సల్మాన్ ఖాన్ సోదరుడు సొహైల్ ఖాన్ కారు కింద పడి ఓ వృద్ధురాలు దుర్మరణం పాలైంది. సరిగ్గా పదేళ్ల క్రితం సల్మాన్ సైతం పేవ్ మెంట్ మీద పడుకున్న వ్యక్తులపై కారు నడిపి ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యాడు. ఆ కేసు ఇంకా సద్దుమణగక ముందే ఇప్పుడు సొహైల్ ఖాన్ ఉదంతం చోటుచేసుకోవడం సంచలనమైంది. సరిగ్గా పదేళ్ల క్రితం బాంద్రాలో జరిగిన కారు ప్రమాదం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను చిక్కుల్లో పడేసింది. 2002 సెప్టెంబర్ 28న బాంద్రాలో సల్మాన్ కారు పేవ్ మెంట్ మీద ఉన్న జనంపైకి దూసుకుపోయింది. ఆదమరిచి నిదురపోతున్న ఐదుగురిపై కారు ఎక్కడంతో ఒకరు మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. ఈ
కేసులో సల్మాన్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మృతుడు నంద్ బెహ్రా కుటుంబానికి 10లక్షలు, గాయపడిన వారికి మూడు లక్షల రూపాయాలు చెల్లించాలని బాంద్రా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు సల్మాన్ ను ఆదేశించింది.
తాజాగా సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ కు దాదాపు ఇలాంటి అనుభవమే ఎదురైంది. బాంద్రాలోని ఓ చర్చి సమీపంలో చంద్రబాల అనే 60ఏళ్ల వృద్ధురాలిపై ఆదివారం రాత్రి లాండ్ క్రూయిజర్ కారు దూసుకుపోతుంది. వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించేలోగా ఆమె కన్నుమూసింది. నటుడు సోహైల్ ఖాన్ పేరుతో ఆ కారు రిజిస్టర్ అయింది. అయితే ప్రమాద సమయంలో సోహైల్ ఖాన్ కారులో లేడని తెలియడంతో ఆయన కారు డ్రైవర్ ధనంజయ్ పై పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు. మరోవైపు కారు ప్రమాదం గురించి తనకు తెలిసి షాక్ అయినట్టు సోహైల్ ఖాన్ తెలిపారు.
తాను ఇంట్లోనే ఉండటంతో అసలు ఏమి జరిగిందో తనకు తెలియదని ఆయన చెప్పారు. డ్రైవర్ మాత్రమే కారులో ఉన్నాడని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగినట్టు తనకు తెలిసిందని అన్నారు. ఒక మహిళ చనిపోయిందనే విషయాన్ని పట్టించుకోకుండా కారు ఎవరదనే విషయంపైనే చర్చ సాగడం విచారకరమన్నారు. ఇటు సల్మాన్ సైతం ఇది పొరపాటున జరిగిన ప్రమాదంగా పేర్కొన్నారు. రోడ్డుపై తనకు ఓ పోలిథిన్ బ్యాగ్ కనిపించిందని అయితే అది నల్లదుస్తులు ధరించిన మహిళ అని తర్వాతే తెలిసిందని డ్రైవర్ తనతో చెప్పినట్టు సల్మాన్ పేర్కొన్నారు. మృతురాలిని ఆమె కుటుంబ సభ్యులు గతంలోనే వదిలివేసినట్టు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఎవరికీ నష్టపరిహారం చెల్లించలేదని తెలిపారు.
...avnk(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more