దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మంచి మిత్రుడు , సహచరుడు , ఆత్మబంధువు అయిన డాక్టర్ కేవిపి రామచంద్ర రావు . వైఎస్ మరణించిన తరువాత .. తెర మీద కనిపించటం చాలా అరుదుగా జరుగుతుంది. ఆయన తెరపైకి వస్తే .. ఏదో ఒక వివాదం రావటం ఖాయమాని కాంగ్రెస్ నాయకులు భావించే స్థాయికి ఎదిగాపోయాడు కేవిపి. అయితే ఇటీవల కాలంలో కేవిపీ తో పాటు ఆయన వియ్యంకుడు రఘురామ కృష్ణంరాజు ఒక సంచలనమైన కేసులో ఇరుక్కుకున్న విషయం తెలిసిందే. సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కాల్ డేటాను అక్రమంగా సంపాదించిన కేసులో వ్యాపారవేత్త రఘురామ కృష్ణంరాజు కోసం సీఐడీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. సీబీఐ జేడీని ఇరుకున పెట్టాలని కాల్ డేటా సేకరించిన రఘురామరాజే చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. సీబీఐ జేడీపై దాఖలు చేసిన కేసును విత్‌డ్రా చేసుకున్న ఆయన.. ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగా యత్నించారు.దీనిపై నాంపల్లి కోర్టులో వాదనలు పూర్తయ్యాయి
. తీర్పు వెలువడాల్సిఉంది. అదే సమయంలో, రఘురామరాజుకు చెందిన మహారాష్ట్రలోని ఇంద్ భారత్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉపాధ్యక్షుడు కె.వెంకారెడ్డిని సీఐడీ పోలీసులు కస్టడీకి తీసుకొని ప్రశ్నించారు. జేడీ కాల్‌డేటా సేకరణలో తెర వెనుక వ్య వహారం నడిపింది రఘురామరాజేనని వెంకారెడ్డి వెల్లడించారు. దాంతో రఘురామరాజుకు సంకెళ్లు వేసేందుకు సీఐడీ సిద్దమైనట్లు తెలుస్తోంది.కొన్ని రోజులుగా ఆయనను పట్టుకునేందుకు సీఐడీ బృందాలు గాలిస్తున్నాయి. విమానాశ్రయ అధికారుల ద్వారా సమాచారం సేకరించగా ఆయన సింగపూర్‌లో తల దాచుకున్నట్లు సీఐడీ అధికారులకు సమాచారం అందింది. ఈనెల 7న సింగపూర్‌కు ఆయన విమాన టికెట్లు కొన్నట్లు గుర్తించారు. దీంతో, లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు సీబిఐ వార్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more