Interview with sanaya irani

Interview With Sanaya Irani, Sanaya Irani, TV actress, Television actress Sanaya irani,

Interview With Sanaya Irani, Sanaya Irani, TV actress, Television actress Sanaya irani,

ఇంటర్వ్యూ విత్ సానయ ఇరాని

Posted: 01/02/2013 12:58 PM IST
Interview with sanaya irani

Sanaya-Iraniకళకు భాషా భేదాలు ఉండవన్న మాట, నటన విషయంలో ముమ్మాటికీ నిజమేననిపిస్తుంది. కాబట్టే మన తెలుగు ప్రేక్షకులు డబ్బింగ్ సీరియల్స్‌ని సైతం ఆదరిస్తున్నారు. ఇటీవలి కాలంలో మనవారి మనసులు దోచుకున్న డబ్బింగ్ సీరియల్స్‌లో ‘చూపులు కలసిన శుభవేళ’ది ప్రముఖమైన స్థానం. తన అద్భుతమైన నటనతో ఆ సీరియల్‌కి వన్నె తెచ్చిన నటి సనయా ఇరానీ అంతరంగమిది.

మీ బ్యాగ్రౌండ్ గురించి చెబుతారా?

పుట్టింది ముంబైలోనే అయినా చదువు కోసం ఊటీ పంపేశారు. చిన్నప్పట్నుంచీ అక్కడే హాస్టల్లో ఉండి చదువుకున్నాను. డిగ్రీ కోసం మళ్లీ ముంబై వచ్చేశాను.

నటనవైపు అడుగులు ఎలా పడ్డాయి?

చిన్నప్పట్నుంచీ కెమెరా అంటే పిచ్చి నాకు. నటిని కావాలనుకోలేదు కానీ మోడలింగ్ వైపు వెళ్లాలని మాత్రం అనుకున్నాను. నటుడు బోమన్ ఇరానీ నా పోర్ట్‌ఫోలియో చూశారు. అప్పటికి ఆయన కూడా ఇంకా నటుడు కాలేదు. ఫొటోగ్రాఫర్‌గా ఉన్నారు. ఆయన వల్లే మోడలింగ్ చాన్స్ వచ్చింది. ఎయిర్‌టెల్, రిలయెన్స్, పెప్సీ లాంటి ప్రముఖ యాడ్స్‌లో కనిపించాను. అమితాబ్, షారుఖ్, ప్రియాంకా చోప్రా లాంటి ప్రముఖులతో పనిచేయడం మర్చిపోలేని అనుభూతి.

మరి సీరియల్స్‌కి ఎలా వచ్చారు?

యాడ్ రంగంలో బిజీగా ఉన్నప్పుడు ప్రముఖ గాయకుడు జగ్జీత్ సింగ్ ‘తుమ్‌కో దేఖాతో యే’ మ్యూజిక్ ఆల్బమ్‌లో నటించే చాన్స్ వచ్చింది. అప్పుడు బాగా పాపులర్ అయ్యా. దాంతో ఆమిర్‌ఖాన్, కాజోల్‌లు నటించిన ‘ఫనా’ సినిమాకి తీసుకున్నారు. అందులో హీరోయిన్ కాజల్‌కి ఫ్రెండ్‌గా చేశాను. అందులో నన్ను చూసి ‘లెఫ్ట్ రైట్ లెఫ్ట్’ అనే సీరియల్‌లో సమీర అనే పాత్ర చేయమని అడిగితే సరే అన్నాను. మంచి పేరు రావడంతో వరుసగా చాన్సులొచ్చాయి. కంటిన్యూ అవుతున్నా.మీ

కెరీర్‌లో అత్యంత తృప్తినిచ్చిన పాత్ర ఏది?

నిస్సందేహంగా ‘ఇస్ ప్యార్‌కో క్యా నామ్ దూ (చూపులు కలసిన శుభవేళకి మాతృక)’లో హీరోయిన్ పాత్రే. అంతకు ముందు ఎన్నో యాడ్స్ చేసినా, ఐదు సీరియల్స్‌లో నటించినా కూడా ఇంత పేరు రాలేదు. అందరికీ చాలా దగ్గరైపోయాను. చేసేటప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తున్నానో, జనం స్పందనను అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాను.

అవార్డులేమైనా అందుకున్నారా?

ఇప్పటికి ఆరు సార్లు ఉత్తమ సీరియల్ నటిగా అవార్డులు తీసుకున్నాను. ఇంకా చాలా తీసుకోవాలని ఉంది. ఎందుకంటే, అవార్డులనేవి నటీనటులకు ఎనర్జీ డ్రింకుల్లాంటివి. ఎన్ని తీసుకుంటే అంత ఉత్సాహం వస్తుంది.నటిగా మీరెలా ఉంటారో మాకు తెలుసు.

మరి వ్యక్తిగా ఎలా ఉంటారో తెలుసుకోవచ్చా?

చిన్నప్పట్నుంచీ హాస్టళ్లల్లో ఉండి చదవడం వల్లనుకుంటా... ఎవరి మీదా ఆధార పడకుండా బతకడం అలవాటయ్యింది. నాకు సంబంధించిన అన్ని నిర్ణయాలు నేనే తీసుకుంటాను. ఏం చేయాలో, ఎలా చేయాలో నేనే డిసైడ్ చేసుకుంటాను. వెళ్లాలనుకున్న దారిలో నిర్భయంగా, నమ్మకంగా సాగిపోతాను.

