గత కొంతకాలంగా కేసీఆర్ కు కోదండరామ్ కు పొసగటం లేదన్నది నిర్వవాదాంశంగా కనిపిస్తోంది. ఇది టీఆర్ఎస్ పార్టీ, పొలిటికల్ జేఏసీ మధ్య మరింత ఎడబాటుకు కారణమౌతోంది. పాలమూరు ఉపఎన్నిక, దాని ఫలితం నుంచీ మొదలైన అంతరం ఇంకా కొనసాగుతూనే ఉంది. పైకి ఏదో చెబుతున్నా సఖ్యత కుదరనట్టే కనిపిస్తోంది. సెప్టెంబరు 30న తెలంగాణ మార్చ్ అన్న కోదండరామ్ పిలుపుపై కేసీఆర్ కోపంగా ఉన్నట్టు సమాచారం. ఆ పిలుపును కేసీఆర్ కోదండరామ్ తొందరపాటుగా భావిస్తున్నట్టు తెలిసింది. తనకు తెలియకుండా కార్యాచరణ ప్రకటించడం పట్ల కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. వివిధ ఉద్యమ సంస్థలకు, సంఘాలకు చెందిన నాయకులతో కేసీఆర్ వరసగా భేటీ అవుతున్నారు. అంటే కోదండను తప్పించి వేరే వారికి బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారమూ ఉంది. దాదాపు పది గంటల పాటు వివిధ అంశాలపై ఉద్యోగ సంఘాల నేతలతో కేసీఆర్ చర్చించినట్లు తెలిసింది. మరోవైపు ఉద్యమాలు చేయకుంటే తెలంగాణ రాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న వాళ్ల సంఖ్య తక్కువేమీ కాదు. జెఎసిలోని పలు సంఘాలు కేసీఆర్ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల తరువాత కేంద్రం ప్రకటన చేస్తుందనే గ్యారెంటీ లేదని, అందుకోసమే ఉద్యమాలు చేయాలని కొందరు వాదిస్తున్నారు. ఉద్యమ సంస్థల మధ్య, ప్రత్యేక రాష్ట్రం కోసమే తాము పుట్టామని చెబుతున్న పార్టీ మధ్య పొంతన
లేనప్పుడు ప్రకటన కానీ, ఐక్య ఉద్యమం కానీ సాధ్యం కాదని జెఎసి నాయకులు కొందరు అంటున్నారు.
ఉద్యోగ సంఘాల భేటీలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఉద్యోగుల విషయంలో తీసుకోవాల్సిన విధానాలపై కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలిసింది. రాష్ట్ర విభజన అయితే గనుక ఇతర ప్రాంత ఉద్యోగులను ఎలా పంపాలనే దానిపై కూడా ఆయన లోతుగా చర్చలు చేస్తున్నారు. ఇతర ప్రాంత ఉద్యోగులు ఎందరున్నారో శాఖల వారీగా జాబితాలు తయారు చేయాలని కొందరు ఉద్యోగ సంఘ నాయకులకు సూచించినట్లు సమాచారం. పద్రాగష్టులోపు కేంద్రం తెలంగాణపై ప్రకటన చేస్తుందని, కాకుంటే సెప్టెంబర్ మాసంలో తప్పకుండా ప్రకటన వస్తుందని కెసిఆర్ అంటున్నారు. అయినా రానీ పక్షంలో మెత్తం జెఎసిలోని నాయకత్వాన్ని మార్చే యోచనలో కెసిఆర్ ఉన్నట్లు సమాచారం. స్వామిగౌడ్ రిటైర్డ్ అయిన తరువాత జెఎసి బాధ్యతలు ఆయనకే అప్పగించే అవకాశం ఉందని కొందరు నాయకులు అంటున్నారు. వ్యూహాలు రచించి ఫలితాలు రాబట్టడంలో కరుడుగట్టిన కేసీఆర్ దెబ్బకు కోదండరామ్ దండాలు పెడతాడో, దండయాత్ర చేస్తాడో చూడాలి
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more