The numbers game in andhra pradesh

The numbers game in Andhra Pradesh,ap, bypoll results, cm kirankumar reddy, cm kirankumar reddy silent, cm kiran no sachivalayam, cm kiran no development, cm kiran only election, deputy cm damodara rajanarasimha, tdp, tdp office, byelection, poll results, candidates failure, ysr congress, congress, party future, enforcement directorate, jagan assets case, ed petition, ed nampalli court, jagan investigation

The numbers game in Andhra Pradesh

bypoll.gif

Posted: 06/17/2012 12:30 PM IST
The numbers game in andhra pradesh

The numbers game in Andhra Pradesh

రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలకు జడ్జిమెంట్ రానే వచ్చింది. జైల్లో నుంచే తన జైత్రయాత్రను ముగించిన జగన్ .. తన కార్యాచరణ అనబడే యాక్షన్ ప్లాన్ కు స్కెచ్ లు గీసుకుంటున్నట్లు సమాచారం . జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ తన దగ్గర ఉన్న ఆయుధాలను అన్ని ఉపయోగించుకున్నట్లు తెలుస్తుంది. యుద్దంలో.. అన్నిఆయుధాలు ఒకేసారి ఉపయోగిస్తే.. రాబోయే విపత్తును ఎలా తప్పించుకుంటాడు? ఇప్పుడు సెమీ ఫైనల్లో గెలిచాడు. కానీ జగన్ కు ఫైనల్లో గెలవాలి కదా? అని రాజకీయ పార్టీలు అంటున్నాయి . జైలుకు వెళ్లిన జగన్ .. తన తల్లి విజయమ్మ, సోదరి షర్మిలతో 18 నియోజక వర్గాలలో ప్రచారం చేయించి సెంటిమెంట్ , తండ్రి మరణం, షర్మిలా ప్రసంగాలతో .. సానుభూతితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగన్ జైలుకు వెళ్లిన సానుభూతి, సెంటిమెంట్ , విజయమ్మ కన్నీళ్లకు ..షర్మిలా గ్లామర్ కు .. అమాయక ప్రజలు .. అక్రమార్రుడుని .. విక్రమార్రుడిగా చేశారని .. రాజకీయ మేథావులు అంటున్నారు. ఇక్కడ కేవలం సానుభూతి, సెంటిమెంట్, కన్నీళ్లకే .. ఫ్యాన్ గాలి వీచిందని మీడియా వర్గాలు అంటున్నాయి

The numbers game in Andhra Pradesh

ఈ ఉప ఎన్నికల ఖర్చు కూడా భారీగా పెరిగిపోయింది. ఒక్కోక్క ఎమ్మెల్యే ఎన్నికల ఖర్చు 15 నుంచి 20 కోట్లు పెట్టి నట్లు తెలుస్తుంది. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ నుండి తిరుపతి ఎమ్మెల్యే గా పోటీ చేసిన   అభ్యర్థి వెంకటరమణ .. సుమారుగా 25 కోట్లు ఖర్చు పెట్టి నట్లు తెలుస్తుంది. ఆయన అంత డబ్బు ఖర్చు పెట్టిన చివరకు   ఓటమిని చవిచూసి .. కన్నీటి పర్యంతమైనట్లు మీడియా వర్గాలు అంటున్నాయి . వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించటంతో.. రాష్ట్రంలో జగన్ పార్టీ కి ఒక గుర్తింపు వస్తుంది. శాసనసభలో జగన్ పార్టీకి బలం పెరిగింది. జగన్ పార్టీకి శాసనసభ కార్యాలయం ఇవ్వటం జరుగుంది.   ప్రత్యేక మైన హోదాను జగన్ పార్టీ దక్కించుకుందని   రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ ఇదే సానుభూతి, సెంటిమెంట్ 2014 ఎన్నికల్లో ప్రజల ముందు పని చెయ్యవని రాజకీయ నాయకులు అంటున్నారు. అప్పుడు ఎలాంటి ఆయుధాలను ఉపయోగిస్తాడో .. 2014 వరకు ఎదురు చూడాలి. కేవలం జగన్ గెలుపు.. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిందం వలనే గెలిచినట్లు రాజకీయ సీనియర్ నాయకులు అంటున్నారు.

