రాజ్యసభ సభ్యుడు, వీర శివభక్తుడు, పారిశ్రామికవేత్త అయిన తిక్కవరపు సుబ్బరామిరెడ్డి అంటే తెలియని వారు ఎవ్వరు ఉండరు. అటు రాజకీయంగాను, ఇటు సినిమా పరంగాను అందరికి తెలిసిన వ్యక్తి టి సుబ్బరామిరెడ్డి. కాంగ్రెస్ పార్టీ లో సీనియర్ నాయకుడు. మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో నెల్లూరు నుండి ఎంపీగా పోటీ చేసి ఒటమిని చవిచూసిన విషయం తెలిసిందే. ఆ ఉప ఎన్నికల్లో తన గెలుపుకోసం టి. సుబ్బరామిరెడ్డి కొన్ని కొట్లు డబ్బు ఖర్చు పెట్టినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆయన పదవి కోసం కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. మళ్లీ విశాఖపట్నం ఎమ్.పి సీటు వివాదం మొదలైందట. రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి ప్రస్తుతం ప్రాతినిద్యం వహిస్తున్న కేంద్ర మంత్రి పురందేశ్వరిని మెచ్చుకుంటూనే , విశాఖ సీటుపై తన ఖర్చీఫ్ వేసినట్లు మాట్లాడడం విశేషంగా ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఒక పక్కన పురందేశ్వరిని విశాఖకు ఆహ్వానించింది తానే అంటూనే, వచ్చే ఎన్నికలలో అదిష్టానం తనకు విశాఖ టిక్కెట్ ఇస్తే పోటీచేస్తానని తన మనసులోని మాట బయటపెట్టినట్లు ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. మొన్న నెల్లూరులో ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన మళ్లీ విశాఖపట్నం సీటు గురించి మాట్లాడారన్నది అర్ధం చేసుకోవచ్చునని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
పురందేశ్వరి, తాను మంచి మిత్రులమని కాంగ్రెస్ నాయకుడు టి. సుబ్బరామిరెడ్డి చెబుతున్నారు. విశాఖ అభివృద్ధికి తాము వేర్వేరుగా ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పటం చాలా విశేషంగా ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. పురందేశ్వరిని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేలా చేసింది తానేని ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆమెను విశాఖ నుంచి పోటీకి ఆహ్వానించింది తానేనని అధిష్టానానికి గుర్తు చేసినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. 2014లో అధిష్టానం విశాఖ నుంచి పోటీచేయమంటే అందుకు సిద్ధంగా ఉన్నానని సీనియర్ నాయకులతో సుబ్బరామిరెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. నెల్లూరు ఉపఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని సుబ్బరామిరెడ్డి చెప్పటం జరిగింది కాబట్టి ఆయన నెల్లూరు హామీలు నెరవేర్చాలనుకుంటే తిరిగి అక్కడ నుంచే పోటీచేయవచ్చు కదా అని కాంగ్రెస్ నాయకులు చెవులు కోర్కుకుంటున్నారు.
తిక్కవరపు సుబ్బిరామిరెడ్డికి పరిపక్వత వచ్చింది ఆ విషయం ఆయనే స్వయంగా చెప్పినట్లు తెలుస్తోంది. "నాకు పరిపక్వత వచ్చింది కాబట్టి లోక్‌సభ ఎన్నికల్లో అధిష్ఠానం ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తా''అని మీడియా వారితో చెప్పినట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.. విశాఖ విమానాశ్రయంలో 24 గంటలూ విమానా ల రాకపోకలు సాగేలా రెండు నెలల్లో చర్యలు తీసుకుంటానని ఆయన చెబుతున్నారట. విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తామంటే అంగీకరించేది లేదని, దీనిపై ఉక్కు కార్మిక సంఘాలతో కలసి ఈ వారంలో ఉక్కు చైర్మన్, కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని సుబ్బరామిరెడ్డి మీడియా చెప్పటం జరిగిందట. అంతవరకు కార్మికులు తలపెట్టిన సమ్మెను వాయిదా వేయాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి పురందేశ్వరితో తనకు విభేదాలేమీ లేవని, ఇద్దరం కలిసే పనిచేస్తున్నామని సుబ్బిరామిరెడ్డి అంటున్నాడట. కానీ, ఏమో ఏ రాజకీయ పుట్టలో ఏ పాము వుందో ఎవరికి తెలుసు?
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more