Constables wifes agitation

constables wife's agitation

constables wife's agitation

25.gif

Posted: 08/05/2012 02:25 PM IST
Constables wifes agitation

       రక్షక భట భార్యలు రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఎపిఎస్ పి) కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా తిరుగుబాటు చేస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. వారి ఆందోళన ఉధృతమైంది. ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న కానిస్టేబుళ్ల భార్యలను అదుపు చేయడం ఎవరి వల్లా కావడంలేదు. కానిస్టేబుళ్ల చేత పోలీస్ ఉన్నతాధికారులు ఇళ్లలో పనులు చేయిస్తున్నారని, ఆర్డర్లీ వ్యవస్థని కొనసాగిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అలాగే తమ భర్తలకు సెలవులు ఇవ్వడంలేదని, వారిని దూర ప్రాంతాలలో ఎక్కువ కాలం ఉంచి తమ కుటుంబాలకు దూరం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. police_f
     కాగా,  కానిస్టేబుళ్ల భార్యలు, ఇతర కుటుంబ సభ్యులు నిన్న హైదరాబాద్ కొండాపూర్ లోని ఎపిఎస్ పి 8వ బెటాలియన్ మెయిన్ గేట్ వద్ద ధర్నా చేశారు. ఈ రోజు కూడా వారు ధర్నా చేస్తున్నారు. హాం మంత్రి సబిత వచ్చి హామీ ఇస్తేనే తాము ఆందోళన విరమిస్తామని వారు చెబుతున్నారు.
      అంతేకాదు.. ఈ రోజు ఉదయం విజయనగరం జిల్లా చింతవలసలోని ఎపిఎస్ పి 5వ బెటాలియన్ మెయిన్ గేటు వద్ద పోలీసుల భార్యలు, కుటుంబ సభ్యులు ధర్నా చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం గుడిపేటలోనిsabita_f ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఎపిఎస్ పి) 13వ బెటాలియన్ వద్ద కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు ధర్నా, రాస్తారోకో చేస్తున్నారు. సిఐ వెంకటేశ్వర రావు అనుచితంగా మాట్లాడారని వారు ఆరోపిస్తున్నారు. డ్యూటీల పేరిట అధికారులు తమ భర్తలను వేధిస్తున్నారని వారు వాపోతున్నారు. ఆగ్రహంతో వారు జాతీయ రహదారిని దిగ్బంధించారు. 43వ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. డిజిపి వచ్చి హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని వారు భీహ్మించుకు కూర్చున్నారు. తమ భర్తలను నెలల తరబడి కుటుంబాలకు దూరం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తమ భర్తలను శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు పరిమితం చేయమని వారు కోరుతున్నారు. తమ భర్తలతో పోలీస్ ఉన్నతాధికారులు ఇళ్లలో పనులు చేయిస్తున్నారని, తమ భర్తలకు సెలవులు ఇవ్వడంలేదని కానిస్టేబుళ్ల భార్యలు ఆందోళనకు దిగడంతో వారి సమస్యల తీవ్రత అర్థమవుతోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran verses jaipal reddy
Vijayamma secretly meet sonia gandhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more