New directors hulchul in tollywood

New Directors Hulchul in Tollywood,ew Directors Hulchul in Tollywood,New Directors creating Sensation in Tollywood,Tollywood New Directors,Telugu Film New Directors kovelamudi Prakash,Deva Katta,BVS Ravi,Hemant Madhukar,Nandini Reddy, veerabadra, sampath nandi, addala srikanth, vikram kumar,

New Directors Hulchul in Tollywood

Directors.gif

Posted: 04/10/2012 03:12 PM IST
New directors hulchul in tollywood

New Directors Hulchul in Tollywood

ఒకప్పుడు కేవలం కొద్దిమంది మాత్రమే దర్శకులు సినిమా ఇండస్ట్రీని శాసించేవారు. పరిశ్రమ మొత్తం వారిచుట్టూనే తిరుగుతుండేది. ఫలానా దర్శకుడు ఫలానా నటుడికే దర్శకత్వం వహిస్తేనే ప్రేక్షకులు కూడా చూసేవారు. అయితే నేడు ఆ పరిస్థితికి పూర్తి భిన్నంగా మారిపోయింది. పూరిజగన్నాధ్‌, రాజమౌళి, వి.వి.వినాయక్‌లంతా ఇప్పుడు అగ్ర దర్శకులు. అయితే ఒకప్పుడు వాళ్లు కూడా కొత్త దర్శకులే. టాలెంట్‌ నిరూపించుకుని అగ్రదర్శకుల స్థాయికి చేరుకున్నారు. మరి వాళ్లు ఆ స్థాయికి రావడానికి ఎంతగా కృషిచేసివుంటారో ఊహించడం కష్టం.

ఇప్పటి లేటెస్ట్‌ టాలెంటెడ్‌ దర్శకులకు ఆ కష్టం లేనట్లు కనిపిస్తోంది. ఎందుకంటే టాలీవుడ్‌ హీరోలలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి.
టాలెంట్‌ ఉన్న ఏ కొత్త దర్శకులకైనా వీళ్లు అవకాశం అనే అందలం ఇస్తున్నారు. ఇండస్ట్రీలో ఇది ఒక సత్సంప్రదాయం అంటున్నారంతా. కొత్త బంగారు లోకం వచ్చేదాకా శ్రీకాంత్‌ అడ్డాల పేరు ఎవరికీ తెలియదు. ఎటువంటి స్టార్‌ ఇమేజ్‌లేని ఆ చిత్రాన్ని సూపర్‌హిట్‌ చేసిన శ్రీకాంత్‌ అడ్డాల చెప్పిన కథను విని విక్టరీ వెంకటేష్‌, మహేష్‌బాబు మల్టీస్టారర్‌ చిత్రంలో నటించేందుకు ముందుకు వచ్చారంటే శ్రీకాంత్‌ అడ్డాల టాలెంట్‌ ఏమిటో అర్థమైవుంటుంది.

ఏమైంది ఈ వేళ లాంటి సామాన్య చిత్రానికి దర్శకత్వం వహించిన సంపత్‌నంది ఒక్కసారిగా వైకుంఠపాళిలో పెద్ద నిచ్చెన చేజిక్కించుకున్న చందాన రామ్‌చరణ్‌ తేజ ‘రచ్చ’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నాని, నిత్యామీనన్‌లతో ‘అలా మొదలైంది’ చిత్రానికి దర్శకత్వం వహించిన నందినిరెడ్డి తొలి చిత్రానికే నంది అవార్డును సొంతం చేసుకున్నారు.

ఇప్పుడు బెల్లంకొండ నిర్మాతగా హీరో సిద్ధార్థతో నిర్మించే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లరి నరేష్‌, సునీల్‌లతో సినిమాలు తీసిన వీరభద్రం త్వరలో హీరో నాగార్జునతో ఓ చిత్రాన్ని చేయనున్నారు. ‘పూలరంగడు’ చిత్రంతో సునీల్‌కు హీరో స్టార్‌డమ్‌ మరింత పెంచారు ఆయన. చాలా సినిమాల తర్వాత హిట్లు లేని హీరో నితిన్‌కు సూపర్‌ సక్సెస్‌ను అందించిన విక్రమ్‌కుమార్‌ కూడా ఇప్పుడు అక్కినేని వారసులతో ఓ చిత్రానికి కమిట్‌ అయినట్లుగా వార్తలొస్తున్నాయి.

ఇక లేటెస్ట్‌గా హిట్‌ టాక్‌ని సొంతంచేసుకుని ముందుకు దూసుకుపోతున్న ‘ఈరోజుల్లో’ చిత్రానికి దర్శకత్వం వహించిన మారుతి త్వరలో అల్లు అర్జున్‌ లేదా నితిన్‌ హీరోగా నటించబోయే చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఇక అందివచ్చిన అవకాశాన్ని ఈ టాలెంటెడ్‌ దర్శకులు సరిగ్గా ఉపయోగించుకుంటే రాబోయే రోజుల్లో వీళ్లంతా పెద్ద దర్శకుల లిస్ట్‌లో చేరిపోవడం ఖాయం. కొత్తగా రాబోయే యంగ్‌ డైరెక్టర్లు ఈ విషయాలను మైండ్‌లో ఉంచుకుంటే వాళ్లు కూడా పెద్ద హీరోలను డైరెక్ట్‌ చేసే అవకాశం అందుకుంటారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tollywood felicitates akkineni nageswara rao
Ranbir kapoor two vehicles  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more