‘‘ఇంకా విత్తనమే నాటలేదు కానీ చెట్టు కాయలు కొనటానికి మంచి గిరాకీ వచ్చినట్లు ’’ పవన్ కళ్యాణ్ పార్టీ ఇంకా పెట్టకముందే.. భారీ ఎత్తున్న పార్టీకి విరాళాలు వస్తున్నట్లు టాలీవుడ్ సమాచారం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పార్టీ పై టాలీవుడ్ లో అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. మరికొంతమంది పవన్ కళ్యాణ్ కు సపోర్టుగా ముందుకు వస్తున్నారు.
అయితే మరో అడుగు ముందుకేసి ఒక బడా ప్రొడ్యూసర్ పవన్ కళ్యాణ్ పార్టికి 40 కోట్లు విరాళం ఇచ్చినట్లు టాలీవుడ్ టాక్. ఈ ప్రొడ్యూసర్ గతంలో.. వైఎస్ జగన్ తో మంచి స్నేహ సంబంధాలు ఉన్నట్లు సమాచారం. అయితే అనివార్య కారణాల వల్ల జగన్ కు ఈ బడా ప్రొడ్యూసర్ దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ పార్టీ పై దుష్టి పెట్టినట్లు సమాచారం.
పవన్ పార్టీకి 40కోట్ల విరాళం ఇస్తున్న ఒక ప్రొడ్యూసర్. ఇంతకీ ఆ నిర్మాత ఎవరో తెలుసా పివిపి బ్యానర్ పై సినిమాలు నిర్మించే ప్రముఖ పారిశ్రామిక వేత్త మరియు నిర్మాత పొట్లూరి వరప్రసాద్. గతంలో ఈ నిర్మాత పవన్ తో ఒక సినిమా తెరకెక్కిద్దామ్ అనుకున్న సంగతి తెలిసిందే, వీరిద్దరి కాంబోలో త్వరలోనే ఒక సినిమా రానుందని అధికారిక వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
పవన్ పార్టీలోనే తను ఉండాలని, పవన్ కి అన్ని విధాల సహాయపడాలని అందుకే పార్టీ మొదలుకానున్న సమయంలో మౌలిక వసతుల కోసం 40కోట్లు పార్టీకి విరాళంగా ఇచ్చినట్టు టాలీవుడ్ లో కధనాలు వినిపిస్తున్నాయి.
బడా నిర్మాత ముందుకొచ్చి పవన్ పార్టీకి 40 కోట్లు ఇవ్వటం వెనుక ఉన్న అర్థం ఏమిటో తెలియక .. టాలీవుడ్ లోని కొంతమందికి బీపీ పెరుగుతుందని ఫిలింనగర్ వాసులు అంటున్నారు. ఇలాంటి భారీ కోట్లు ఇవ్వటానికి చాలా మంది క్యూలో ఉన్నట్లు టాలీవుడ్ గుసగుసలాడుకుంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more