మొత్తానికి సీఎం – జైపాల్ మధ్య విభేదాలు బరస్ట్ అయినట్టు అగుపిస్తోంది. గత కొంత కాలంగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కీ, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఒకరికొకరు టార్గెట్ చేసుకునే స్థాయిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. అసలు విషయానికొస్తే మొదట్లో కిరణ్, జైపాల్ కీ మద్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. కిరణ్.. సీఎంగా బాద్యతలు స్వీకరించక ముందు ఢిల్లీ కి వచ్చిన ప్రతిసారీ ఆయనని కలిసే వారు. సీఎం అయిన కొత్తలో కూడా జైపాల్ ని కలుస్తూ ఉండే వారు. కానీ గత కొన్ని నెలలుగా జరగిన పరిణామాలని గమనిస్తే ఇద్దరి మద్యా దూరం చాలానే పెరిగిందన్న విషయం స్పష్టమవుతుంది.
ఇప్పుడు సీఎం తన ఢిల్లీ పర్యటనల్లో జైపాల్ కలవడం పూర్తిగా మానేసారు. మొదట సీఎం సకల జనుల సమ్మె సందర్బంగా ఏర్పడిన విద్యుత్ కొరతని తీర్చేందుకు కేంద్రాన్ని అదనపు గ్యాస్ కోసం అడిగితే, కొంత మంది ఎంపీలు జైపాల్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చి గ్యాస్ రాకుండా చేసారని సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఆ వ్యాఖ్యలపై స్పందించిన జైపాల్, రాష్ట్రానికి గ్యాస్ ఇవ్వద్దని తనపై ఎవరూ ఒత్తిడి తేలేదని స్పష్టం చేస్తూ సీఎంకి లేఖ రాసారు. ఆ తరువాత జేడీఎఫ్ సూయజ్ కంపెనీతో, ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పోరేషన్ ఎంఓయూ కుదుర్చుకున్న కార్యక్రమంలో కూడా ఇద్దరి మద్యా కొన్ని మాటలు దొర్లాయి.
మొదట సీఎం కిరణ్, రాష్ట్రంలో విస్తృతమైన గ్యాస్ నిక్షేపాలు ఉన్నప్పటికీ వినియోగించుకోలేని దుస్థితి ఏర్పడిందని వాపోయారు. అంతే కాకుండా రాష్ట్రంలో కరెంటు కొరత తీర్చడానికి శంకరపల్లి, నేదునూరు గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకి గ్యాస్ కేటాయించాలని అక్కడే ఉన్న జైపాల్ కి విజ్ఞప్తి చేశారు. సీఎం వ్యాఖ్యలపై జైపాల్ స్పందిస్తూ నిర్మాణం పూర్తయిన ప్లాంట్లకే గ్యాస్ కేటాయింపులు చేయలేక పోతున్నామని, ఇంకా నిర్మాణమే పూర్తిగాని ప్లాంట్లకి కేటాయింపులు జరపలేమని సీఎం విజ్ఞప్తిని నిర్ద్వందంగా చెప్పారు.
ముందు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం పూర్తయితే ఆ తరువాత గ్యాస్ కేటాయింపుల అంశాన్ని పరిశీలిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక తాజాగా మహారాష్ట్ర రత్నగిరి ప్లాంటు గ్యాస్ కేటాయింపుల అంశం వివాదాస్పదమైంది. ఈ వ్యవహారంలో జైపాల్ రెడ్డికి ఎటువంటి సంబందం లేకపోయినా, సీఎం ఉద్దేశ పూర్వకంగానే ఆయన పేరును తెరపైకితెస్తున్నారని జైపాల్ తన సన్నిహితుల దగ్గర వాపోయినట్లు తెలిసింది. రత్నగిరి గ్యాస్ కేటాయింపులకి సంబందించిన వివరాలు మీడియాకు తెలియడంలో సీఎం హస్తం ఉన్నట్టు ఆయన బలంగా నమ్ముతున్నారు. అందుకే వెంటనే ఈ వ్యవహారంలో తన మంత్రిత్వ శాఖ నుండి వివరణ ఇప్పించారు.
గ్యాస్ కేటాయింపులకి సంబందించి ప్రాధాన్యతా క్రమాలని నిర్ణయించేది తాము కాదని ఆయన స్పష్టం చేశారు. వీరిద్దరి మద్య విభేదాలకి కారణమైన మరో అంశం కూడా ఉంది. జైపాల్ రెడ్డి ఉప రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్నారని అప్పట్లో కొన్ని ఆంగ్ల దిన పత్రికల్లో వార్తలొచ్చాయి. ఆ వార్తలని సీఎం కిరణే రాయించారని కూడా జైపాల్ బలంగా నమ్ముతున్నట్లు తెలిసింది. భవిష్యత్లో జైపాల్ ను సీఎం రేసులో లేకుండా చేయడానికి సీఎం అలా చేసారని ఆయన సన్నిహితుల అభిప్రాయం. కిరణ్ వ్యవహార శైలి పట్ల కూడా జైపాల్ సంతృప్తిగా లేనట్టు తెలుస్తోంది.
రాష్ట్రం నుంచి అత్యంత సీనియర్ నాయకుడే కాక కేంద్రంలో కీలక మంత్రిత్వ శాఖలో ఉన్న జైపాల్ ను ఏ విషయంలోనూ కిరణ్ సంప్రదించే వారు కాదని కూడా చెబుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి గ్యాస్ కేటాయింపుల విషయంలో ఇద్దరి మధ్యా తలెత్తిన ఇగో సమస్యలు ఇప్పుడు తీవ్ర రూపం దాలుస్తున్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. మరోవైపు చాలా మంది తెలంగాణా ఎంపీలతో కూడా సీఎం కిరణ్ కి సత్సంబందాలు లేవన్న వాదనలున్నాయి. వివేక్ లాంటి వారితోనైతే తీవ్రస్థాయిలో విభేదాలున్నాయని తెలిసింది.
జైపాల్ రెడ్డికి సన్నిహితంగా ఉండే టీ .ఎంపీలు కూడా సీఎం గురించి ఎప్పటికప్పుడు ఆయనకి సమాచారం అందిస్తూనే ఉన్నారని సమాచారం. మొత్తం మీద ఇద్దరు కీలక రాష్ట్ర నేతల మద్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. రాష్ట్రం నుంచి ప్రాతినిద్యం వహిస్తున్న కేంద్ర మంత్రి నుంచి వీలైనన్ని ప్రయోజనాలు సాధించడంలో సీఎం, తన శాఖ నుండి రాష్ట్ర ప్రయోజనాలకి పెద్ద పీఠ వేయడంలో జైపాల్ ఇద్దరూ విఫలమయ్యారు. ఇద్దరి మద్యా జరుగుతున్న ప్రచ్చన్న యుద్దంలో అంతిమంగా నష్టపోయేది రాష్ట్ర ప్రజలే.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more