అంటే... దేనికీ భయపడరా?

అంత లేదు. బొద్దింకలు, బల్లులు, ఎలుకలు... వీటిని చూస్తే పరుగే పరుగు. అన్నింట్లో ధైర్యంగా ఉండే నేను, వీటి దగ్గర మాత్రం భయంతో వణికిపోతా.

sanaya_Irani_మీకు పెళ్లయ్యిందా?

ఇంకా లేదు. మంచి అబ్బాయి దొరికితే వెంటనే చేసుకోవడానికి రెడీ.

అంటే, ఎలాంటి అబ్బాయిని కోరుకుంటున్నారు?

మనిషి ఎలా ఉన్నా ఫర్వాలేదు కానీ అబద్ధాలు మాత్రం ఆడకూడదు. నాకు అబద్ధాలు చెప్పేవాళ్లంటే పరమ అసహ్యం. అలాగే అవతలివాళ్లు ఎలాంటివారైనా స్థాయీభేదాలు చూడకుండా గౌరవించే సంస్కారం గలవాడై ఉండాలి.

మీ ఫస్ట్ క్రష్ గురించి చెప్పండి?

ఐదో తరగతిలో ఉన్నప్పుడు మా క్లాస్‌లో ఓ అబ్బాయి ఉండేవాడు. తనంటే చాలా ఇష్టం. అతను ఒక్కరోజు రాకపోయినా ఏదోలా ఉండేది. కానీ ఆరో తరగతికి వెళ్లేటప్పటికి ఇష్టం పోయింది. అతడంటేనే కాదు, అసలు అబ్బాయిలంటేనే ఆసక్తి తగ్గిపోయింది. అమ్మాయిలకుండేంత తెలివి, ఓర్పు, మెచ్యూరిటీ వాళ్లలో ఉండవనిపించింది. తర్వాత్తర్వాత ఎప్పటికో ఆ అభిప్రాయం మారింది.

మీ జీవితలక్ష్యం ఏమిటి?

పెద్దగా ఏమీ లేదు. ఏ రంగంలో ఉన్నా దాని అంతు చూడాలని చిన్నప్పట్నుంచీ అనుకునేదాన్ని. ఇప్పుడు టెలివిజన్ ఫీల్డ్‌లో ఉన్నాను కదా. ఇక్కడ ఓ వెలుగు వెలగాలి. దానికోసం రాత్రీపగలూ కష్టపడుతున్నాను. చూద్దాం... ఎప్పటికి సాధిస్తానో!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Interview with prachi desai

    టీవి కమ్ యాక్ట్రస్ ప్రాచీదేశాయ్

    Aug 24 | టెలివిజన్ సీరియళ్లలో నటించినవాళ్లను సినిమా ఇండస్ట్రీ చిన్నచూపు చూస్తుంది అంటారు కొందరు. టీవీ వాళ్లు సినిమాలకు సరిపోరు అంటారు ఇంకొందరు. ఇలాంటి కామెంట్లన్నింటికీ ఒకే ఒక్క సమాధానం... ప్రాచీ దేశాయ్. ‘కసమ్‌సే’ సీరియల్‌లో మెరిసి,... Read more

  • Interview with mogalirekulu fame karuna

    మొగలిరేకులు ఫేం కరుణతో

    May 15 | 'బాలభవన్ ' నుండి 'బుల్లితెర ' వరకు కరుణ ప్రయాణం ... యావత్ టెలివిషన్ సీరియల్స్ అభిమానులనే ఉర్రూతలూగిస్తున్న సీరియల్ , శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వారు అందించే 'మొగలిరేకులు' . ప్రతీ రోజు రాత్రి... Read more

  • Interview with goreti venkanna

    ప్రజా గాయకుడు గోరేటి వెంకన్న

    Mar 26 | అందరికీ ఎలా గుర్తుండి పోవాలని కోరుకుంటారు?ఒక చెట్టులా... పుట్టలా... పక్షిలా... ప్రకృతిలో ఒక భాగంలా. అంతేతప్ప, ఓ గొప్ప వ్యక్తిగానో, మరో రకంగానో కాదు. తరచుగా వాడే మాట?నీ కాల్మొక్త! చాలాసార్లు నా నోటినుంచి... Read more

  • Tv actor gurmeet choudhary interview

    Mar 08 | సీరియల్‌లో హీరో అంటే ఎలా ఉంటాడు? కూల్‌గా, సాఫ్ట్‌గా, సింపుల్‌గా ఉంటాడు. ఇది గురుమీత్ చౌదరి రాక ముందు! అతడు అడుగుపెట్టాక సీరియల్ హీరో మారిపోయాడు. కండలు తిరిగిన శరీరం, రిచ్ లుక్‌తో మోడల్‌కి... Read more

  • Mogalirekulu ravi krishna interview

    మొగలిరేకులు రవి కృష్ణ ఇంటర్వ్యూ

    Feb 26 | ప్రశాంతంగా కనిపిస్తాడు. అందంగా నవ్వుతాడు. అంతకంటే అందంగా నటిస్తాడు. అందరినీ ఆకట్టుకుని అలరిస్తాడు. అతడే రవికృష్ణ. ఇలా చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు. మొగలిరేకులు ‘దుర్గ’ అంటే మాత్రం ఠక్కున గుర్తు పట్టేస్తారు. సెల్వస్వామి కొడుకుగా,... Read more