ఉపాదికోసం దేశాంతరం వెళ్లిన ఓ మహిళకు ఉద్యోగం ఇచ్చి ఏడాదికాలంగా అత్యాచారానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. హైదరాబాద్ కు చెందిన సదరు మహిళ మలేసియాలో అత్యాచారానికి గురయింది. ఉద్యోగమిచ్చిన యజమాని ఏడాది పైనుంచి తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని సండ్రీ స్టోర్ లో క్యాషియర్ గా పనిచేస్తున్న బాధితురాలు చాలా కాలానికి పోలీసులు ఫిర్యాదు చేసింది. బాధితురాలు వివరాలు బయటకు తెలియకుండా 'ఎస్' పేరుతో పిలుస్తున్నారు. 2010లో మలేసియాకు వలస వచ్చిన ఆమె కొంతకాలం పాటు జోహొర్ రాష్ట్రంలోని పెర్మాస్ జయలో పని చేసింది. యజమాని తనపై రోజూ అత్యాచారానికి పాల్పడేవాడని, ప్రతిఘటిస్తే హింస పెట్టేవాడని పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసినట్టు స్టార్ దినప్రతిక తెలిపింది. అంతేకాకుండా రెండుసార్లు అబార్షన్ చేయించాడని వాపోయింది. గత నెలలో అతడి బారినుంచి తప్పించుకున్న బాధితురాలు స్థానిక చర్చి గ్రూపు, హక్కుల సంస్థ సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. భారత హైకమిషన్ కు, కార్మిక శాఖకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు నాలుగుసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని బాధితురాలు వాపోయింది. నిందితుడిని కేవలం హెచ్చరించి వదిలేశారని తెలిపింది. తన యజమాని కొన్ని నెలలుగా జీతం కూడా ఇవ్వడం లేదని ఆమె ఆరోపించింది. ఇప్పటికైనా బాధితురాలికి న్యాయం చేయాలని స్థానిక సంఘాలు కోరుతున్నాయి. దీనిపై భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more