తెలంగాణ సాధనకు ఇక ఉద్యమం అవసరం లేదని, ప్రత్యేక రాష్ట్రం దానంతట అదే వస్తుందని ఉద్యోగ సంఘాల నేత లతో టీఆర్ఎస్ అధ్యక్షులు కే. చంద్రశేఖరరావు వ్యాఖ్యానించడాన్ని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కే. నారాయణ తప్పుబట్టారు. ఇంత పెద్ద ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి ఫాంహౌస్లో పడుకుంటే (టీ) తెలంగాణ వస్తుందా? తెలంగాణ దానంతట అదే వస్తే ఇంత మంది వి ద్యార్థులు ఆత్మబలిదానం ఎందుకు చేసినట్లు, సక ల జనుల సమ్మెకు ఎందుకు పూనుకున్నట్లు అని నారాయణ ధ్వజమెత్తారు. పార్టీ అనుబంధ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) నగర శాఖ బీజేఆర్ భవన్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ముఖస్తుతి మాటలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, సొంత నాయకులతో మంతనాలతో తెలంగాణ రాదని అన్నారు. తెలంగాణ దానంతటదే వస్తుందని, ఉద్యమిస్తే వస్తుందా.. అని కేసీఆర్ లాంటి నేతలే వాదిస్తే అమరవీరుల త్యాగాలకు అర్థమేమిటని ప్రశ్నించారు.
ఉద్యమంతో తెలంగాణ రాదన్నప్పుడు గతంలో కేసీఆర్ విద్యార్థులను ఎందుకు రెచ్చగొట్టారని నిలదీశారు. కేసీఆర్ తీరుకు తగ్గట్టే జేఏసీ నేతలు కూడా వ్యవహరిస్తున్నారని, పదవుల పాకులాటలో మునిగితేలుతున్నారని విమర్శించారు. విద్యార్థుల ఆత్మబలిదానాలను అడ్డం పెట్టుకుని జేఏసీ నాయకులు వచ్చే ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలయి మంత్రులు కావాలని కలలు కంటున్నారని ధ్వజమెత్తారు. వచ్చే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణ ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటేస్తే తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేసినట్టేనని పేర్కొన్నారు. కేంద్రమంత్రి చిదంబరం అవాకులు చెవాకులు పేలడం మానాలని, ఆయన్ను ప్రజలు వాటర్బాటిళ్లతో కొట్టే రోజు దగ్గర్లోనే ఉందని నారాయణ మండిపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more