The numbers game in Andhra Pradesh

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి .. ఓటు బ్యాంకును కాపాడుకోలేక పోయింది. కాంగ్రెస్ పార్టీలో రెడ్డి వర్గం నాయకులు ఉన్నప్పటకి ఓటు బ్యాంకును తేవటంలో విఫలమయ్యారని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ గెలిసిన రెండు సీట్లు కూడా కాపుల ఓటు బ్యాంకుతో గెలిచినట్లు తెలుస్తుంది. రామచంద్రపురం .. టీడీపీకి పెట్టి పేరు. అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండి.. అన్ని వర్గాలు వారు ఒక్కటై కాంగ్రెస్ ను గెలిపించినట్లు తెలుస్తుంది. ఈ గెలుపు చిరంజీవి వలనే వచ్చిందని తెలుస్తుంది. రెడ్డి వర్గం వారు కాంగ్రెస్ పార్టీకి పని చేయలేదని తెలుస్తుంది. అభ్యర్థులను ఎంపిక విషయంలో కూడా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి .. తన రెడ్డి వర్గానికి ఎక్కువ సీట్లు ఇవ్వటం కోసం .. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర మంతనాలు జరిపినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే.. తప్పని సరిగా రెడ్డి వర్గానికి అధ్యిపత్యం ఇవాలని, అందువలన కాంగ్రెస్ గెలుస్తోందని సోనియా తో కిరణ్ చెప్పినట్లు ఢిల్లీ నాయకులు అంటున్నారు.   కిరణ్ కుమార్ ఉప ఎన్నికల్లో ఎక్కువ రెడ్డి వర్గానికి ప్రధ్యానత ఇచ్చినట్టు తెలుస్తుంది. బిసిలకు, కాపులకు గానీ కాంగ్రెస్ సీట్లు ఇవ్వకపోవటమే కాంగ్రెస్ ఓటమి పాలైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.   కాంగ్రెస్ పార్టీ ఆంద్ర ప్రదేశ్ ఉండాలంటే .. ముందుగా కాపులను, బిసిలను, మాదిగలను, బ్రహ్మాణలను, వైశ్యులను, ముస్లీంలను, కాంగ్రెస్ పార్టీ దగ్గరికి తీసి వారిని నాయకులుగా గుర్తించాలి . అప్పుడు వారు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి చెందుతాయి. ఉదాహరణకు.. అనంతపురంలో రెడ్డి వర్గం ఎక్కువ గా ఉన్నారు. కాంగ్రెస్ అక్కడ ఒక ముస్లీం అభ్యర్థిని నిలబెట్టింది. అక్కడ మస్లీం ఓట్లు 40 వేలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ కు అక్కడ వచ్చింది కేవలం 9 వేలు మాత్రమే.. దీనిని బట్టి కాంగ్రెస్ పార్టీకి రెడ్డి నాయకులు ఉన్నప్పటికి ఓట్లు రావటంలేదని తెలిసింది. అక్కడ జగన్ పార్టీ గెలిసింది.   టీడీపీకి   సెకండ్ స్థానం సంపాదించుకుంది. అంటే టిడిపి అక్కడ కాపు అభ్యర్థిని నిలబెట్టి 45 వేలు ఓట్లు సాధించుకోని సెకండ్ స్థానం దక్కించుకుంది.  సామాజిక , రెడ్లు , మాల వల్ల కాంగ్రెస్ పార్టీ నిలబడదని తెలిసిపోయింది. ఈ రెండు వర్గాలు జగన్ పార్టీ కే అని స్పష్టం అయింది. క్రిష్టియన్ పార్టీగా మాలలు జగన్ పార్టీని గుర్తించారని రాజకీయ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ లోకి కొత్తగా కాపులు, మాదిగలు, బిసిలు, బ్రహ్మణలు, పద్మసాలిళ్లు, పల్లెకారులు, ఇంక తదితర వర్గాలను చెర్చుకోవటంతో.. కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని రాజకీయ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ లో బొత్స , లగడపాటి నాయకులు ఇంక చాలా మంది అవసరమని   సీనియర్ నాయకులు అంటున్నారు. గట్టిగా మట్లాడే నాయకులు లగడపాటి, కావూరి, డొక్క, దామోదర్ నరసింహన్, టీజీ వెంకటేష్ ఇలాంటి వాళ్లు గట్టిగా ఫైట్ చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉండగలుగుతుంది.

కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ లో కూడా రెడ్డి వర్గానికే పీఠం వేస్తే.. ఆ రెడ్డిగారే కాంగ్రెస్ పార్టీ కి ఘోరి కడతారని రాజకీయ విశ్లేషలకు అంటున్నారు.

The numbers game in Andhra Pradesh

తెలుగుదేశం పార్టీ   జరిగిన ఉప ఎన్నిలకలో గెలవకు పోయిన..   తన ఓటు బ్యాంకు కాపాడుకుందని చెప్పాలి. టిడిపి 10 నియోజక వర్గాలలో సెకండ్ స్థానం దక్కించుకుంది. అంటే టీడీపికి అభ్యర్థులు గెలవకు పోయిన .. తన ఓటు బ్యాంకును మాత్రం పొగొట్టుకోలేదని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. టీడీపీ పార్టీ 6 సీట్లు కాపులకు ఇవ్వటం పార్టీకి లాభాం చేకూరింది. రాయలసీమలో తెలుగు దేశం పార్టీ సెకండ్ స్థానం దక్కించుకుంది. తెలుగుదేశం పార్టీ సెకండ్ రావటానికి కారణం చంద్రబాబే . పార్టీలో యువ నాయకత్వం లేకపోవటంతో.. పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయాని, ఆ లోటు త్వరలో లోకేష్ బాబు, బాలక్రిష్ణలతో భర్తీ చేస్తున్నట్లు   పార్టీ నాయకులు అంటున్నారు. ఉదా: గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజక వర్గంలో గత ఎన్నికల్లో 50 వేలు వస్తే.. ఈసారి 70 వేలు ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 30 వేలు ఓట్లు మాత్రమే వచ్చాయి. టిడిపి సెకండ్ స్థానం దక్కించుకుంది. చంద్రబాబు నాయకుడు బిసిలు, కొంతమేర దూరమైనట్లు తెలుస్తుంది. టిడిపి పార్టీ కి మాదిగలు, కాపులు, కమ్మ, బిసిలు దురంగా ఉండటం.. యువత కూడా టీడీపీని దూరం పెడుతున్నట్లు రాజకీయ నాయకులు అంటున్నారు.

The numbers game in Andhra Pradesh

టీఆర్ఎస్ పార్టీ .. తెలంగాణ మొత్తం సీట్లు టీఆర్ఎస్ కే అని చక్కలు కొట్టుకున్న కేసిఆర్ పరకాలలో జరిగిన అవమానం చాలా పెద్దదని రాజకీయ నాయకులు అంటున్నారు. టీఆర్ఎస్ చివరకు చావు తప్పి కన్నులొట్టపోయింది అనే విధంగా .. గెలించింది. పరకాలలో కొండ సురేఖ మీద పోటీ చేసిన టీఆర్ఎస్ ముక్కుతూ.. ములుగుతూ చివరకు గెట్టెక్కిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.   అసలు పరకాల గెలుపు, టీఆర్ఎస్ పార్టీ ది కాదని కొందరంటున్నారు. తెలంగాణ లో కూడా జగన్ పార్టీ .. గెలుపు అంచుల వరకు వచ్చి ఆగిపోయిందంటే.. కేసిఆర్ ఒక్కసారి ఆలోచించుకోవాలి. అంటే ప్రజలు కేసిఆర్ ను ఇంక నమ్మలేదని దీనిని బట్టి అర్థం అవుతుందని సీనియర్ మేథావులు అంటున్నారు.

