Good news for hyderabadees

good news for hyderabadees

good news for hyderabadees

13.gif

Posted: 08/19/2012 02:38 PM IST
Good news for hyderabadees

         జంట నగరవాసులకు శుభవార్త ఇక నుంచి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఇంటి నుంచి వెళ్లింది మొదలు గమ్యం చేరేదాకా ఎక్కడtra_1 చూసిన ట్రాఫిక్.. ట్రాఫిక్.. ఇదే ప్రస్తుతం నగర వాసుల్ని వేధిస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి ట్రాఫిక్ పోలీసులు.. జీఎచ్ఎంసీ అధికారులు. సంవత్సరంగా అధ్యయనం చేసి కొత్త పథకాన్ని రూపొందించారు. ఇందుకు భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ సంస్థ సహకారం తీసుకున్నారు.  కొత్త సాఫ్ట్ వేర్ సిస్టమ్ ద్వారా ట్రాఫిక్  సమస్య తీర్చేందుకు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ప్రభుత్వం నుండి ఈ విధనాన్నికి ఆమోదం వచ్చింది. నగరంలో ఉన్న చౌరస్తాల వద్ద ఆటోమెటిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం జంటనగరాల్లో 168సిగ్నల్స్  ఉన్నాయని వాటిలో కేవలం 134మాత్రమే పని చేస్తున్నాయి. కొత్తగా 221సిగ్నల్స్ ఏర్పాటు చేయనున్నారు. వీటిలో హైదరాబాద్ లో 170, సైబరాబాద్ లో 51సిగ్నల్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేయనున్నారు.
     ఈ విధానం హైదరాబాద్ లో ఒక ట్రాఫిక్ కంట్రోల్ సెక్షన్, సైబరాబాద్ లో మరొక సెక్షన్ ఏర్పాటు చేసి కంట్రోల్ రూం నుండే సిగ్నల్స్ ను ఆపరేట్ చేసుకుకోవచ్చు. సోలార్ సిస్టమ్ ద్వారా ఈ సిగ్నల్ వ్యవస్థ 24గంటలు పని చేస్తుంది. దేశంలో తొలిసారి ఈ విధానం అమలువుతుందని ఇందుకు 66.5కోట్ల రూపాయల ఖర్చు traffic_2అవుతుందని అధికారులు తెలిపారు. భారత ఎలక్ట్రానికల్ లిమిటెడ్  (BEL)తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఈ విధానం వల్ల ఏ కూడలిలో ట్రాఫిక్ ఎక్కువసేపు జామ్ అయ్యిందో అటోమెటిక్ కెమారాల్లో రికార్డు అవుతుందని అందుకు కావాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా తీసుకుంటే సమస్య పరిష్కరించబడుతుందో తెలిసిపోతుందన్నారు.
    కొత్త విధానం ద్వారా ట్రాఫిక్ సమస్యను సులభంగా పరిష్కరించ వచ్చన్నారు. మరోవైపు పాదాచారులకు కూడా కొత్త సిగ్నల్స్ ఏర్పాటు చేయనున్నారు. నాలుగు వైపుల సిగ్నల్స్ రెడ్ సిగ్నల్ పడగానే పాదచారులు అందరు ఒకేసారి రోడ్డుదాటే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఎంత మంది ఉన్నారో తెలుసుకుని టైం అయ్యాకా డెంజర్ బెల్ మ్రోగనుంది. అత్యంత అధునాతన పద్దతి అమల్లోకి రానుందని ఈ విధానం వల్ల ట్రాఫిక్ సమస్య త్వరగా తీరుతుందని జీఎచ్ఎంసీ కమిషనర్ కృష్ణబాబు చెప్పారు. ఇందుకోసం బెల్ సంస్థకు తమ సహకార ఉంటుందన్నారు. కొత్త విధానంపై హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. చాలా రోజుల నుండి ప్రజలు ట్రాఫిక్ జామ్ తో ఇబ్బందులు పడుతున్నారని తర్వలో సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికి కొత్త విధానం ద్వారా త్వరలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Governor narsimhan iftar party
Tdp stand clear on telangana issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more