'ఆంధ్రుడు', 'శౌర్యం', 'గోలీమార్' చిత్రాల్లో పోలీసుగా అదరకొట్టిన గోపీచంద్ మరో సారి పోలీసుగా తన సత్తా చూపనున్నాడని చెప్తున్నారు. గోపీచంద్, నయనతార కాంబినేషన్ లో భూపతి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో గోపీచంద్ ఐఎఎస్ అధికారిగా కనిపించనున్నారు. ఇటీవలే రామోజీ ఫిల్మ్‌సిటీలో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. దీంతో తొలి షెడ్యూల్ పూర్తయింది. ఇదొక మాస్ ఎంటర్‌టైనర్. గోపీచంద్ నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఇందులో ఉంటాయి. దర్శకుడు భూపతి ఈ సినిమాను కొత్త పంథాలో తెరకెక్కిస్తున్నారు. కథ, కథనం, గోపీచంద్ పాత్ర చిత్రణ అన్నీ కొత్తగా ఉంటాయి. ఇందులో గోపీచంద్ ఐపీఎస్ అధికారిగా నటిస్తున్నారు. ఈ నెల 7తో తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈ నెల 25న మలిషెడ్యూల్ మొదలవుతుంది. ఈ షెడ్యూల్‌లో ప్రధాన దృశ్యాలతో పాటు రెండు పాటలను కూడా చిత్రీకరిస్తాం. జూన్‌లో విదేశాల్లో పాటల్ని చిత్రీకరిస్తామని తెలిపారు.
గోపీచంద్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఐపీఎస్‌గా ఆయన ఒక శక్తిమంతమైన పాత్రని పోషిస్తున్నారు. ప్రేమ, యాక్షన్, భావోద్వేగాల మేళవింపుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. గోపీచంద్, నయనతార మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాల్ని ఇటీవలే తెరకెక్కించాం. అవి ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టేలా ఉంటాయని అన్నారు. గోపీచంద్, నయనతార తొలిసారి కలిసి నటిసున్న ఈ చిత్రం యూత్ ని టార్గెట్ చేసే సన్నివేశాలతో రూపొందుతోంది. కోట శ్రీనివాసరావు, నాజర్, సాయాజీషిండే, రఘుబాబు, అశుతోష్‌రాణా, టార్జాన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, సంగీతం: తమన్.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more