కొత్త ఎమ్మెల్యే మంచి బుద్ది పుట్టింది. తనను గెలిచిప నియోజక వర్గం ప్రజల కోరికలను ఇట్టే తీర్చుతున్నాడట. ప్రజల కోరిక మేరకు ఆయన నిరాహార దీక్ష చేయటానికి కూడా సిద్దమైనట్లు తెలుస్తోంది. తిరుపతిలో మధ్య అమ్మకాల్ని నిషేధించాలంటూ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నిరాహారదీక్ష చేపట్టారు. పవిత్రస్థలమైన తిరుపతిని మధ్యరహిత నగరంగా మార్చాలని భూమన డిమాండ్ చేస్తున్నారట. తిరుపతిని మద్యరహిత ప్రాంతంగా ప్రకటించే వరకు దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.
శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం వస్తున్న కోట్లాది మంది భక్తులను మద్యానికి బానిసలు చేసే కార్యక్రమం సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని శ్రీనివాసం (అతిథి గృహ సముదాయం) పక్కనే ఉన్న ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో భూమన ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. వేదపండితులు మంత్రోచ్ఛరణలతో కరుణాకరరెడ్డిని ఆశీర్వదించారు. నగరంలోని మహిళలు పెద్ద ఎత్తున దీక్షా శిబిరానికి చేరుకుని మద్దతు పలికారు. శిబిరం సమీపంలో రోడ్డుపై మద్యం సీసాలను ధ్వంసం చేశారు. నెహ్రూనగర్‌లో మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి కరుణాకరరెడ్డికి సంఘీభావం ప్రకటించారు. తిరుమలకు వెళ్లే మార్గంలో మద్యం షాపులను ఎత్తివేశామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారనీ, అయితే వాటిని పూర్తిగా ఎత్తివేయలేదని భూమన చెప్పారు. పక్కనే మరో చోటుకి తరలించి షాపులను నడుపుతున్నారని పేర్కొన్నారు. నగరంలో అనేక మంది మహిళలు మద్యం నిషేధించాలని కోరుకుంటున్నారన్నారు. ఈ విషయం ఎన్నికల ప్రచారంలో తాను వీధివీధి తిరిగిన సమయంలో మహిళలే స్వయంగా చెప్పారన్నారు. ఎమ్మెల్యే దీక్షకు ప్రజా సంఘాల నేతలు, గిరిజన హక్కుల పోరాట సమితి నాయకులు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాటకొండ విశ్వనాథ్ మద్దతు పలికారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more