Tv actor gurmeet choudhary interview

tv actor gurmeet choudhary interview, interview with gurumeet choudhary, gurmeet choudhary serials, gurmeet choudhary acting.

tv actor gurmeet choudhary interview, interview with gurumeet choudhary, gurmeet choudhary serials, gurmeet choudhary acting.

tv actor gurmeet choudhary interview.png

Posted: 03/08/2013 08:39 PM IST
Tv actor gurmeet choudhary interview

gurmeet choudharyసీరియల్‌లో హీరో అంటే ఎలా ఉంటాడు? కూల్‌గా, సాఫ్ట్‌గా, సింపుల్‌గా ఉంటాడు. ఇది గురుమీత్ చౌదరి రాక ముందు! అతడు అడుగుపెట్టాక సీరియల్ హీరో మారిపోయాడు. కండలు తిరిగిన శరీరం, రిచ్ లుక్‌తో మోడల్‌కి ఎక్కువ, సినిమా హీరోకి తక్కువ అన్నట్టుగా తయారయ్యాడు. ఆ సూపర్‌హీరో గురుమీత్ ‘పునర్వివాహం’తో తెలుగువారికి కూడా దగ్గరయ్యాడు. తన మనసులోని మాటల్ని ఇలా చెబుతున్నాడు...

మీ బ్యాగ్రౌండ్ ఏమిటో చెప్తారా?

నేను ఏనాడూ ఒక్కచోట ఉన్నది లేదు. నాన్న సీతారామ్ చౌదరి ఆర్మీ ఆఫీసర్ కావడంతో చిన్నప్పట్నుంచీ రకరకాల ఊళ్లు తిరిగాం మేము. అందుకే పంజాబ్‌లో పుట్టినా... బీహార్, మధ్యప్రదేశ్, తమిళనాడుల్లో పెరిగాను.

‘పునర్వివాహం’ మీకు ఎన్నో సీరియల్?

నాలుగోది. మొదట నేను విలన్‌గా సీరియల్స్‌లోకి ఎంటరయ్యాను... ‘మాయావి’ అనే తమిళ సీరియల్‌తో. అది తెలుగలోకి కూడా డబ్ అయ్యింది. ఆ తర్వాత ‘రామాయణం’ (ఎన్డీటీవీ ఇమాజిన్), ‘గీత్’లలో నటించాను. ఇప్పుడు ‘పునర్వివాహం’ చేస్తున్నాను.

చేసింది నాలుగే సీరియల్స్. కానీ బాగా పాపులర్ అయ్యారు. ఎలా అనిపిస్తుంది?

చాలా హ్యాపీగా ఉంటుంది. ‘గీత్’ సీరియల్ స్టార్ ఒన్ చానెల్లో ప్రసారమయ్యేది. మంచి ప్రేమకథ. అది మొదలైనప్పట్నుంచీ విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది నాకు. ఎక్కడికి వెళ్లినా అందులోని పాత్ర పేరుతో ‘మాన్‌సింగ్’ అని పిలిచేవారు. ఇప్పుడు ‘పునర్వివాహం’ కూడా అంతే పేరు తెచ్చింది.

ఆ పాత్రలో చాలా కూల్‌గా కనిపిస్తారు. బయట కూడా అంతేనా?

దాదాపు అంతే. నా పనేదో నేను చూసుకుంటాను. కాకపోతే కాస్త షార్ట్ టెంపర్. కానీ ఎవరినీ హర్ట్ చేయను.

డ్యాన్స్ బాగా చేస్తారట?

డ్యాన్సంటే ప్రాణం నాకు. కలర్స్ చానల్లో ‘ఝలక్ దిఖ్‌లాజా’ అనే షోలో పాల్గొన్ని ఈ మధ్యనే ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాను. డ్యాన్స్ చేస్తూ నన్ను నేనే మర్చిపోతాను. అంత ఇష్టం!

ఫైట్స్ కంపోజ్ చేస్తారని తెలిసింది. స్టంట్ మాస్టర్ అయ్యే ఆలోచన ఏమైనా ఉందా?

(నవ్వుతూ) అలాంటిదేమీ లేదు. ఏదో సరదాకి చేస్తుంటాను. యాక్షన్ సీన్లు, ఫైట్లు అంటే ఇష్టం. పైగా మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందానేమో... అలా చేస్తుంటాను. అయినా ఎవరు చెప్పగలరు! భవిష్యత్తులో ఎప్పుడైనా చేస్తే చెయ్యొచ్చు.

సినిమాల మీద ఆసక్తి లేదా?

ఆసక్తి అనేది చాలా చిన్న మాట. సినిమాల్లో చేయాలన్నది నా కల... లక్ష్యం! టీవీ కోసం పనిచేస్తే అస్సలు సమయం చిక్కదు. అందుకే ఇన్నాళ్లూ ప్రయత్నించ లేకపోయా. ప్రస్తుతం ‘యార్ మేరా రబ్ వర్గా’ అనే సినిమాలో నటిస్తున్నాను. ముందు ముందు బాలీవుడ్ హీరోగా బిజీ అయిపోవాలనేదే నా ఆశ.

