ఒకప్పటి ప్రపంచ సుందరి, బాలీవుడ్ హీరోయిన్ అయిన ఐశ్వర్యాయ్ బాలీవుడ్ స్టార్ హీరో అబిషేక్ బచ్చన్ తో వివాహం అయిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి అయిన కొన్ని రోజులు తమకు పిల్లలు పుట్టుకుండా .. కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఐష్ కు అభిషేక్ ఇద్దరు ఒప్పుకున్న సినిమాలు పెండింగ్ లో ఉండటంతో.. సంసార రొమాన్స్ ను వాయిదా వేయటం జరిగిందని బాలీవుడ్ వర్గాలు అప్పుడు చెప్పుకున్నాయి. అయితే ఒప్పుకున్నసినిమాలు ఒప్పందం అయిన వెంటనే .. ఈ అందాల జంట సంసార సాగర తీరంలో మునిగితెలటంతో .. వారికి తీపి గుర్తుగా .. కొన్ని నెలల క్రితం ఓ పండంటి పాప పుట్టిన విషయం తెలిసిందే. ఈ పాపకు అరాధ్య అని పేరు పెట్టారు. అయితే తమ ముద్దుల కూతురు కారణంగా ఐశ్వర్య రాయ్ వంద కోట్ల వరకు నష్టపోయిందని బాలీవుడ్ టాక్ నడుస్తుంది. కానీ ఐశ్వర్యకు 100కోట్ల నష్టం తెచ్చిపెట్టింది ఆ పాప పుట్టినందుకు కాదులేండి ? తమ ముద్దుల పాపను జాగ్రత్తగా చూసుకున్న సమయంలో ఐష్ , అభిషేక్ ఇద్దరు కలిసి నష్టపోయింది 100 కోట్లు బిజినెస్ అని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆరాధ్య పుట్టినప్పటి నుంచీ ఐశ్వర్యరాయ్ బచ్చన్ వదులుకున్న సినిమా, యాడ్ ప్రాజెక్టుల మొత్తమే ఇదంతా. పాప పుట్టాక ఐశ్వర్యరాయ్ లావెక్కటంతో కొన్నాళ్ల వరకు ఆమె వైపు స్పాన్సర్లు, సినిమా నిర్మాతలు పెద్దగా దృష్టిపెట్టలేదు.
ఐశ్వర్యరాయ్ కూడా ఆఫర్ల గురించి పెద్దగా నోరు విప్పింది లేదు. అయితే ఇటీవల ఆమె కాన్స్‌లో మెరవడం, ఒకటి రెండు సంస్థలతో గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం కొన్ని ప్రకటనల్లో నటించడంతో మళ్లీ అందరి దృష్టి ఆమెపై పడింది. యాష్ చోప్రా సంస్థ తీయబోతున్న తదుపరి సినిమాలో ఐశ్వర్యారాయ్‌ని హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్నారట.ఆ భారీ బడ్జెట్ సినిమా ద్వారా సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టించేందుకు వారు రెట్టింపు ఆఫర్ చేశారని బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ ఆశ్చర్యకర ఆఫర్ ఐష్ కు నచ్చినప్పటికీ మరి కొంతకాలం వరకు ఆగాలని ఆమె వారితో చెప్పడం, అయితే ఆ కొంతకాలం ఒక సంవత్సరం కూడా కావొచ్చని ఐస్ అభిప్రాయపడటంతో యాష్ చోప్రా సంస్థ వెనక్కు తగ్గిందట. దాంతో పాటు కొన్ని టెలిఫోన్ సంస్థలు, ఐపీఎల్ ఫ్రాంఛైజీలు కూడా ఐశ్వర్యరాయ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలంటూ ఆఫర్లు ఇచ్చాయట. ఐష్ పెట్టిన టైం ఎక్కవుగా ఉండటంతో వీరు కూడా వెనక్కి తగ్గారట. వీటన్నిటి మొత్తం దాదాపు వంద కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దాంతో వాళ్లు చేసేది లేక ఊరుకున్నారని బాలీవుడ్ గుసగుసలాడుకుంటోంది..
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more