మాట తప్పని, మడమ తిప్పని యోధుడిగా తన సొంత మీడియా సంస్థల్లో హీరోగా ప్రచారం చేసుకున్న వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మడమ తిప్పేయడానికి సిద్ధమవుతున్నారా? కాంగ్రెస్ అధినేత్రిని తూర్పారపట్టిన యువనేత కుటుంబం అదే అధినేత్రికి లొంగిపోవడానికి సిద్ధమవు తోందా? జగన్‌కు బెయిల్ ఇప్పిస్తే చాలు దేని కైనా సిద్ధమని తెల్ల జెండా ఎగరవేయడానికి మానసికంగా సమాయత్తమవుతోందా? మొత్తా నికి కాళ్ల‘బేరాలు’ మొదలయ్యాయా? అందులో భాగంగానే వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని రహస్యంగా కలిశారా?.. ఇప్పుడు హస్తిన, హైదరాబాద్‌లోని రాజకీయవర్గాల్లో జరుగుతోన్న వాడి వేడి చర్చలివి. వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయ లక్ష్మి ఇటీవల ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసినప్పుడు పనిలోపనిగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని రహస్యం గా కలిశారా?.. అవుననే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. కాంగ్రెస్ వర్గాలు ఇచ్చిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఢిల్లీ కేంద్రంగా వెలువడే ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తా కథనం పార్టీలో ఇప్పుడు కలకలం సృష్టిం చింది. అయితే, దానిని ఏఐసీసీ వర్గాలు ఖండించడం గానీ, ధృవీకరించడం గానీ చేయకపోవడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. దీని పై ఏఐసీసీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ స్పందన పలు అనుమానాలకు దారితీసేలా కనిపిస్తోంది. ఆయన ఆ వార్తను ఖండించలేదు. అలాగని ధృవీకరించకపోవడం ప్రస్తావనార్హం. విజయమ్మ ఎవరికీ తెలియకుండా సోనియాను కలిసినందున, ఆ వివరాలు మొన్నటి వరకూ రహస్యంగానే ఉండిపోయింది. కాంగ్రెస్‌కు చెందిన ఓ ప్రముఖ నాయకుడు రెండు రోజుల క్రితం ఏఐసీసీ కార్యాలయంలో ప్రాంతీయ మీడియాతో పాటు, ఒక ఆంగ్ల మీడియా వద్ద పిచ్చాపాటీగా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి వివరిస్తున్న సందర్భంలోనే ఈ ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. తనయుడు జగన్‌కు బెయిల్ ఇప్పించేలా కృషి చేయాలని విజయమ్మ కాంగ్రెస్ అధినేత్రిని అభ్యర్ధించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్టప్రతి ఎన్నికల్లో యుపీఏకు మద్దతునిచ్చేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని, దానితోపాటు, యుపీఏ ప్రభుత్వం కష్టాల్లో ఉంటే ఆదుకుంటామని కూడా విజయమ్మ భరోసా ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
జగన్‌కు బెయిల్ పై సానుకూలంగా వ్యవహరించాలని, తన కుమారుడి వల్ల కాంగ్రెస్‌కు వచ్చిన ప్రమాదం ఏమీ ఉండదని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం కూడా తమకు లేదని విజయమ్మ భరోసా ఇచ్చారంటున్నారు. సోనియా- విజయమ్మ రహస్య భేటీ ఆలస్యంగా వెలుగుచూడటంతో ఇరుపార్టీ వర్గాల్లో సరికొత్త చర్చ మొదలయింది. జగన్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమయ్యేందుకు ఇప్పటినుంచే రంగం సిద్ధం చేస్తున్నారన్నదే ఆ చర్చల సారాంశం. ముందు జగన్ బెయిల్ పై బయటకు రావాలన్నదే ఆయన పార్టీ లక్ష్యమని చెబుతున్నారు. ఇటీవలి రాష్టప్రతి ఎన్నికల్లో మద్దతు ప్రకటించినందుకు మాయావతికి అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పై అప్పీలుకు వెళ్లకూడదని సీబీఐ నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జగన్ విషయంలోనూ సీబీఐ దూకుడుకు యుపీఏ కళ్లెం వేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జగన్ విషయంలో సీబీఐ తన పాత దూకుడు తగ్గించిందని చెబుతున్నారు. విలీనం లేదా అవగాహన పై ఒక ఒప్పందానికి వస్తే ఇక జగన్ కేసు పెద్దగా ప్రభావం ఉండదని, మాయావతి మాదిరిగానే జగన్ కేసు నీరుగారుతుందంటున్నారు. ఈ సమయంలో జగన్ కూడా జైల్లో ఉంటూ దీర్ఘకాలం పోరాడటం సాధ్యం కాదని, అందుకే తమ పార్టీకి సరెండర్ కావడం అనివార్యమని కాంగ్రెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జగన్ ఎప్పటికయినా సోనియాగాంధీకి సరెండర్ కాక తప్పదని, ఇద్దరికీ ఒకరి అవసరం మరొకరికి ఉందని కాంగ్రెస్ సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. సోనియా పై తిరుగుబాటు చేసిన శరద్‌పవార్, మమత బెనర్జీ, కరుణాకరన్ వంటి మహామహులే సోనియాకు తలవంచారని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్‌కు జగన్ అవసరం ఎప్పటికయినా ఉందని ఆయన ప్రధాన అనుచరుడయిన అనకాపల్లి ఎంపీ సబ్బం హరి తాజాగా వ్యాఖ్యానించడం బట్టి.. కాంగ్రెస్-వైఎస్సార్ కాంగ్రెస్ రెండూ ఒక్కటయి, జగన్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమయ్యే రోజు మరెంతో దూరంలో లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే, ఈ కథనాలను వైకాపా వర్గాలు ఖండిస్తున్నాయి. సోనియాను విజయమ్మ కలవలేదని, తమను మానసికంగా దెబ్బతీసేందుకే ఈ దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడుతున్నా
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more