అభినేత్రి రివ్యూ | Abhinetri telugu movie review

Teluguwishesh అభినేత్రి అభినేత్రి Abhinetri telugu movie review. Product #: 78212 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    అభినేత్రి

  • బ్యానర్  :

    ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పోరేషన్

  • దర్శకుడు  :

    ఏఎల్ విజయ్

  • నిర్మాత  :

    ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్

  • సంగీతం  :

    సాజిద్ వాజిద్, జీవి ప్రకాశ్ కుమార్

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • ఛాయాగ్రహణం  :

    మనుష్ నందన్

  • ఎడిటర్  :

    ఆంధోనీ

  • నటినటులు  :

    ప్రభుదేవా, తమన్నా, సోనూ సూద్, మురళీ శర్మ, సప్తగిరి, పృథ్వీ తదితరులు

Abhinetri Telugu Movie Review

విడుదల తేది :

2016-10-07

Cinema Story

కథ:
ముంబైలో ఓ కార్పొరేట్ కంపెనీలో పనిచేసే కృష్ణ(ప్రభుదేవా) కి వెస్ట్రన్ పద్ధతిలో ఉండే అమ్మాయిని చేసుకోవాలనే ఓ డ్రీమ్. అయితే ఇంట్లో వాళ్లు మాత్రం ఓ ఊరమ్మాయి అయిన దేవి(తమన్నా) ని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇక అందరి ముందు పరువు పోతుందన్న భయం ఓవైపు ఉన్నప్పటికీ, పెద్దొళ్ల బలవంతం మేరకు దేవిని తీసుకుని ముంబై వస్తాడు. అక్కడ ఎవరికీ తెలీకుండా ఓ పాత అపార్ట్ మెంట్ లో ఉంచుతాడు. తనను వదిలి వెళ్లిపోవాలంటూ దేవికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. ఇంతలో అదే ఇంట్లో అంతకు ముందు చనిపోయిన రూబీ అనే యువతి ఆత్మ దేవిలోకి ప్రవేశిస్తుంది.

ఇక అక్కడి నుంచి కృష్ణకు చుక్కలు కనిపిస్తాయి. మరోవైపు రాజ్(సోనూ సూద్) అనే సినిమా హీరో దృష్టిని తనవైపు మళ్లేలా చేసుకుంటుంది దేవి(ఆత్మ). అతని పక్కన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేయటంతోపాటు, అతన్ని కవ్విస్తుంటుంది. అయితే తన భార్యలోకి ఓ ఆత్మ దూరిందని తెలుసుకున్న కృష్ణ భార్యను ఎలాగైనా కాపాడుకోవాలని చూస్తుంటాడు. ఆ ప్రయత్నంలోనే భార్యపై ప్రేమ కూడా కలుగుతుంది. మరి చివరకు ఏం జరుగుతుంది? ఆ ఆత్మ అసలు దేవినే ఎందుకు పట్టుకుంటుంది. రాజ్ నే ఎందుకు టార్గెట్ చేస్తుంది? చివరకు ఏమైంది అన్నదే కథ.

 

 

cinima-reviews
అభినేత్రి

అప్పుడెప్పుడో స్టైల్ చిత్రంలో డాన్స్ మాస్టర్ గా కనిపించిన తర్వాత ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా తెలుగు స్ట్రెయిట్ చిత్రాలు చేసిన దాఖలాలు లేవు. దీంతో కొడితే ఒకేసారి కొట్టాలి అన్న చందాన అటు బాలీవుడ్ లో, ఇటు కోలీవుడ్ తోపాటు మధ్యలో ఉన్న టాలీవుడ్ ను కూడా లక్ష్యం చేసుకుని భారీ బడ్జెట్ తో ఓ చిత్రాన్ని తీశాడు.

తమన్నా లీడ్ రోల్ గా అభినేత్రి అంటూ హర్రర్ కామెడీ చిత్రాన్ని మన ముందుకు తెచ్చాడు. కోలీవుడ్ డైరక్టర్ విజయ్ దర్శకత్వం వహించాడు. రచయిత కొన వెంకట్ తెలుగులో నిర్మాతగా భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం ఏమేర ఆకట్టుకుందో చూద్దాం.

