ఒలింపిక్స్ పేరు వినగానే ట్రాక్‌పై చిరుతల్లా పరుగెత్తే అథ్లెట్లు.. ఫీల్డ్‌లో మెరుపు విన్యాసాలు.. సొరచేపలను తలపించే స్విమ్మర్లు.. మైదానాల్లో అత్యుత్తమ ప్రదర్శన.. ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారులందరినీ ఒకే వేదికపై చూసే భాగ్యం.. ఇలా ఎన్నో స్ఫురణకు వస్తాయి. కానీ ఈ పోటీల సందర్భంగా జరిగే రహస్య బాగోతాలు చాలామందికి తెలియకపోవచ్చు. ఈ మెగా ఈవెంట్ ఏ దేశంలో జరిగినా కండోమ్స్‌కు భలే డిమాండ్ ఉంటుంది. రొమాన్స్ అమ్మాయిల వ్యాపారం కూడా భారీ స్థాయిలో జరుగుతోంది. సాకర్ ప్రపంచ కప్, ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్లు అమ్మాయిల వ్యాపారానికి కేంద్రంగా మారిపోయాయి. ఆతిథ్య నగరాలకు దేశవిదేశాల నుంచి రొమాన్స్ వర్కర్లు వాలిపోతున్నారు. తాజాగా లండన్‌కు క్యూ కడుతున్నారు. ప్రపంచ క్రీడారంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ ఒలింపిక్స్. సాకర్, క్రికెట్ ప్రపంచ కప్‌ల కంటే అమితంగా ఆదరిస్తారు. దిగ్భ్రాంతికరమైన విషయమేంటే రొమాన్స్ అమ్మాయిల వ్యాపారానికి ఈ మెగా ఈవెంట్లు వేదికగా మారడం. ఇందులోనూ ఒలింపిక్స్ అగ్రస్థానంలో ఉంది. లండన్ గేమ్స్‌కు అత్యధికమంది రొమాన్స్ వర్కర్లు వస్తారని అంచనా.
మెగా ఈవెంట్లు ఏ దేశంలో జరిగినా లక్షలాది అభిమానులు వస్తుంటారు. టూరిజం పరిశ్రమకు అదే స్థాయిలో ఆదాయం ఉంటుంది. అయితే, ఆతిథ్య నగరాలు రానురాను రొమాన్స్ వర్కర్లకు కూడా ఉపాధిగా మారుతున్నాయి. దశాబ్ద కాలం నుంచి ఈ జాఢ్యం మరింత జోరందుకుంటోంది. పోటీలు జరుగుతున్నంత కాలం ఆతిథ్య నగరాల్లోనే రొమాన్స్ వర్కర్లు మకాం మారుస్తున్నారు. వీరి సంఖ్య వేలల్లోనే. 2012 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తున్న లండన్‌పై ప్రస్తుతం వారి దృష్టి పడింది. పోటీలు ఆరంభం (ఈ నెల 27న) కాక ముందే ఈ వ్యాపారం మొదలైంది. ఒలింపిక్ పతకం కోసం క్రీడాకారులు సన్నాహకాల్లో మునిగితేలుతుంటే.. మరో వైపు తమ వ్యాపారం జోరుగా సాగించేందుకు రోమాన్స్ వర్కర్లు, నిర్వాహకులు రెడీ అయిపోతున్నారు. 2010లో ఒలింపిక్స్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న అప్పటి బ్రిటన్ మంత్రి టెస్సా జోవెల్ ఇదే విషయాన్ని హెచ్చరించారు. 'మెగా క్రీడా ఈవెంట్లు రొమాన్స్ వ్యాపారానికి కేంద్రంగా మారుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా రొమాన్స్ వర్కర్లను ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి చర్యలు ఆమోదనీయం కాదు. ఒలింపిక్స్ సందర్భంగా లండన్‌కు రాకుండా వారిని అడ్డుకుంటాం' అని జోవెల్ చెప్పారు. అయితే, ట్రాఫికింగ్‌ను అడ్డుకోవడం సవాల్‌గా మారుతోంది. ఇటీవల జరిగిన పలు మేజర్ టోర్నీల్లో ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది.
