చరిత్ర ఏం చెబుతుందో.. నాకు తెలియాదు కానీ. మనం చరిత్రలో నిలిచిపోవాలంటే మాత్రం ఏదోకటి చేయ్యాలి అనే వ్యక్తి టాలివుడ్ ఒక్కరే. ఆయన వస్తున్నాడు అంటే .. మీడియా వారి పెద్ద పండుగే అని చెప్పాలి. ఆయనే సినీ నటుడు డాక్టర్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. రాజకీయ పార్టీలకు సినీ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మోస్ట్ వాంటెడ్‌గా మారిపోయారు. ఆయనను తమ తమ పార్టీలలోకి తీసుకు వచ్చేందుకు కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే మోహన్ బాబును తన వైపుకు తీసుకు వెళ్లేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన వంతు ప్రయత్నాలు చేశారని అంటున్నారు.
జగన్ ఇటీవల మోహన్ బాబు ఇంటికి వెళ్లి కలిశారు. కేవలం బంధుత్వ పరంగా కలిశారని ఇరువురు కొట్టిపారేసినప్పటికీ అతనిని తన పార్టీలోకి ఆహ్వానించేందుకే వైయస్సార్ కాంగ్రెస్ అధినేత వెళ్లారని చెబుతున్నారు. తెలుగదేశం, వైయస్సార్ కాంగ్రెసు వైపు చూస్తున్న మోహన్ బాబును తన వైపుకు రప్పించుకునేందుకు కాంగ్రెసు పార్టీ కూడా ఓ రాయి వేసి చూసింది. ఇటు సినిమాలు, అటు రాజకీయాలతో సంబంధమున్న రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామి రెడ్డి కూడా మోహన్ బాబును నెల్లూరులో తన వైపుకు ఓటర్లను ఆకర్షించే ఉద్దేశ్యంలో భాగంగా ఆయనను తన కళా పరిషత్ ద్వారా నటవాచస్పతిచే గౌరవించారు.
తాను రాజకీయాలలోకి వస్తానని ప్రకటించిన అనంతరం టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుపై పొగడ్తల వర్షం కురిపించిన మోహన్ బాబు ఆ పార్టీలోకి వెళతారనే ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత అతను జగన్, కాంగ్రెసుతో చెట్టాపట్టాలేసుకోవడం టిడిపికి రుచించలేదట. ఆయనను టిడిపిలోనికి రప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇందుకు బాబు తన బావమరిది, నందమూరి హీరో బాలకృష్ణను ఉపయోగిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
బాలకృష్ణ, మోహన్ బాబులు ఒకే రంగానికి చెందిన వారు. దీంతో వారి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. పైగా మోహన్ బాబు స్వర్గీయ నందమూరి తారక రామారావుకు పిచ్చ అభిమాని. ఒకవిధంగా చెప్పాలంటే నందమూరి హీరోలకంటే ఎన్టీఆర్ పేరు తలుచుకునేది మోహన్ బాబే అని చెప్పవచ్చు. బాలకృష్ణ స్వర్గీయ ఎన్టీఆర్ తనయుడు. దీంతో ఒకరిపై మరొకరికి గౌరవం, అభిమానం ఉన్నాయి. వారి మధ్య ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో మోహన్ బాబును తమ పార్టీలోకి తీసుకు వచ్చేందుకు బాలయ్యచే రాయబారం నెరపాలని టిడిపి నేతలు భావిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే బాలయ్య ఇందుకు ఒప్పుకుంటారా లేదా అనే చర్చ కూడా నేతల మధ్య జరుగుతున్నట్లుగా సమాచారం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more