తెలుగుదేశం పార్టీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. నాని టీడీపీని వీడి జగన్ పార్టీలో చేరే అవకాశముందనే ప్రచారం నేపథ్యంలో ఈ భేటీ జరగడం విశేషం. తనకు పార్టీని వీడే ఆలోచన లేదని, అదే విషయం చంద్రబాబుకు స్పష్టం చేశానని నాని భేటీ అనంతరం పార్టీ నేతలతో చెప్పారు. పార్టీలో గత కొన్ని రోజులుగా దుమారం లేపుతున్న కొడాలి నాని వ్యవహరం ఎట్టకేలకు సద్దుమణిగింది. ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌తో కలిసి ఆయన అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా సమావేశ మయ్యారు. పార్టీ వీడబో తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని అధినేత ఎదుట ఖండించి, వివరణ ఇచ్చుకున్నట్లు తెలిసింది. పార్టీని వీడే ప్రసక్తే లేదంటూ తేల్చిచెప్పినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. కృష్ణా జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా మహేశ్వర్ రావుతో నెలకొన్న విభేదాలను ఈ సందర్భంగా అధినేత వద్ద కొడాలి నాని ప్రస్తావించినట్లు సమాచారం. తాను ఇద్దరి మధ్య సర్దుబాటు చేస్తానని చంద్రబాబు నాయుడు, ఆయ నకు హామీనిచ్చినట్లు తెలుస్తోంది.
నాని సన్నిహితుడు విజయవాడ అర్బన్ అధ్యక్షు డు వల్లభనేని వంశీమోహన్ ఎపిసోడ్ మరిచిపోకముందే నాని వైస్సార్సీపీలో చేరబో తున్నారన్న ప్రచారం ఊపందుకోవడంతో పార్టీ వర్గాల్లో కల, కలం మొదలయింది. వీటికి తోడు ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణమే వైస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, జగన్, నాని ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు గుడివాడ నియోజకవర్గంలో హల్‌చల్ చేశాయి. ఇవాలో, రేపో చంచ ల్‌గూడ జైలులో జగన్‌ను ములాఖత్ పేరిట నాని, వంశీ కలుసు కోనున్నారన్న ప్రచారం ఈ రోజు ఉదయం నుంచి మీడియాలో షికారు చేసింది. అయితే సాయంత్రం ఆకస్మాత్తుగా నాని చంద్రబాబు ఇంటి ముందు ప్రత్యక్షమయ్యారు. వైవీబీ రాజేంద్రప్రసాద్‌తో కలిసి అధినేతతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. తనకు పార్టీ వీడే ఉద్దేశం లేదని అధినేతకు తేల్చి చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వారం వ్యవధిలో నాని బాబును కలవడం ఇది రెండోసారి. ఉప ఎన్నికల పోలింగ్ రోజు ఆయన చంద్రబాబుతో రెండు గంటలపాటు సమావేశమయ్యారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more