హైదరాబాద్ బంజారాహిల్స్ శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయం వివాదంపై మంత్రి దానం నాగేందర్, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ల మధ్య తలెత్తిని వివాదం ముఖ్యమంత్రి వద్దకు చేరింది. ఇరువురు మంత్రులతో విడివిడా చర్చించిన సీఎం వారి మధ్య నెలకొన్న వివాదానికి ముగింపు పలికారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రిని కలిసి దేవాలయల వివాదంపై సిఎంతో చర్చించారు. శుక్రవారం రాత్రి సీఎంను క్యాంపు కార్యాలయంలో మంత్రి దానం కలువగా, నిన్న హోమంత్రి సబితా సిఎంను కలిశారు. తనపై దానం చేసిన వ్యాఖ్యలపై ఆమె కిరణ్ దృష్టికి తీసుకెళ్లారు.
అసలు వివాదానికి గల కారణాలేంటని ... సిఎం అడిగి తెలుసుకున్నారు. పార్టీకి చెడ్డ పేరు తేవద్దని ముఖ్యమంత్రి ఇద్దరు మంత్రులకు సూచించినట్లు సమాచారం. దానంపై నమోదైన కేసుల విషయంపై కూడా హోంమంత్రితో సిఎం చర్చించినట్టు సమాచారం. మరోవైపు సీఎం కిరణ్ తో క్యాంపు కార్యాలయంలో మంత్రి దానం నాగేందర్ భేటీ అయ్యారు. హరే కృష్ణ మూమెంట్ ట్రస్టుకు సంబంధించిన జీవోను రద్దు చేయాలని సీఎంను కోరానని దానం నాగేందర్ స్పష్టం చేశారు. హోంమంత్రిపై తాను ఉద్దేశ్య పూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని,వారి కుటుంబంతో తనకు ముప్నై యేండ్ల అనుభందం ఉందని చెప్పుకొచ్చారు.
తమ మధ్య చిచ్చుపెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు దానం తనకు సోదరుడిలాంటి వారని హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి చెప్పారు. దానం నియోజకవర్గంలో బస్తీ వాసులు ఉన్నారని... వారి సమస్యలను ఆయన పరిష్కారం చేస్తుంటే.... తాను లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా చూస్తున్నానన్నారు. మొత్తానికి ఇద్దరు మంత్రుల మధ్య తలెత్తిన వివాదం ముఖ ్యమంత్రి చొరవతో ముగిసింది. దీంతో రెండు రోజులగా వార్తల్లోకెక్కిన వివాదానికి తెరపడినట్లైంది.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more