మొత్తానికి తెలంగాణ ఇచ్చేయమంటోంది చంద్రబాబు అధినేతగా ఉన్న తెలుగుదేశం పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో సెప్టెంబర్ మొదటివారంలో టీడీపీ మరింత స్పష్టత ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్వయంగా పార్టీ నాయకులకు చెప్పారు. 2008లో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి రాసిన లేఖ ప్రతిని మరోసారి కేంద్రానికి అందజేయాలని టీడీపీ భావిస్తోంది. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు తాము అడ్డంకి కాదనే విషయాన్ని తెలంగాణా ప్రజలకు వివరించేందుకు ప్రయత్నించనుంది. తెలంగాణాపై కేంద్రానికి టిడిపి లేఖ రాస్తే ఈ ప్రాంతంలో పార్టీకి పూర్వవైభవం వస్తోందని టిడిపి నాయకులు భావిస్తున్నారు. అయితే తెలంగాణాకు అనుకూలంగా పార్టీ లేఖ రాస్తే రాయలసీమ ఏర్పాటు విషయాన్ని కూడ ఆ లేఖలో ప్రస్తావించాలని రాయలసీమ పరిరక్షణ సమితి నాయకుడు, టిడిపి ప్రధాన కార్యదర్శి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై రాసిన ఓ లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు స్వయంగా అందజేయాలని బైరెడ్డి భావిస్తున్నారు.
బాబుతో పాటు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్ టిఆర్ తనయుడు బాలకృష్ణతో కూడ సమావేశం కానున్నట్టు బైరెడ్డి అన్నారు. ఇక తెలంగాణాకు అనుకూలమని పార్టీ ఇప్పుడు కేంద్రానికి లేఖ రాయడం వల్ల ఏం ప్రయోజనమని రాయలసీమ ప్రాంతానికి చెందిన టిడిపి నాయకుడు పయ్యావుల కేశవ్ సైతం పొలిట్ బ్యూరో సమావేశంలోనే ప్రశ్నించారు. తెలంగాణాకు అనుకూలంగా లేఖ ఇస్తే రాజకీయంగా తమకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురౌతాయని కేశవ్ అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే బాలకృష్ణ కూడ తెలంగాణాకు అనుకూలంగా ఇటీవల మాట్లాడడంతో తెలంగాణా ప్రాంతానికి చెందిన నాయకుల్లో మరింత ఉత్సాహం వచ్చింది. తెలంగాణ టిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు బాలకృష్ణతో సమావేశమై ధన్యావాదాలు తెలిపారు. తెలంగాణాకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇవ్వాలని పార్టీ తీసుకొన్న నిర్ణయాన్ని ఎవరూ కాదనలేరని తెలంగాణా ప్రాంతానికి చెందిన నాయకులు ధీమాతో ఉన్నారు. మొత్తంమీద తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రానికి టీడీపీ లేఖ రాస్తే ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు అంశాన్ని కూడా చేర్చాలనే తాజా డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ పరిణామం ఆ పార్టీలో ఏ రకమైన మలుపులకు దారితీస్తుందనేది వేచిచూడాలి.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more