మెగాస్టార్ చిరంజీవి గురించి వార్త వచ్చిందంటే అది ఖచ్చితంగా ఆయన 150 సినిమా గురించి అని అంతా అనుకోవటం సహజం. అయితే ఈ వార్త మాత్రం ఆయన 150వ సినిమా గురించి కాదు. మంచి కధ, కారణంతో తెరకెక్కి, ప్రమోషన్ ఇబ్బందులు ఎదుర్కుంటున్న చిట్టితల్లి గురించి చిరు స్పందించారు. సినిమా బ్రతికేందుకు తాను ఊపిరిపోస్తానని చెప్పి ముందకు కదిలారు. నేషనల్ అవార్డు గెలుచుకున్న తెలుగు సినిమా ‘ నా బంగారు తల్లి’ సొంత భాషలో ప్రమోషన్ విషయంలో ఇబ్బందులు పడుతోంది.
విడుదలకు సిద్దంగా ఉన్నా.., ఆడియన్స్ లో మూవీ గురించి కనీసం టాక్ రాకపోవటంతో బంగారు తల్లి బెంగ పెట్టకుందట. ఇది తెలిసి చిరు, సినిమాను తాను ప్రమోట్ చేసేందుకు ఓకే చెప్పారని తెలుస్తోంది. దీని వల్ల సినిమాకు తగిని ప్రచారం లభించటంతో పాటు, డిస్ర్టిబ్యూటర్లు సినిమా తీసుకునేందుకు ముందుకు వస్తారని అనుకుంటున్నారు. చిరు ప్రచారంతో ‘నా బంగారు తల్లి’కి కష్టాలు తీరినట్లే అని చెప్పవచ్చు.
2013లో తెరకెక్కిన ఈ సినిమా ఓ యధార్ధ ఘటన ఆధారంగా నిర్మించటం జరిగింది. రాజేష్ తౌచ్చిర్విర్ డైరెక్ట్ చేసిన మూవీలో సిద్ధిఖి, అంజలి పాటిల్, రత్న శేఖర్, తదితరులు నటించారు. నేషనల్ ఫిలింఫేర్ అవార్డుల్లో ఈ సినిమాకు మూడు విభాగాల్లో అవార్డులు వచ్చాయి. త్వరలోనే విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతోన్న బంగారుతల్లికి ఆల్ ది బెస్ట్.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more