ప్రఖ్యాత ఫోబ్స్ పత్రిక తాజాగా క్రీడాకుబేరుల జాబితాను విడుదల చేసింది. బాక్సింగ్ మాంత్రికుడు మేవీథర్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. మరో బాక్సర్ ఫిలిప్ పక్యావ్ రెండో స్తానంలో గోల్ఫ్ లెజెండ్ టైగర్ వుడ్స్ మూడో స్థానంలో నిలిచారు. పదినెలలుగా అంతగా రాణించకపోయినా టీమిండియా కెప్టెన్ ధోనీ 31వ స్థానం దక్కించుకోగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 78వ ప్లేస్ తో సరిపెట్టుకున్నాడు. ఏటా ప్రపంచ ధనికుల జాబితాను విడుదల చేస్తున్న ఫోబ్స్ పత్రిక క్రీడా కుబేరుల జాబితాను విడుదల చేసింది. ఫోబ్స్ విడుదల చేసిన తాజా జాబితాలో టీమిండియా కెప్టేన్ మహేంద్రసింగ్ ధోనీ 31స్థానంలో నిలిచాడు. పదినెళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో అంతగా పరుగుల వరద పారించకపోయినా ప్రకటనల ద్వారా తనపై కాసుల వర్షాన్ని కురిపించుకున్నాడు. ఇరవై ఆరుకోట్ల రూపాయలు ప్రకటనలు ద్వారా ధోనీ సంపాదించాడు.
మరోవైపు మాస్టర్ బ్లాస్టర్ 18కోట్లు సంపాదించి 78వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో బాక్సింగ్ ఛాంపియన్ మేవీథర్ టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు. 85కోట్ల రూపాయల ఆదాయంతో ప్రకటనల రారాజుగా ఎవరికీ దక్కని సంపాదన సొంతం చేసుకున్నాడు. ఈ జాబితాలో 62కోట్ల రూపాయల సంపాదనలో ఫిలిప్ పక్యావ్ రెండో స్తానంలో 59కోట్ల రూపాయల ఆదాయంతో గోల్ఫ్ లెజెండ్ టైగర్ వుడ్స్ మూడో స్థానంలో నిలిచారు. మియామీ హీట్ స్టార్ లెబ్రాన్ జేమ్స్ నాలుగో స్తానంలో స్విస్ టెన్నీస్ స్టార్ రోజర్ ఫెదరర్ ఐదో స్తానంలోనూ ఉన్నారు. ఎన్బీఏ స్టార్ కోబ్ బ్రయంట్, యూఎస్ గోల్ఫర్ మికెల్సన్, డేవిడ్ బెకహం గెలాక్సీ తదితరులు తర్వాతి స్థానాల్లో నిలిచారు. 100మందితో కూడిన జాబితాలో ఇద్దరు మహిళా క్రీడాకారులు మాత్రమే స్తానం సంపాదించుకున్నారు. రష్యన్ టెన్నీస్ స్టార్ మరియా షరపోవా 26స్థానంలోను 2011 ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్ చైనా టెన్నీస్ సంచలనం లీనా 81స్థానంలోను ఉన్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more