విజయవాడ ఎంపీలగడపాటి రాజగోపాల్ లేఖ రాద్దాంతం తెచ్చిపెట్టింది. లగడపాటి రాజగోపాల్‌కు టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుతో చర్చించే స్థాయిలేదని కె. తారక రామారావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌కు సవాల్ చేసే స్థాయి లగడపాటికి లేదని, ఆయన స్థాయికి తగ్గ వారితో చర్చించాలని, అయన స్థాయి తగిన వారు టీఆర్ఎస్‌లో చాలా మంది ఉన్నారని, వారంతా లగడపాటితో చర్చించడానికి ఎప్పుడైనా సిద్ధమని కేటీఆర్ పేర్కొన్నారు. కృష్ణాడేల్టాకు నాగార్జున సాగర్‌నుంచి సాగు నీటి విడుదలను ఆపి ప్లోరైడ్‌తో అల్లాడుతున్న నల్లగొండ జిల్లాకు తాగు నీరు ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్
చేశారు. నాగార్జునాసాగర్ డెడ్ స్టోరేజీ నుంచి కూడా కృష్ణడేల్టాకు రాత్రిపూట నాలుగు టీఎంసీలు వదులుతున్నారని ఆరోపించారు. జాతీయ ఫ్లోరైడ్ సెంటర్‌ను నల్లగొండలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును పూర్తి చేయాని అన్నారు.
ఇదిలా ఉండగా, తెలంగాణపై అసత్యప్రచారం చేస్తున్నారంటూ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నివాసం వద్ద టి.జేఏసీ న్యాయవాదుల ఆందోళన చేపట్టారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీసేలా.. ప్రజలను రెచ్చ గొట్టేలా మాట్లాడవద్దని టి.జేఏసీ న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. లగడపాటి నివాసంపై కోడిగుడ్లు విసిరడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆందోళన చేస్తున్న టి.న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు రాయల తెలంగాణ అంటే రాళ్ల దెబ్బలు తప్పవంటూ రాయలసీమ విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి (ఆర్‌వీజేఏసీ) నేతలు హెచ్చరించారు. తిరుపతిలోని ఎస్వీయూలో శనివారం వీరు మంత్రి టీజీ వెంకటేష్, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. వర్శిటీ ప్రకాశం భవనం ముందు వీరిద్దరికీ వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఈ సందర్భంగా నేతలు శ్రీకాంత్, హరికృష్ణయాదవ్, ఆనందగౌడ్ మాట్లాడుతూ.. టీజీ, జేసీలు తమ వ్యాపారాభివృద్ధి, స్వార్థ ప్రయోజనాల కోసమే రాయల తెలంగాణ నినాదాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. వారు నోరు అదుపులోకి పెట్టుకోకపోతే రాయల సీమ ప్రజలతో రాళ్ళ దెబ్బలు తినడం ఖాయమని హెచ్చరించారు. టీజీ, జేసీలను రాయలసీమ బహిష్కరణ చేయాలన్నారు. మతిభ్రమించిన వారి మాటలు మాని రాయలసీమ సమగ్ర అభివృద్ధి కోసం ప్రజలతో కలిసి పోరాడాలన్నారు.
...\‹jáTsÁ
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more