ఏదైనా డ్రీమ్‌రోల్ ఉందా?

హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ నటనని చాలా ఇష్టపడతాను. ముఖ్యంగా ‘టెర్మినల్’ చిత్రంలో ఆయన నటన అమోఘం. అవకాశం దొరికితే అలాంటి పాత్ర చేయాలనుంది.

gurmeet wifeప్రేమ... పెళ్లి...?

నా భార్య దెబీనా (‘అమ్మాయిలు అబ్బాయిలు’లో హీరోయిన్) మోడల్, నటి. ‘రామాయణం’లో నేను రాముడిగా, తను సీతగా నటించాం. అప్పుడే మా మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లితో జీవితం మారిపోతుందంటారు. నిజంగానే మారిపోయింది... ఎంతో అందంగా!

తనూ నటేగా. ఏమైనా సలహాలు ఇస్తుంటారా?

అప్పుడప్పుడూ. అయితే ఒకటి. ఇలా చేస్తే బాగుంటుంది అని చెబుతుంది గానీ ఇలా ఎందుకు చేశావ్ అని ఎప్పుడూ నిరుత్సాహపర్చదు. అంతేకాదు, తనకి ఓర్పు, అర్థం చేసుకునే గుణం చాలా ఎక్కువ. ‘గీత్’ సీరియల్ చేసినప్పుడు ఆ హీరోయిన్ గురించి, నా గురించి రూమర్స్ వచ్చాయి. అప్పుడు కూడా తను నన్ను ప్రశ్నించలేదు. పైగా ఆ హీరోయిన్‌తో ఎంతో క్లోజ్‌గా ఉండేది.

భవిష్యత్ ప్రణాళికలేమిటి?

ప్రణాళికలంటూ ఏమీ వేసుకోను. చేతిలో ఉన్న పనిని శ్రద్ధగా చేయడం, చేయబోయే పనిని ఎంత బాగా చేయాలా అని ఆలోచించడం తప్ప దేని గురించీ పెద్దగా టెన్షన్ పడను. ఏది జరగాలనుంటే అది జరుగుతుంది. అంతే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Interview with prachi desai

    టీవి కమ్ యాక్ట్రస్ ప్రాచీదేశాయ్

    Aug 24 | టెలివిజన్ సీరియళ్లలో నటించినవాళ్లను సినిమా ఇండస్ట్రీ చిన్నచూపు చూస్తుంది అంటారు కొందరు. టీవీ వాళ్లు సినిమాలకు సరిపోరు అంటారు ఇంకొందరు. ఇలాంటి కామెంట్లన్నింటికీ ఒకే ఒక్క సమాధానం... ప్రాచీ దేశాయ్. ‘కసమ్‌సే’ సీరియల్‌లో మెరిసి,... Read more

  • Interview with mogalirekulu fame karuna

    మొగలిరేకులు ఫేం కరుణతో

    May 15 | 'బాలభవన్ ' నుండి 'బుల్లితెర ' వరకు కరుణ ప్రయాణం ... యావత్ టెలివిషన్ సీరియల్స్ అభిమానులనే ఉర్రూతలూగిస్తున్న సీరియల్ , శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వారు అందించే 'మొగలిరేకులు' . ప్రతీ రోజు రాత్రి... Read more

  • Interview with goreti venkanna

    ప్రజా గాయకుడు గోరేటి వెంకన్న

    Mar 26 | అందరికీ ఎలా గుర్తుండి పోవాలని కోరుకుంటారు?ఒక చెట్టులా... పుట్టలా... పక్షిలా... ప్రకృతిలో ఒక భాగంలా. అంతేతప్ప, ఓ గొప్ప వ్యక్తిగానో, మరో రకంగానో కాదు. తరచుగా వాడే మాట?నీ కాల్మొక్త! చాలాసార్లు నా నోటినుంచి... Read more

  • Mogalirekulu ravi krishna interview

    మొగలిరేకులు రవి కృష్ణ ఇంటర్వ్యూ

    Feb 26 | ప్రశాంతంగా కనిపిస్తాడు. అందంగా నవ్వుతాడు. అంతకంటే అందంగా నటిస్తాడు. అందరినీ ఆకట్టుకుని అలరిస్తాడు. అతడే రవికృష్ణ. ఇలా చెబితే ఎవరికీ తెలియకపోవచ్చు. మొగలిరేకులు ‘దుర్గ’ అంటే మాత్రం ఠక్కున గుర్తు పట్టేస్తారు. సెల్వస్వామి కొడుకుగా,... Read more

  • Interview with sanaya irani

    ఇంటర్వ్యూ విత్ సానయ ఇరాని

    Jan 02 | కళకు భాషా భేదాలు ఉండవన్న మాట, నటన విషయంలో ముమ్మాటికీ నిజమేననిపిస్తుంది. కాబట్టే మన తెలుగు ప్రేక్షకులు డబ్బింగ్ సీరియల్స్‌ని సైతం ఆదరిస్తున్నారు. ఇటీవలి కాలంలో మనవారి మనసులు దోచుకున్న డబ్బింగ్ సీరియల్స్‌లో ‘చూపులు... Read more