్యామిలి యంగ్ హీరోలతో తన తదుపరి సినిమా అని చెప్పాడు. అయితే ఏ హీరోతో చేస్తాడు అనేది క్లారిటి ఇవ్వలేదని తెలుస్తోంది. ఇలా అనటానికి ఓ రీజన్ ఉంది. అదేమంటే కొద్దికాలంగా ముంబైలో ఉంటున్న క్రిష్, పుట్టినరోజు సందర్బంగా తెలుగు మీడియాతో మాట్లాడాడు. ప్రశ్నల్లో భాగంగా, తెలుగులో సినిమాలు చేయరా అని ప్రశ్నించగా.., అదేంలేదు త్వరలోనే చేస్తాను అని సమాధానం ఇచ్చారు.
ఎవరితో సినిామ చేస్తారు అని ప్రశ్నిస్తే.., ఓ మీడియా సంస్థతో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తో సినిమా చేస్తున్నా అని చెప్పాడు. మరో మీడియా సంస్థతో మాత్రం మెగా ఫ్యామిలి అల్లుడు సాయి ధరమ్ తేజ్ తో సినిమా చేస్తాను అని చెప్పాడు. ఇలా ఇద్దరి పేర్లు ఎందుకు చెప్పాడు అనేది అర్థం కావటం లేదు. ఆయన కన్ఫ్యూజ్ అయి చెప్పాడా లేక మీడియా వారు పేర్లు తికమకపడి అలా అర్ధం చేసుకున్నారా అనేది మాత్రం తెలియటం లేదు. అటు ఇద్దరు తేజులతో సినిమా చేస్తున్నాడా అనేది కూడా సస్పెన్స్ గానే ఉంది.
‘‘గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం’’ లాంటి మంచి సినిమాలు తీసిన క్రిష్ హిట్ మాత్రం కొట్టలేకపోయాడు. ప్రస్తుతం తెలుగు ‘ఠాగూర్’ ను రీమేక్ చేసే పనిపై ముంబైలో ఉన్నాడు. ‘ఠాగూర్’ సినిమాలో దాదాపు 60శాతం మార్పులు చేసి ‘గబ్బర్’ తీస్తున్నట్లు చెప్పాడు. ఈ ప్రాజెక్టులో తన మార్కు స్పష్టంగా కన్పిస్తుందని చెప్పాడు. సంజయ్ బన్సాలీ నిర్మించిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more