సాకర్ ప్రపంచ కప్‌నకు లక్షమంది! మేజర్ టోర్నీల సందర్భంగా ఆతిథ్య నగరాలకు వచ్చే రొమాన్స్ వర్కర్ల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. 2006లో సాకర్ ప్రపంచ కప్‌కు వేదికగా నిలిచిన జర్మనీకి 40 వేలమంది వచ్చారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. వీరి కస్టమర్లలో ఎక్కువగా పోటీలను తిలకించేందుకు వచ్చేవారే. కాగా ఈ టోర్నీకి సంబంధించి ఐదు కేసులు మా త్రమే నమోదయ్యాయి. ఇక 2010లో దక్షిణాఫ్రికాలో జరిగిన టోర్నీ సందర్భంగా ఈ వ్యాపారం మరింత పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 40 వేల నుంచి లక్షమంది దాకా రొమాన్స్ వర్కర్లు దక్షిణాఫ్రికాకు వచ్చారని అంచనా. లండన్‌కూ భారీ తాకిడి? లండన్ ఒలింపిక్స్‌కు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందన్న ఇంటలిజెన్స్ నివేదిక మేరకు టోర్నీకి భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. రక్షణ శాఖ అధికారులతో పాటు భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. అయితే, లండన్‌కు రొమాన్స్ వర్కర్ల తాకిడి భారీగా ఉంటుందని స్థానిక మీడియా వెల్లడించడంతో పోలీసులకు ఇదో సమస్యగా మారింది. ఒలింపిక్స్‌ను నిర్వహించే లండన్ తూర్పు ప్రాంతంలో పలు ఏజెన్సీలు 'ఒలింపిక్ ఎస్కార్ట్', 'గోల్డ్ మెడల్' సర్వీసుల పేరుతో విటులను ఆకర్షించేందుకు రంగంలోకి దిగాయని డెయిలీ మెయిల్ తెలిపింది. ఒలింపిక్స్ సందర్భంగా కోట్ల రూపాయల వ్యాపారం జరగవచ్చని భావిస్తున్నారు. ఇక అమెరికాకు చెందిన ఓ వ్యభిచార గృహం నిర్వాహకుడు డెన్నిస్ హో (65) ఇదే విషయంపై మాట్లాడుతూ.. ఆగ్నేయాసియా నుంచి వెయ్యిమంది బాలికలు లండన్ వచ్చే అవకాశముందని చెప్పాడు. గ్రీక్, దక్షిణాఫ్రికా, జర్మనీ, హాలెండ్ నుంచి వలసలు ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. తనకూ ఈ వ్యాపారం నిర్వహించే యోచన ఉన్నట్టు తెలిపాడు. పనిలోపనిగా పోటీలు ముగిసేదాకా వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాలని సెలవిచ్చాడు. ఇదిలావుండగా, డ్రగ్స్, నేరాలతో సంబంధమున్న ఆఫ్రికా దేశాల ముఠాలు రావచ్చని హో చెప్పాడు.
క్రీడాగ్రామంలో కండోమ్స్ కొరత ఒలింపిక్స్ ఏ దేశంలో జరిగినా కండోమ్స్‌ను సరఫరా చేయడం నిర్వాహకులకు సమస్యగా మారుతోందట. ఒలింపిక్ విలేజ్‌లో కండోమ్స్‌తో పాటు మద్యానికి భలే డిమాండ్ ఉంటుందని ఓ బ్రిటీష్ మాజీ క్రీడాకారుడు రాసిన 'ది సీక్రెట్ ఒలింపిక్స్' అనే పుస్తకంలో పేర్కొన్నాడు. 2000 సిడ్నీ ఒలింపిక్స్ సందర్భంగా 70 వేల కండోమ్స్‌ను సరఫరా చేస్తే వారంలోనే డబ్బాలు ఖాళీ అయిపోయాయని తెలిపాడు. ఇక మద్యం, డ్రగ్స్ క్రీడాగామాల్లో నిషేధమైనా, క్రీడాకారులు రహస్యంగా వాటర్ బాటిల్‌లో మద్యం నింపుకొని సేవిస్తుంటారని అతను వెల్లడించాడు. ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చినా చూసిచూడనట్టు వదిలేస్తారని తెలిపాడు. విషయం వెలుగులోకి వస్తే ఒలింపిక్స్ ప్రతిష్టకు మచ్చ ఏర్పడుతుందని వారు భావించడమే కారణమని పుస్తకంలో పేర్కొన్నాడు. ఇక 2008 బీజింగ్ గేమ్స్ సమయంలో 'ఫాస్టర్.. హ్యయ్యర్.. స్ట్రాంగర్' అని ముద్రించి ఆటగాళ్లకు ఉచితంగా కండోమ్‌లను పంపిణీ చేస్తే లక్ష సోదిలోకి లేకుండా పోయాయి.కండోమ్‌ల పంపిణీ కండోమ్‌ల కంపెనీ డ్యూరెక్స్ ఈ ఒలింపిక్స్‌కు ఓ టార్గెట్ పెట్టుకుంది. కనీసం ఒలింపిక్ విలేజ్ 10వేల మంది అథ్లెట్లకు కండోమ్‌లు ఉచితంగా సరఫరా చేయాలన్నది ఆ లక్ష్యం. ప్రపంచంలోనే అత్యధిక కండోమ్‌ల అమ్మకాల్లో ఈ కంపెనీదే అగ్రస్థానం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more