విశ్లేషణ:

ఒక సాధారణ కథను, అంతే సాధారణంగా చూపించాడు దర్శకుడు విజయ్.సాధారణంగా హర్రర్ కామెడీ చిత్రాలంటూ వచ్చిన వాట్లో చాలా వరకు భయం పుట్టించే సన్నివేశాలు ఉంటాయి. కానీ, అభినేత్రిలో అలాంటివి ఏం ఉండవు. బహుశా మిల్కీ లాంటి అందగత్తెను పెట్టడం మూలంగానో ఏమో ఆ ఎఫెక్ట్ అంతగా అనిపించదు. కానీ, కామెడీ పాలు మాత్రం అస్సలు తగ్గలేదు. ట్విస్ట్ లు ఉండవు, ముందు వచ్చే సీన్ ఏంటో తెలిసిపోతుంటుంది. కానీ, బోర్ కొట్టించకుండా సినిమా రెండు గంటలు థియేటర్ లో కూర్చోబెట్టేలా మాత్రం ఉంది. ఇక మూడు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయటం మూలంగానో ఏమో ఎడిటింగ్ అంతా సవ్యంగా లేదు. డబ్బింగ్ పాటలు, ఒక్కోసారి హిందీ, ఒక్కోసారి తమిళ్ లిప్ సింకుతో డైలాగులు రావటం గమనించవచ్చు. ఇంకో హైలెట్ ఏంటంటే... అటు హిందీ, ఇటు తమిళ వాసన తప్ప ఎక్కడా తెలుగు ఫ్లేవర్ కనిపించదు. 

కాస్టింగ్ పరంగా చూసుకుంటే... దెయ్యం బారిన పడిన తన అమాయకపు భార్యను కాపాడుకుంటూనే, సినిమా హీరో వలలో పడకుండా జాగ్రత్త పడే కన్ఫ్యూజ్ భర్త పాత్రలో ప్రభుదేవా బాగా చేశాడు. చిల్ పాటలో దేవా స్టెప్పులు చూస్తే మతి పోతుంది. ఇక తమన్నా తన పాత్రకు న్యాయం చేసింది. గ్లామర్ తోపాటు, డాన్సుల్లోనూ కుమ్మేసింది. సోనూసూద్ నెగటివ్ రోల్ తోనే కాదు, డాన్సులతో ఆకట్టుకోవటం విశేషం. సప్తగిరి పాత్ర నవ్వులు కురిపిస్తుంది. మురళి శర్మ, పృథ్వీ కూడా ఫర్వాలేదనిపించారు.

టెక్నికల్ అంశాల పరంగా... పాటలు సినిమాకు పెద్ద మైనస్ గా నిలిచాయి. బాలీవుడ్ పాటలనే డబ్బింగ్ చేసి వదలటంతో చికాకుపుట్టిస్తాయి. మనుష్ నందన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఆంటోనీ ఎడిటింగ్ గతి తప్పింది. భారీ బడ్జెట్ పెట్టడంతో ప్రోడక్షన్ వాల్యూస్ కి ఎక్కడా ఢోకా లేదు.

ఫ్లస్ పాయింట్లు:
సింపుల్ కథా, బోరింగ్ సన్నివేశాలు లేకపోవటం
నటీనటుల ఫెర్ఫార్మెన్స్
కామెడీ
డాన్సులు

మైనస్ పాయింట్లు:
సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ లేకపోవటం
డబ్బింగ్ కుదరకపోవటం
సంగీతం

తీర్పు:
హర్రర్ థ్రిల్లర్ గా వచ్చిన అభినేత్రి అంచనాలు అందుకునే స్థాయిలో మాత్రం లేదు. దెయ్యం తన కోరిక తీర్చుకోవటం కోసం చేసే ప్రయత్నంలో ఎక్కడా భయపెట్టించే అంశాలు లేకపోగా సిట్యూయేషనల్ కామెడీ మాత్రం ఉంది.

చివరగా... ఈ అభినేత్రి భయం లేదు.. కాసేపు నవ్వుకోవటానికి మాత్రమే...

 

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.