Actress tara chowdary alias rajeswaris criminal history

Actress Tara Chowdary Alias Rajeswari's Criminal History,Banjara Hills police filed a petition in a local court seeking custody of actress Tara Chowdary, who was arrested for organising a prostitution racket. The Banjara Hills police said

Actress Tara Chowdary Alias Rajeswari's Criminal History

Tara.gif

Posted: 04/09/2012 03:37 PM IST
Actress tara chowdary alias rajeswaris criminal history

Tara Chowdary sex racket Big names could pop up

సెక్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తారా చౌదరిని బంజారాహిల్స్ పోలీసులకు నాలుగురోజుల కస్టడీగా అప్పగించారు. ఈ రోజు చంచల్‌గూడా మహిళా జైలు నుంచి పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు దగ్గర విలేకరులు అడిగిన ప్రశ్నలకు తారా సమాధానమిస్తూ తాను ఏ తప్పుకు పాల్పడలేదని తనను కేసులో ఇరికించిన వారిని కోర్టుకు లాగుతానని ఆమె అన్నారు. చంచలగూడ మహిళా జైలులో ఉన్న ఆమెను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కస్టడీకి తీసుకొని ఆమెను విచారిస్తున్నారు. విచారణకు తీసుకు వెళ్లే సమయంలో ఆమె తాను తప్పు చేయలేదని చెప్పింది. తారా చౌదరి సహచరుడు ప్రసాద్‌ను పోలీసులు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయనను పోలీసులు విచారించారు. ఆయనను కూడా కోర్టు నాలుగు రోజుల కస్టడీకి అప్పగించింది. వీరిద్దరిని తిరిగి 12వ తేదిన కోర్టులో పోలీసులు హాజరుపర్చాల్సి ఉంది.

అమాయకులయిన మహిళలను వ్యభిచారం ముగ్గులో దింపి వారి ద్వారా డబ్బున్న వారిపై వల వేసి, వారి శృంగార కార్యకలాపాలను సీడీలు, ఫొటోల ద్వారా బ్లాక్‌మెయిల్‌ చేస్తుందన్న ఆరోపణలతో అరెస్టయిన తారాచౌదరి ఖాతాలో పెద్ద గద్దలే ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల ప్రాధమిక విచారణలో కళ్లు చెదిరే విభ్రాంతికర వాస్తవాలు వెల్లడయినట్లు సమాచారం. వివిధ సందర్భాల్లో విచారణకు హాజరయిన తారాచౌదరిని చూస్తే పోలీసులే హడలిపోయేవారట. తన చేయి పట్టుకున్నారని గొడవ చేస్తానని బెదిరిం చడం, తనకు పైస్థాయిలో ఆఫీసర్లు తెలుసని చెప్పడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కూడా హడలిపోయి పారిపోయేవారట. తారా చౌదరి కహానీ తెలిసిన పోలీసులు చివరకు మహిళా కానిస్టేబుళ్ల సమక్షంలో మాట్లాడవలసిన పరి స్థితి ఏర్పడింది.

Tara Chowdary Buthulu

తారాచౌదరి బాధితులు, వారికి సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యల పూర్తి వివరాలను సూర్య పత్రిక వ్రాసింది వారి గుట్టుమట్లను తెలుసుకుంది. కోర్టు ఆదేశాలతో ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న తారాచౌదరి చేతిలో రాజకీయ నాయకుల గుట్టు మట్లు చిక్కుకుపోయాయి. నిజానికి ఆమె ప్రధాన వ్యాపారం వ్యభిచారం కాదని, అందుకోసం వచ్చిన డబ్బున్న వారిని ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేయడమేనని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తన వద్దకు వచ్చే డబ్బున్న వారు, రాజకీయ నాయకులు శృంగారంలో ఉన్నప్పుడు ఆ దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీసి తర్వాత వారిని బెదిరించేదంటున్నారు.

