Tollywood felicitates akkineni nageswara rao

Tollywood felicitates Akkineni Nageswara Rao,Hyderabad do,Akkineni Nageswara Rao,Chiru, Mohanbabu, akkineni wife, annapurnamma,

Tollywood felicitates Akkineni Nageswara Rao

Akkineni.gif

Posted: 04/11/2012 04:41 PM IST
Tollywood felicitates akkineni nageswara rao

Tollywood felicitates Akkineni Nageswara Rao

తెలుగు సినీ పరిశ్రమకు మూలస్తంభాల్లాంటి వ్యక్తుల్లో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. పౌరాణికం, జానపదం, సాంఘికం.. ఇలా కథ ఏదైనా సరే తనదైన మార్కు నటనతో 75 ఏళ్లుగా అఖిలాంధ్ర పేక్షకుల నీరాజనాలు అందుకుంటూనే ఉన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని TSR కళాపీఠం ఆయన్ను ఘనంగా సన్మానించింది. టాలీవుడ్ దసరాబుల్లోడు.. ఎవర్‌గ్రీన్‌ అందగాడు.. పద్మవిభూషణ్‌ ANR నట జీవితం పూర్తై 75 ఏళ్లైన సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.

ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావు 75 సంవత్సరాల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా టీఎస్ఆర్ లలిత కళా పరిషత్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇక్కడ ఏఎన్ఆర్, మోహన్ బాబు, చిరంజీవిల మధ్య కొన్ని ఆసక్తికర సంఘటనలు చోటు చేసకున్నాయి.

మోహన్ బాబు మాట్లాడుతూ...‘ప్రేమాభిషేకం సినిమా షూటింగ్ సమయంలో (అక్కినేని భార్య ) అన్నపూర్ణమ్మగారిని కలిసినప్పుడు ఆమె నాతో ఇలా అన్నారు. నువ్వు ఏఎన్ఆర్ కంటే గొప్ప నటుడివి, ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజ్ డైలాగులు చెప్పే సత్తా నీకు మాత్రమే ఉందని మోహన్ బాబు స్టేజీ పై చెప్పటంతో. అక్కడున్న వారికి మోహన్ బాబు ఏం చెబుతున్నాడో అసలు అర్థం కాలేదు. అది గ్రహించిన మోహన్ బాబు.. నేను చెప్పేది నిజం మీరు చప్పట్లు కొట్టాలి (ప్రేక్షకులను)అంటూ మోహన్ బాబు చెప్పారు.

అనంతరం అక్కినేని మాట్లాడుతూ....ఇంతకు ముందు మోహన్ బాబు మాట్లాడారు. నాకంటే గొప్పనటుడువి నువ్వే అని నా భార్య ఆయనతో చెప్పిందట, సాక్ష్యం చెప్పడానికి ఆమె ఇప్పుడు లేదు. ఆయన్ను అలా అనుకోనివ్వండి. మనల్ని చూసి అనేక మంది ఈర్ష్య పడుతూ ఉంటారు. అలాంటి వాళ్లు(మెహన్ బాబు) ఉంటేనే మన గొప్పతనం బయట పడుతుంది’ అంటూ పంచ్ ఇచ్చారు.

Chiranjeevi, Akkineni Nageswara Rao

మధ్యలో చిరంజీవి కల్పించుకుని....‘నాగేశ్వరరావు గారు మంచి మానసిక విశ్లేషకులు, ఆయన తప్పులు, లోటుపాట్లను బాగా అంచనా వేస్తారు. నాతో ఒకసారి ఆయన స్వయంగా మాట్లాడుతూ...రామారావు నాకంటే అందగాడు, ఆజాను బాహుడు, పౌరాణిక పాత్రలు బాగా వేస్తారు, గంభీరమైన స్వరం, ఆయనతో పొల్చుకుంటే పర్సనాలిటీ, ముఖ వర్చస్సు పరంగా ఆయనతో పోటీ పడలేని తత్వం నాది..అని చెప్పారు. ఆయన అలా తన లోటుపాట్లను అంచనా వేసుకుని ఆయనకు తగిన పాత్రలతో రామరావుగారికి పోటా పోటీగా రాణించారు. మోహన్ బాబును గొప్ప నటుడివి అని అన్నపూర్ణమ్మ పొగడటం అంటే బిడ్డను పొగిడినట్లే, నాగార్జునను బాగా నటించావు అంటే నాన్నకంటే బాగా చేశావు అని కాదు అక్కడ అర్థం’ అంటూ మోహన్ బాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు చిరంజీవి.

ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...నాగేశ్వరరావు మోహన్ బాబుకు పంచ్ ఇస్తున్న సమయంలో, ఆయన్ను నిలువరించడానికి మోహన్ బాబు అక్కినేనికి పాదాభివందం చేస్తుండగా చిరంజీవి మధ్యంలో కల్పించుకుని ఆయన్ను మాట్లాడనివ్వు ఎందుకు ఆపుతావ్ అంటూ అడ్డు పడటం గమనార్హం. చిరంజీవి మోహన్ బాబు గురించి మాట్లాడుతుంటే నాగురించి మాట్లాడటం ఆపవయ్యా అన్నచందంగా మోహన్ బాబు చిరుకు అడ్డు పడటం కూడా ఆసక్తిగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajini daughter soundarya
New directors hulchul in tollywood  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more