అస్సోంను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి.. ఖజరంగ జాతీయ పార్కును వరద నీరు ముంచెత్తడంతో వన్యప్రాణులు మరణిస్తున్నాయి. బ్రహ్మపుత్ర నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలన్ని నీట మునుగుతున్నాయి. సహాయ బృందాలు బాధితుల్ని ఆదుకోడానికే ప్రాధాన్యం ఇవ్వడంతో మూగజీవాల సంగతి పట్టించుకునే వారు కరువయ్యారు ప్రపంచంలోనే అరుదైన జీవజాలం ఉన్న ఖజరంగ నేషనల్ పార్క్ లో రైనోసరస్ లు, జింకలు, లేళ్లు వందల సంఖ్యలో మృత్యువాతపడ్డాయి. గత వారం రోజులుగా పార్కు పూర్తిగా నీట మునగడం, ఆహారం లభించకపోవడంతో జంతువులు ఒక్కొక్కటిగా మృతిచెందుతున్నాయి. ఇక ప్రాణాలు రక్షించుకునేందుకు అడవుల్లోంచి రోడ్లపైకి వస్తున్న జంతువులు వాహనాలు ఢీకొట్టి మరనిస్తున్నాయి. 37వ నంబరు జాతీయ రహదారిమీద పదుల సంఖ్యలో వన్యప్రాణులు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నాయి. ఖజరంగ నేషనల్ పార్కులో జంతువులు భారీ సంఖ్యలో మరణించడంతో మేల్కొన్న అధికారులు మిగిలిన జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రపంచంలోనే రైనోలకు ప్రసిద్ధి చెందిన ఖజరంగా పార్కులో ఇప్పటి వరకు 13రైనోలతో పాటు 465జింకలు, అడవి పందులు, దుప్పులు, లేళ్లు భారీ సంఖ్యలో మృతిచెందినట్లు అటవీ శాఖ లెక్కించింది. రిజర్వ్ ఫారెస్ట్ లో నివసిస్తోన్న ప్రజల్ని ఆర్మీ రక్షిస్తున్నా జంతువుల ప్రాణాలు కాపాడటం వారికి కష్టంగా మారింది. గ్రామస్తుల సహకారంతో వన్యప్రాణుల్ని ఎత్తైన ప్రాంతాలకు చేరుస్తున్నా వాటికి ఆహారం అందించడం కష్టమవుతోందని ఆర్మీ చెబుతోంది. ఖజరంగ పార్కులో 80శాతం భూభాగం వరద నీటిలో చిక్కుకోవడంతో మరిన్ని జంతువులు మృత్యువాత పడతాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇక అస్సోం వరదల్లో మరణించిన వారి సంఖ్య 130 దాటింది. 2కోట్ల మంది ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారని అస్సోం ప్రభుత్వం ప్రకటించింది.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more