అందులో భాగంగానే గుంటూరు జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ ఎంపీని తన దగ్గర ఉన్న సీడీని చూపించి చాలాకాలం బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు తెలిసింది. పారిశ్రామికవేత్త కూడా అయిన సదరు ఎంపీని మానసికంగా వేధించినట్లు చెబుతున్నారు. తన సామాజికవర్గానికి అన్యాయం జరుగుతుందని, తనకు గుర్తింపు లేదని నాయకత్వంపై విరుచకుపడే అంత పెద్ద నేతకే తారాచౌదరి చెమటలు పట్టించిందంటే ఆమె బ్లాక్‌మెయిలింగ్‌ ఏ స్థాయిలో ఉండేదో ఊహించుకోవచ్చంటున్నారు. అదేవిధంగా ఒక నగరానికి మొదటి పౌరుడిగా పనిచేసిన సదరు ఎంపీ పుత్ర రత్నం కూడా తారా చౌదరి ఖాతాలో ఉన్నట్లు చెబుతున్నారు. కోటి రూపాయలు ఇవ్వకపోతే సీడీ బయటపెడతానని బెదిరిస్తుండటంతో సదరు ఎంపీ లక్ష్మణరావు అనే సన్నిహితుడిని మధ్యవర్తిగా పంపి, చివరకు వ్యవహారాన్ని 25 లక్షల రూపాయలకు సెటిల్‌ చేసుకున్నట్లు సమాచారం.

అదే జిల్లాకు చెందిన ఓ పారిశ్రామికవేత్తను చంపాలని కర్నూలుజిల్లాకు చెందిన ఓ డీఎస్పీని బెదిరించినట్లు తెలుస్తోంది. సదరు డీఎస్పీ తారామణి ఒడిలో పడుకుని, పక్కనే ఆప్యాయంగా నిల్చుని ఉన్న ఫొటోలు కూడా దాడుల్లో దొరికినట్లు సమాచారం. దానితోపాటు శృంగారానికి సంబంధించిన సీడీని కూడా చూపించి, ప్రస్తుతం కర్నూలులో వ్యాపారం చేస్తున్న ఆ పారిశ్రామిక వేత్తను చంపాలని ఆ డీఎస్పీపై ఒత్తిడి తీసుకురాగా, తాను ఆ పనిచేయలేనని, ముందు సీడీలు, ఫొటోలు ఇవ్వాలని ఆయన కాళ్లావేళా పడి ప్రాధేయపడినట్లు తెలుస్తోంది.
కాగా, రాష్ట్ర రాజకీయ చరిత్రను మార్చి, తెలుగు రాజకీయాల్లో భూకంపం పుట్టించిన ఓ దివంగత మాజీ ముఖ్యమంత్రి ద్వితీయ కళత్రం సైతం తారాచౌదరికి దన్నుగా నిలిచినట్లు సమాచారం. ప్రస్తుతం జగన్‌ పార్టీలో క్యారెక్టర్‌ పాత్ర పోషిస్తున్న ఆమెకూ తారా చౌదరికీ లింకులేమిటన్నదే ఆసక్తికరంగా మారింది.

