అలాంటి నటులను నేనిప్పటివరకు చూడలేదు. సినిమాల పట్ల వారికున్న మమకారం కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తుంది అన్నారు దీపికాపదుకొనే. ఈ బ్యూటీ చెబుతున్నది అమితాబ్‌బచ్చన్, రజనీకాంత్ గురించి. ‘ఆరక్షణ్’ చిత్రంలో అమితాబ్ కుమార్తెగా దీపికా నటించారు. ప్రస్తుతం రజనీకాంత్ సరసన ‘కోచడయాన్’లో కథానాయికగా నటిస్తున్నారు. అమితాబ్, రజనీ ఈ స్థాయిలో ఉన్నారంటే దానికి వారి అంకితభావమే కారణమని దీపికా పేర్కొన్నారు.
రజనీకాంత్ సరసన నటించడం వల్ల ఏమైనా ఒత్తిడి ఫీలవుతున్నారా? అని అడిగితే - ‘అలాంటిదేం లేదు. వాస్తవానికి నా మొదటి సినిమా ‘ఓం శాంతి ఓం’ అప్పుడు కూడా నేను ఏమాత్రం భయపడలేదు. ఎంతో కాన్ఫిడెంట్‌గా కెమెరా ముందు నిలబడ్డాను. ఒకసారి కెమెరా ముందుకెళ్లిపోయిన తర్వాత నా ఫీలింగ్స్‌ని పక్కెనపెట్టి, నేను ఒప్పుకున్న పాత్రలోకి మమేకమైపోతాను. ఇక, రజనీ విషయానికొస్తే... తనో పెద్ద స్టార్ అనే విధంగా ప్రవర్తించరు. ఒక మామూలు నటుడిలా సెట్‌లోకి వస్తారు. అందర్నీ నవ్వుతూ పలకరిస్తారు. చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తారు కాబట్టి చుట్టూ ఉన్నవాళ్లల్లో కూడా తెలియని ఎనర్జీ ఏర్పడుతుంది. ఇంకా చెప్పాలంటే ఐస్‌క్రీమ్ షాప్‌లో ఐస్‌క్రీమ్ తినడానికి ఉవ్విళ్లూరే చిన్నపిల్లాడిలాంటి వ్యక్తి రజనీ. లొకేషన్‌లో ప్రతి సన్నివేశాన్ని ఆయన ఎంతో ఎక్సయిటింగ్‌గా చేయడం చూసి, ఆశ్చర్యం కలిగింది. వంద చిత్రాలకు పైగా చేసిన ఆయన ఇప్పటికీ కొత్త నటుడిలా ఎక్సయిట్ అవ్వడం అంటే... వృత్తిని ఎంత ప్రేమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పెద్దా చిన్నా అందర్నీ గౌరవిస్తారాయన. లొకేషన్‌లో సౌందర్యను ఒక కూతురిలా కాకుండా డెరైక్టర్‌లా ట్రీట్ చేస్తారు. తానొక సీనియర్ నటుడ్ని అనే ఫీలింగ్ లేకుండా డెరైక్టర్ ఎలా చెబితే అలా చేస్తారు. చాలా విషయాల్లో ఆయన ఆదర్శంగా నిలుస్తారు’’ అని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more