బిజేపి పార్టీ .. ఏదో గుడ్డిలో మెల్లలాగ మహబుబ్ నగర్ లో కమలం విరిసింది. అదీ సాకుగా తీసుకోని జాతీయ నాయకుల చేత కిషన్ రెడ్డి పరకాలలో ప్రచారం చేయించి. పరకాల మొత్తం కషాయంతో నింపినట్లు తెలుస్తుంి. కానీ పరకాల  ప్రజల మాత్రం కషాయం కలర్ వైపు చూడలేదని ఉప ఎన్నికల్లో అర్థం అయ్యింది. దీనిని బట్టి కిషన్ రెడ్డి అర్థం చేసుకోవాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంటే బిజేపి పార్టీ వాపు చూసి బలం అనుకొని రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది.

జగన్ రాష్ట్రంలో గోదావరి జిల్లలో ఓదార్పు యాత్ర పేరుతో 40 రోజులు తిరిగినప్పటికి .. అక్కడ కాపుల నాయకులు గెలిచారు. వైజాక్, పశ్చిమ గోదావరి, ఈస్ట్ గోదావరి రాయలసీమల్లో ఎంతో మెజార్టీటి వచ్చిందో స్పష్టంగా   కనిపిస్తుంది. ఎన్నికల్లో ప్రధానంగా .. డబ్బు, మందు ఎక్కువగా నడుస్తుంది. ఒక్క తిరపతిలోనే 30 కోట్లు ఖర్చు పెట్టినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. ఎన్నికల ఖర్చు ప్రతిసారి పెరిగిపోతుంది. ఎన్నికల కమిషన్ అధికారి పట్టుకున్న డబ్బు అక్షరాల 45 కోట్లు దాటిపోయింది. సామాన్య ప్రజలు కూడా జగన్ ను ఒక రాబిన్ హుడ్స్ గా చూస్తున్నారట. సామాన్యలు ఎప్పుడు హీరోలనే ఇష్టపడతారని రాజకీయ విశ్లేషకలు అంటున్నారు. ఆంద్రప్రదేశ్ రాబిన్ హుడ్స్ హీరో జగన్ అని అంటున్నారు. ఎక్కువ మంది సామాన్యలు హీరోల వైపుకే వెళుతున్నారు. చదువుకున్న యువకులు, విద్యావేత్తలు   ఓటు తో అవినీతిని గెలిపించారు.   దీనివలన వ్యవస్థ దెబ్బతింటుందని మేథావులు అంటున్నారు.   ఎన్నికల్లో ప్రధానంగా డబ్బు, మందు లాంటి లేకుండా, స్వచ్చమైన ఓటు ను మంచి నాయకుడు కు వేస్తే.. వ్యవస్థ బాగుపడుతుందని రాజకీయ నాయకులు అంటున్నారు.

The numbers game in Andhra Pradesh

ఈ ఉప ఎన్నికలు చిరంజీవి కి మరొ అవకాశం ఇచ్చినట్లు కనబడుతుంది. తన సామాజిక వర్గాన్ని దగ్గరకు తీస్తే మంచి భవిష్యత్తు ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేవలం కాపుల వలనే కాంగ్రెస్ రెండు సీట్లు వచ్చాయాని అంటున్నారు. ఇప్పటి వరకు చిరంజీవి   మచ్చలేని నాయకుడిగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలను , తన సామాజిక వర్గాన్ని , బిసిలను, ముస్లింలను, ఎస్ సిలను, ఎస్ టీలను, చిరంజీవి గుర్తించి వారికి పట్ల సానుభూతి చూపించినట్లైతే .. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి చిరంజీవి సిఎం అయ్యే రోజు వస్తుందని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kodali nani meets chandrababu naidu
Pawan kalyan to act with kareena kapoor  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more