Actor kota srinivasa rao

Actor Kota Srinivasa Rao, Kota Srinivasa Rao photos, Kota Srinivasa Rao gossip, Kota

Actor Kota Srinivasa Rao

Kota.gif

Posted: 07/12/2012 07:05 PM IST
Actor kota srinivasa rao

Actor Kota Srinivasa Rao

గతంలో సినిమా ప్రభావం సమాజంపై ఉండేది. సినిమాల్లో చారిత్రకం, పౌరాణికం, సాంఘికం, జానపదం అని పలు రకాలుండేవి. సామాన్య జనానికి సినిమా దూరంగా ఉండేది. వాణిశ్రీ చీరలని, సాధన ఆర్ట్ అని, నాగేశ్వరరావు స్టైల్ అని, శోభన్‌బాబు రింగ్ అని జనాలు సినిమా వాళ్ళను అనుకరించేవారు. కానీ ఇప్పుడు సినిమా బజారున పడింది. సినిమా వాళ్ళం బజారున ఉన్నాం'' అని అంటున్నారు విలక్షణ నటులు కోట శ్రీనివాసరావు. "నా కెరీర్‌లో దాదాపు అన్నీ వేషాలు వేశాను. అన్నీ కలిపి 700 దాకా ఉంటాయి. ఫలానా వేషం వేయలేదు అన్న భావన నాలో ఎప్పుడూ కలగలేదు. రాజకీయనాయకులను, ఇంకా పలువురి మేనరిజాన్ని సినిమాల్లో అనుకరిస్తున్నాం. నా దృష్టిలో ప్రజలు మెచ్చిన ప్రతి వేషం గొప్పదే. అలాంటి గొప్ప వేషాలు చాలా వేశాను. రోజులు మారేకొద్దీ టెక్నాలజీ మారుతోంది. దానివల్ల లాభాలు ఎన్ని ఉన్నా పని విషయంలో ఆలస్యం జరుగుతోందని నా అభిప్రాయం. అదే కారణం ''నాకిప్పుడు 69 ఏళ్ళు. ఇప్పుడు కూడా గ్రిప్ పోకుండా నటిస్తున్నానంటే కారణం నాటకాలే. నేను రంగస్థలం నుంచి వచ్చినవాణ్ని. క్రాంతి కుమార్ 'ప్రాణం ఖరీదు'తో కెరీర్‌ను ప్రారంభించించాను.

Actor Kota Srinivasa Rao

తర్వాత కొన్ని సినిమాలు చేసినా దాదాపు ఐదారేళ్ళు సినిమాల జోలికి వెళ్ళలేదు. 1986 నుంచి నటనను వృత్తిగా తీసుకున్నా. నాటకాలు వేసేటప్పటి నుంచీ నాదైన ప్రత్యేకత రంగస్థలంపై కనిపించాలని తాపత్రయపడేవాడిని. ఎక్కడికెళ్ళినా ఆయా ప్రాంతాల మాండలికాలను ఒడిసిపట్టుకునేవాడిని. వారి యాసలో మాట్లాడటానికి కృషి చేసేవాడిని. టి.కృష్ణగారు నాకు 'వందేమాతరం', 'ప్రతిఘటన'లో అవకాశం ఇవ్వడానికి ప్రధాన కారణం నేను రంగస్థల నటుడిని కావడమే. ఆ తర్వాత ఎన్నెన్నో మంచి పాత్రలు చేశాను.'' ఏడిపించావన్నారు " వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళా. 'ఇంట్లో ఇల్లాలు వంటింటి ప్రియురాలు', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే', 'బొమ్మరిల్లు' చిత్రాలు నాలోని మరో కోణాన్ని వెలికి తీశాయి. ఆ చిత్రాలు విడుదలైనప్పుడు ప్రతిరోజూ పరిశ్రమ పెద్దల నుంచి దాదాపు 50-70 ఫోన్లు వచ్చేవి. రామానాయుడుగారు ఓ సందర్భంలో ఫోన్ చేసి 'ఏడిపించావయ్యా' అన్నారు. నాకు ఓ క్షణం అర్థం కాలేదు. 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చూసి మనసు బరువెక్కిందని ఆయన వివరించారు. హీరోగా వద్దు "నేను పరిశ్రమలోకి వచ్చేటప్పుడే దృష్టి హీరో పాత్రలపై లేదు.

Actor Kota Srinivasa Rao

నాకప్పటికే 40 ఏళ్ళున్నాయి. ఇప్పటికీ నా ఇంటి ముందునుంచి ఎవరైనా వెళ్తే నటుడు కోట శ్రీనివాసరావు ఇల్లు అనుకుంటారు. అదే నేను తదుపరి కాలంలో హీరోగానో, దర్శకుడిగానో, నిర్మాతగానో అయి ఉంటే 'వీడికెందుకురా ఈ పనులు' అని పరాచకాలు ఆడి ఉండేవారు. నాకు అది ఇష్టం లేదు. హీరోగా చేయాలన్న ఆలోచన లేదు కాబట్టే ఇంకా జీరో కాకుండా ఉన్నాను. పరిశ్రమకు ఎంతగానో రుణపడి ఉన్నాను. తెలుగుతో పాటు తమిళంలో పాతిక సినిమాలు, హిందీ, కన్నడలో తలా అరడజను సినిమాలు చేశా.'' యాక్టివ్‌గా ఉన్నా "నేను బీజేపీలో యాక్టివ్‌గానే ఉన్నా. సభలకు వెళ్ళి వస్తుంటాను. కాకపోతే బయటికి కనపడను.''

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Inside london olympic 2012 olympic village is a hotbed of romance and drugs
Cpi narayana sensational comments on kcr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more