నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఒంటరి ప్రయాణం చేస్తున్నాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. సీఎం కిరణ్ ఒంటెద్దు పోకడతో అధిష్టానం కేకలు వేయటం కూడా జరిగిందని ఢిల్లీ నాయకులు అంటున్నారు. అయిన ముఖ్యమంత్రి తన పద్దతి మార్చుకోలేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. రీసెంట్ గా ముఖ్యంమంత్రి ఇందిరమ్మ బాట పేరుతో .. రాష్ట్రంలో తిరగటం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎట్టకేలకూ జనం బాట పట్టారు. ఇప్పటివరకూ హైదరాబాద్‌కు, అప్పుడప్పుడు జిల్లా పర్యటనలకు వెళుతున్న కిరణ్ నెలలో 9 రోజులు, 100 నియోజకవర్గాల్లో పర్యటించేలా రూపొందించిన ఇందిరమ్మబాట కార్యక్రమం ముఖ్యమంత్రిని జనాలకు చేరువ చేస్తోందని చెబుతున్నాడు . ఆ మేరకు తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న తొలి పర్యటనలో కిరణ్ జనంతో మమేకమవుతున్నమాని ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో చెబుతున్నారు. రోజువారీ ప్రసంగాలను పక్కకుపెట్టి.. హాస్టళ్లలో నిద్ర, విద్యార్ధులతో ముచ్చట్లు, జనంతో ముఖాముఖి, వారి ఈతిబాధలు తెలుసుకునేందుకే కిరణ్ ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని మీడియా వర్గాలు అంటున్నాయి. స్వయంగా ముఖ్య మంత్రే తమ చెంతకు రావడంతో స్థానిక ప్రజలు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. చాలాకాలం నుంచి నియోజకవర్గాల్లో తిరగకుండా ముఖం చాటేసిన ఎమ్మెల్యేలు, కూడా ముఖ్యమంత్రి రావడంతో జన సమీకరణ చేయవలసి వస్తోందని తమ బాధలు మీడియా ముందు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే దానితోపాటు సీఎం కంటే ముందే నియోజకవర్గాల్లో తిరగడం వారికి అనివార్యమవుతోంది కాబట్టి దీనివల్ల ఎమ్మెల్యేలను కూడా జనాలకు చేరువ చేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతోందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు
కానీ ఇందిరమ్మ బాటలో అలాంటి ఉత్సాహం, సందడి పెద్దగా కనిపించడం లేదని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. ఇందిరమ్మ బాట కాస్తా విహరయాత్రగా మారుతుందని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. అందుకే ఆ లోటు పూడ్చడానికి సాయంత్రం వేళ పార్టీ కార్యకర్తలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వ పరంగా తాము ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా వాటిని జనంలోకి తీసుకువెళ్లి, ప్రచారం చేసే బాధ్యత మీదేనని కాంగ్రెస్ నాయకులను బుజ్జగించే ప్రయత్నం ముఖ్యంమంత్రి చేస్తున్నారని మీడియా వర్గాలు అంటున్నాయి. సిఎం కిరణ్ కుమార్ రెడ్డి , వైఎస్ రాజశేఖరరెడ్డి కంటే ఎక్కువ పనిచేస్తున్నామన్న సంకేతాలు పంపించేందుకు ఇందిరమ్మ బాటను వినియోగించుకుంటున్నారని అనే గుసగుసలు ప్రజల్లో బాగా వినిపిస్తున్నాయాని మీడియా వర్గాలు అంటున్నాయి. వైఎస్ హయాం కంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఎక్కువ పథకాలు అమలుచేస్తోందని, నాటి కంటే తమ హయాంలోనే ఎక్కువ మంది లబ్థి పొందుతున్నారని నేరుగానే ముఖ్యమంత్రి చెబుతున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అంటే... వైఎస్ వల్ల పార్టీకి జరిగిన నష్టాన్ని పూడ్చటంతో పాటు, ఆయనను మరిపించే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రసంగ ధోరణి స్పష్టం చేస్తోందని ప్రజలు అనుకుంటున్నారు. దాదాపు ఆరున్నరేళ్లు వైఎస్ హయాంలో చేపట్టిన పథకాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం-పార్టీవి కాకుండా వైఎస్ సొంత పథకాలుగా ప్రజల్లోకి వెళ్లడ , దానిని జగన్ మీడియా సొమ్ము చేసుకోవడంతో కిరణ్ ఇందిరబాటను దిద్దుబాటగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇది ఒకరకంగా దిద్దుబాటగానే భావిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్ లో గుసగుసలాడుకుంటున్నారు.
అందులో భాగంగానే వైఎస్‌కు సామాన్య, మధ్య తరగతి వర్గాల్లో వ్యక్తిగతంగా పేరు ప్రతిష్ఠలు తీసుకువచ్చిన 108 అంబులెన్సు సేవలకు ముద్రను చెరిపివేసే ప్రయత్నం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. 108 సేవలు ఎవరు చేస్తున్నారని నేరుగా కిరణ్ ఆ సేవల వల్ల లబ్థి పొందిన మహిళలను అడగటంతో వారు వెంటనే వారంతా ఇది ( వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేనని ) ప్రభుత్వానిదేనని ముక్తకంఠంతో చెప్పినట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అంటే ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా సరైన ప్రచారం లేకనే అవన్నీ వైఎస్ పథకాలుగా చెలామణి అవుతున్నాయని తాజా వ్యవహరం స్పష్టం చేసిందని సీఎం మీడియా ప్రతినిధులతో చెప్పినట్లు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఇదిలాఉండగా.. కిరణ్ చేపట్టిన ఇందిరమ్మ బాట పేరు కొత్తదయినా విధానం అంతా గతంలో బాబు జన్మభూమి, వైఎస్ రాజీవ్ నగరబాట, పల్లెబాట తీరునే కనిపిస్తోందని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. అయితే హాస్టల్‌లో నిద్రించడం కొత్త తరహాలో ఉందని . ఏసీలు, ఇతర హంగామాలు లేకుండా నేలమీద పరుపు వేసుకుని పడుకోవడం వల్ల సాదాసీదా సీఎం అన్న ప్రతిష్ఠ సంపాదించుకునేందుకు సిఎం ఒంటిరి పోరాటం చేస్తున్నాడని జగన్ పార్టీ నాయకులు అంటున్నారు. మొత్తానికి కిరణ్ వెళుతున్న ఇందిరమ్మ బాట కాంగ్రెస్‌కు జవసత్వాలు తీసుకువస్తుందన్న అంచనా వ్యక్తమవుతోందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఒక వేళ వైఎస్ ఇందిరమ్మ బాటకు పోటీగా రాజన్న బాట మొదలు పెడితే ? ఇందిరమ్మ బాట కాస్త ఇంటి బాట అవుతుందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మీడియా చెప్పినట్లు తెలుస్తోంది. జగన్ ఓదార్పు యాత్ర సెక్సస్ అయినట్లు రాజన్న బాట కూడా సక్సస్ అయితే .. ఇక కిరణ్ ఇంటికేనని .. రాష్ట్ర ప్రజలు రచ్చబండ వద్ద అనుకుంటున్నారు. ఎందుకంటే మొన్న రచ్చబండ రచ్చ రచ్చ అయ్యందని, ఇప్పుడు ఇందిరమ్మ బాట ఇంటిబాట అవుతుందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన ఎమ్మెల్యే శంకరరావు మీడియాతో చెప్పినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more