హన్సిక ఈ మద్య షూటింగ్ లకు సెలవులు పెడుతుందట. హన్సిక షూటింగ్ లకు సెలవు పెట్టడం ఏమిటీ? ఆమో ఆరోగ్యంగానే ఉంది కదా? మరీ సెలవులు ఎందుకు పెడుతుందని .. నిర్మాతలు చెవులు కొర్కుకుంటున్నారు. సహజంగా ఒక్కరోజు శెలవు కావాలి..అని ఆర్టిస్టులెవరైనా నిర్మాతను అనుమతి అడిగితే... ఏ పార్టీకో, ఫంక్షన్‌కో వెళ్లాలేమో లేక ఆరోగ్యం బాగాలేదేమో అనుకోవడం సహజం. ఎక్కువగా ఇలాంటి కారాణాలకే తారలు అనుమతి అడుగుతుంటారు. ఇటీవల హన్సిక కూడా నిర్మాతను పర్మిషన్ అడిగారట. కానీ తన కోసం కాదు. ముద్దులొలికే చిన్నారుల కోసం ఆమె షూటింగ్ నుంచి శెలవు తీసుకున్నారట. ఓ తెలుగు చిత్రం షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ఉన్న హన్సిక చెన్నయ్‌లో ‘స్పెషల్ చిల్డ్రన్’ కోసం ఒక స్వచ్ఛంద సేవా సంస్థ తలపెట్టిన కార్యక్రమంలో పాల్గొనాలనుకున్నారట.
ఈ సంస్థలో ఉన్న పిల్లలందర్నీ సదురు సంస్థ ప్రత్యేకమైన ట్రైన్లో తిరుపతి తీసుకెళ్లాలనుకుందని సమాచారం. తిరుపతి ప్రయాణం అవుతున్న ఈ పిల్లలందరితో కాసేపు గడిపి, వారు ఎక్కిన ట్రైన్ కదిలే వరకు అక్కడే ఉండాలని హన్సిక నిర్ణయించుకున్నారట. అందరికీ ‘హ్యాపీ జర్నీ’ చెప్పడంతో పాటు, ట్రైన్ కనుమరుగయ్యే వరకు ‘టాటా’ చెప్పాలన్నది ఆమె కోరిక. ప్రయాణంలో పిల్లలందరికీ కావల్సిన తినుబండారాలు, పానీయాలు కూడా ఏర్పాటు చేశారట హన్సిక.
మూమూలు పిల్లల్లా వ్యవహరించలేని ఆ ‘స్పెషల్ చిల్డ్రన్’ ఆనందపడే విషయం ఇది. కేవలం వారిని ఆనందపరచడం కోసమే తెలుగు నిర్మాత దగ్గర పర్మిషన్ తీసుకుని హన్సిక చెన్నయ్ వెళ్లారట. ఈ బబ్లీ బ్యూటీ మంచితనానికి ఇది నిదర్శనం. ఆమెలో సేవాగుణం కూడా ఉంది. ఇప్పటికే 20 మంది వీధి పిల్లలను దత్తత తీసుకున్నారు హన్సిక. త్వరలో ఓ వృద్ధాశ్రమం కూడా ఆరంభించాలనుకుంటున్నారు. రీల్ మీద ‘మంచి మనసు’ ఉన్న హీరోయిన్గా కనిపించే హన్సిక.. రియల్‌గా కూడా హీరోయినే అనమాట
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more