Tara Chowdary Buthulu

ఇదిలాఉండగా, ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కూడా తారా చౌదరి చేతికి చిక్కినట్లు సమాచారం. సాంకేతికంగా ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, గత కొద్ది నెలల నుంచీ ఆ పార్టీకి దూరంగా ఉంటున్న సదరు నేత కొన్నాళ్లు కేంద్ర రాజకీయాల్లో కూడా ముఖ్య భూమిక పోషించడం గమనార్హం. ఇక ఇద్దరు ఏపీఎస్‌లు కూడా తారామణి శృంగార సామ్రాజ్యంలో సేదదీరిన వారేనని తెలుస్తోంది. ప్రస్తుతం పదవీ విరమణ చేసిన వారిద్దరూ తారాచౌదరిని ఇతర జిల్లాల్లో ఓ వీవీఐపీ స్థాయికి చేర్చారని తెలుస్తోంది. ఆమె గుంటూరు, ప్రకాశం, ఇతర జిల్లాలకు వెళుతున్న సమయంలో సదరు ఐపీఎస్‌లు స్థానిక డీఎస్పీలకు ఫోన్లు చేసి బందోబస్తు చేసి, మర్యాదల్లో లోటు రాకుండా చూడాలని ఆదేశించేవారట. కమ్మవారిపాలెం దేవాలయానికి వెళ్లిన సమయంలో బందోబస్తుకు వెళ్లిన సమయంలో పోలీసులు పక్కకు జరగమన్నందుకు వారిపై తారాచౌదరి చిందులుతొక్కిందట.

మహిళల హక్కుల కోసం ఉద్యమిస్తూ ప్రతిరోజూ టీవీ చర్చల్లో కనిపించే ఇద్దరు రాష్ర్ట స్థాయి మిహళా సంఘ నేతలు కూడా తారా చౌదరికి దన్నుగా నిలిచి, అందుకు ప్రతిఫలంగా నజరానా తీసుకున్నారంటే నోరెళ్లబెట్టక తప్పదు. గతంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించిన సందర్భంగా తారా చౌదరి అమాయకురాలని, పోలీసులు ఆమెను వేధిస్తున్నారని ఆమె తరఫున వకాల్తా తీసుకున్నారు. సినీ రచయిత చిన్నకృష్ణ కేసులో మహిళా కమిషన్‌ వద్ద యాగీ చేసి, వారి ద్వారా పోలీసులను హడలెత్తించిన తారా చౌదరికి ఓ రాజ్యాంగపరమైన సంస్థకు చైర్మన్‌గా పనిచేసిన ఓ మాజీ మహిళా ఎమ్మెల్యే అండగా నిలవడం అప్పట్లోనే విమర్శలకు తావిచ్చింది.
మహిళలపై ఎక్కడ అత్యాచారాలు, అరాచకాలు, కట్నం వేధింపులు జరిగినా అక్కడ ప్రత్యక్షమై ఆందోళన జరిపి, సాయంత్రానికి మళ్లీ టీవీ చర్చల్లో హాజరయ్యే ఈ ఇద్దరు మహిళా సంఘ నేతలకూ, తారాచౌదరికీ సంబంధాలేమిటన్నది ప్రశ్న. అప్పుడు తారా పక్షాన నానా యాగీ చేసిన ఈ మహిళా సంఘాల నేతలిద్దరూ ఇప్పుడు నోరుమెదపకపోవడం విచిత్రం. జిల్లాల నుంచి వచ్చే వారికి హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకునే తారా చౌదరికి అందులో ఒక ఐపీఎస్‌ ఏకపక్షంగా సాయం చేసేవారని తెలిసింది. ఏకంగా ఆయన తారామణి అందించిన అప్లికేషన్లకు తన విజిటింగ్‌ కార్డు పెట్టి మరీ ఉద్యోగాలకు సిఫార్సు చేసేవారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో తరచూ పాల్గొని, సకల కళావల్లభుడిగా పేరున్న మరో ఐపీఎస్‌ కూడా తారాచౌదరి సృష్టించిన శృంగార సామ్రాజ్యంలో తేలిపోయిన వారేనంటున్నారు. పదవీ విరమణ చేసిన ఈ ఐపీఎస్‌ల వ్యవహారంపై అటు పోలీసు శాఖలోనూ చర్చ జరుగుతోంది.

Tara Chowdary Buthulu

ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న తారాచౌదరి పెదవి విప్పితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆమెను కస్టడీలోకి తీసుకున్నారని తెలియడంతో రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, అధికార, అనధికార వర్గాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gopichand and nayanthara with director boopathipandian
Heavy constructions rules and regulations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more