టాలీవుడ్ సినీ జనాలకు తెలిసినంత వరకు డీప్ లవర్స్ గా చెలామణి అవుతున్న సమంతా - సిద్దార్థ ల ప్రేమ వ్యవహారం చాటు మాటుగా సాగుతున్నా ఇప్పటి వరకు వారిద్దరిలో ఎవరూ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ సినీ జనాలకు తెలిసినంత వరకు వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో విహరిస్తున్నారని, వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని, అందులో భాగంగా ఓ అడుగు ముందుకు కూడా వేశారని అంటున్నారు.
దీనికి బలమైన కారణాన్ని కూడా సాక్ష్యంగా చూపెడుతున్నారు. ఇన్నాళ్ళ నుండి సమంతా వేళ్ళకు ఎలాంటి ఉంగరాలు లేవు. కానీ ఈ మధ్య కాలంలో ఆమె వేలికి కనిపిస్తున్న వజ్రపు ఉంగరాన్ని చూసి ఆమెకు సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ అయిపోయిందని, ఈ ఉంగరం ఖచ్చితంగా ఎంగేజ్ మెంట్ రింగే అని సినీ జనాలు, మీడియా అనుకంటున్నారు.
గతంలో సమంతా తాను రెండు మూడు సంవత్సరాల వరకు పెళ్ళి చేసుకునే ఆలోచన లేదని, ప్రస్తుతం కమీట్ అయ్యిన ప్రాజెక్టులు పూర్తి చేసిన తరువాత ఆలోచిస్తానని చెప్పింది. ప్రస్తుతం ఈమె చేతిలో ఉన్న సినిమాలు, కమీట్ అయ్యిన సినిమాలు పూర్తి కావడానికి కనీసం రెండేళ్ళయినా పడుతుంది.
అప్పటి వరకు పరిస్థితులు మారినా మారవచ్చని భావించిన సిద్దార్థ్ ఈమె దగ్గరి నుండి భరోసా కోసం సీక్రెట్ గా ఎంగేజ్ మెంటు చేసుకొని ఉంటారని అనుకుంటున్నారు. మరి ఈ ఎంగేజ్ మెంట్ వార్తల పై ఎవరో ఒకరు నోరు విప్పితే కానీ క్లారిటీ రాదు. అప్పటి వరకు మీకు ఎలా తోస్తే అలా అనుకోండి.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more