టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావుకు, తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాంకు మధ్య దూరం పెరిగిందా? కోదండరాం హాజరైన వేదికను పంచుకోవడానికే కాదు, కనీసం ఆయనతో మాట్లాడటానికి కూడా కేసీఆర్ విముఖత వ్యక్తం చేస్తున్నారా? అవును... తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్న వీరిద్దరి మధ్య దాదాపు నాలుగు నెలలుగా కనీసం మాటలు లేవని సమాచారం. అయితే దీనికి కారణాలపై మాత్రం ఎవరూ పెదవి విప్పడం లేదు. మహబూబ్‌నగర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓటమి తర్వాత వీరిద్దరూ రెండుసార్లు సమావేశమయ్యారు. అప్పుడు వీరిద్దరి మధ్య విభేదాలున్నట్లుగా బయటపడలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ.. కోదండరాంను కలవడానికి, మాట్లాడటానికి, చివరకు ఆయనతో కలిసి వేదికను పంచుకోవడానికి కూడా కేసీఆర్ ఇష్టపడటం లేదని చెబుతున్నారు.
నిజానికి ఈ పరిణామం గత కొంతకాలంగా జరుగుతున్నప్పట్టికీ,టి.ఎన్.జి.ఓ నేత స్వామిగౌడ్ సన్మాన సభ సందర్భంగా ఇది కొట్టొచ్చినట్లు కనబడిందని అంటున్నారు.ఈ సన్మాన సభలో కెసిఆర్ ఎప్పటి మాదిరే ప్రముఖ ఆకర్షణగా నిలబడగా, ఆయనను వెన్నంటి విధంగా ఉండే కోదండరామ్ మాత్రం ఆ సభలో కనిపించకపోవడం కొట్టొచ్చినట్లు కనబడింది.పైగా ఇప్పుడు కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. కోదండరామ్ వచ్చి ఉంటే కెసిఆర్ గైర్ హాజరు అయి ఉండేవారని కూడా ప్రచారం జరుగుతోంది.ముఖ్యంగా మహబూబ్ నగర్ శాసనసబ ఉప ఎన్నిక సందర్భంగా జెఎసి టిఆర్ఎస్ కు కాకుండా బిజెపికి చేయడం, అక్కడ టిఆర్ఎస్ ఓడిపోవడాన్ని కెసిఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. అలాగే తెలంగాణ మార్చ్ విషయంలో కూడా కెసిఆర్ తో సంబంధం లేకుండా కోదండరామ్ స్వయంగా నిర్ణయం తీసుకోవడం కూడా నచ్చడం లేదని అంటున్నారు.ఈ నేపద్యంలోనే కెసిఆర్ జెఎసి ఛైర్మన్ కు వ్యతిరేకంగా ఆయా నేతల వద్ద వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.దీంతో జెఎసిలో అయోమయం ఏర్పడుతోందని చెబుతున్నారు.జెఎసి కెసిఆర్ సృష్టేనని బహిరంగంగానే టిఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తుంటారు.జెఎసిలో టిఆర్ఎస్ మాత్రమే ప్రదాన పాత్ర పోషిస్తున్నది.బిజెపి కూడా ఉన్నా వారి బలం పరిమితం అన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ,టిడిపిలు ఎన్నడో నిష్క్రమించాయి. జెఎసి మీటింగ్ లకు కూడా టిఆర్ఎస్ వెళ్లడం లేదు. దీంతో వీరి మధ్య విబేధాలు తీవ్ర రూపం దాల్చాయన్న భావన ఏర్పడింది.కెసిఆర్ బలం, వ్యూహాల ముందు కోదండరామ్ తట్టుకోవడం కష్టమే. మరి జెఎసిలోని ఇతర విభాగాలు, ఇతర నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఈ నేపథ్యంలో కొందరు కేసీఆర్ మేనల్లుడు, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావును కలిశారు. మహబూబ్‌నగర్ ఉప ఎన్నికనే పట్టుకుని కూర్చుంటే ఉద్యమానికి జరిగే నష్టం తదితర అంశాలను వివరించారు. హరీశ్‌రావు వారితో ఏకీభవించి.. కోదండరాం, కేసీఆర్ మధ్య భేటీకి ప్రయత్నించారు. అయితే ‘ప్రొఫెసర్ కోదండరాంగారు చాలా పెద్దవారు. వారితో కలిసేస్థాయి నాకు లేదు. అంత పెద్దోణ్ణి కాదు. ఎప్పుడు ఎవరిని కలవాలో, వద్దో నాకు తెలియదా? ఆయన్ను కలవాలని చెప్తే నేను కలవాల్నా?’ అంటూ హరీశ్‌రావుపైనా కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
దీంతో సన్నిహితులు కూడా కేసీఆర్‌తో మాట్లాడటానికి వెనుకంజ వేస్తున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో ఉద్యమ ప్రయోజనాలకు విఘాతం కలగకుండా అనుసరించాల్సిన మార్గంపై జేఏసీ నేతలు, తెలంగాణవాదులు పలుసార్లు సమావేశమయ్యారు. ఆ సమావేశాలకు టీఆర్‌ఎస్ దూరంగా ఉంది. ఉద్యమం నీరుగారకుండా చేపట్టాల్సిన కార్యాచరణపై జేఏసీ నేతలు ఆ పార్టీ పరోక్షంలోనే మథనం చేశారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 30న తెలంగాణ మార్చ్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో పాలుపంచుకుంటామని గానీ, మద్దతిస్తామని గానీ టీఆర్‌ఎస్ ఇంతవరకు ప్రకటించలేదు. అది జేఏసీ కార్యక్రమమంటూ ఆ పార్టీ నేతలు తప్పించుకుంటున్నారు. ఈ పరిణామాలన్నీ జేఏసీ నేతల్లోనూ, తెలంగాణవాదుల్లోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఉద్యమ ప్రయోజనాల కోసం వ్యక్తిగత అంశాలను పక్కనబెట్టి అందరినీ ఏకతాటిపైకి తీసుకురావలసిన బాధ్యతను కేసీఆర్ విస్మరిస్తున్నారని ఉద్యోగసంఘాల నేతలు, ఇతర జేఏసీల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more