లోక్ సభలో తెలంగాణ కోసం .. అన్నా చెల్లెళ్ళ పోరాటం. అన్నాకు ఆసరాగా నిలిసిన .. తెలంగాణ చెల్లెమ్మ. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో పెట్టే వరకు సభను స్తంభింపజేస్తామని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాలకు ఆటంకాలు కలిగిస్తామని తెలిపారు. తమని సభ నుంచి సస్పెండ్ చేసిన పరవా లేదని తేల్చిచెప్పారు. విద్యార్థులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కేసీఆర్ కోరారు. మూగ, చెవిటి, గుడ్డి ప్రభుత్వాలకు ఆత్మహత్యలు కనబడటం లేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో శాంతి లేదు అని ప్రధాని అనడం చాలా బాధాకరమన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. ఆత్మహత్యలకు నిరసనగా తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రజలు గుండెలు అవిసేలా అరుస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి సరైంది కాదని ఆయన అన్నారు. ఇదే వైఖరి కొనసాగితే అసహజ పరిణామాలకు దారి తీస్తుందని ఆయన అన్నారు. చేతులు జోడించి యువతకు విజ్ఝప్తి చేస్తున్నానని, ఆత్మహత్యలు చేసుకోవద్దని, తెలంగాణ వచ్చే వరకు పోరాడుదామని ఆయన అన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు గొడవలు లేవు, హింస లేదు, ఉపఎన్నికలు కూడా జరిగాయని, తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి ఇది ప్రశాంత వాతావరణం కాదా అని ఆయన అన్నారు. తెలంగాణపై స్పందించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానిని, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరారు.
ఇక అన్నా వంతు అయిన వెంటన చెల్లెమ్మ రంగంలోకి దిగి లోక్ సభ తెలంగాణ నినాదాలతో మారుమ్రోగింది. కేసీఆర్, విజయశాంతి స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లి తెలంగాణ నినాదాలు చేయడంతో కాంగ్రెస్ తెలంగాణ ప్రాతం ఎంపీలు వారిని అనుసరించి స్పీకర్ పోడియాన్ని ముట్టడించారు. సభ లో అలాగే ప్రశ్నోత్తరాలను కొనసాగించిన స్పీకర్ ఇంకా తెలంగాణ నినాదాలు ఆగకపోవడంతో సభను మద్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. లోకసభ తెలంగాణ నినాదాలతో మార్మోగుతూనే ఉంది. తెలంగాణ ప్రాంత ఎంపీలు తెలంగాణపై సభలో చర్చకు పట్టుబడుతున్నారు. టీఆర్‌ఎస్, టీ కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ పొడియంను చుట్టుముట్టడంతో పలుమార్లు సభవాయిదా పడింది. మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభమైన తరువాత మళ్లీ అదే తంతు. కేసీఆర్, విజయశాంతి, టీ కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణపై చర్చకు పట్టుబట్టడంతో లోకసభ రేపటికి వాయిదా పడింది.
ఆరుగురు కాంగ్రెసు పార్టీ ఎంపీలు కూడా తెలంగాణ కోసం విద్యార్థులు, యువత ఆత్మహత్య చేసుకుంటున్నప్పటికీ కేంద్రం స్పందించడం లేదని మండిపడ్డారు. వెంటనే తెలంగాణ బిల్లు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం వరంగల్ జిల్లాలో మృతి చెందిన బోజ్యా నాయక్ చిత్రపటాన్ని చూపిస్తూ తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు నిరసన తెలిపారు. అంతకుముందు ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. వారు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.
లోకసభ వాయిదా పడిన అనంతరం కాంగ్రెసు ఎంపీలు పొన్నం ప్రభాకర్, రాజయ్య, గుత్తా సుఖేందర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కేంద్రం తెలంగాణపై ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రం కోసం యువత, విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ఇంత ఉద్యమం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్నారు. ఒకరు సెంటిమెంట్ లేదని మరొకరు మరోవిధంగా అంటారని ఆరోపించారు. తెలంగాణ కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విద్యార్థులు, యువతకు సూచించారు. మేం తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నామన్నారు. సోనియా గాంధీ తెలంగాణకు సానుకూలంగా ఉన్నారని, కానీ సమైక్యవాదులు ఆమెను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు.
తెలంగాణ కోసం మేం బలవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని అన్నారు. మేం ప్రజాస్వామ్య పద్ధతుల్లో తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నామన్నారు. తెలంగాణపై ఇప్పుడు చర్చ అవసరం లేదని అన్నారు. ఇదివరకే చర్చ జరిగిందన్నారు. తెలంగాణ బిల్లు వెంటనే పార్లమెంటులో పెట్టాలని వివేక్ డిమాండ్ చేశారు. సీమాంధ్ర కుట్రలో భాగస్వాములై తెలంగాణ నేతలు యువకులు, విద్యార్థులను రెచ్చగొట్టవద్దన్నారు. అందరం కలిసే తెలంగాణ కోసం ఉద్యమిస్తామన్నారు. కేంద్రం తెలంగాణపై హామీ నిలబెట్టుకోవాలని ఎంపీ వివేక్ అన్నారు. ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలన్నరు. గండ్ర, రేణుక చౌదరి వంటి నేతల వల్లే ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయన్నారు. మా సహనం అసమర్థత కాదని కేంద్రాన్ని హెచ్చరించినట్లు చెప్పారు.
ఈ ఘటన తో మళ్లీ కేసిఆర్, దేశంలోని వివిధ రాజకీయ పార్టీల ద్రుష్టిని తెలంగాణ వైపుకు తిప్పే ఛాన్స్ ఉందని ఢిల్లి నాయకులు అంటున్నారు. కేసిఆర్ ముందు జాగ్రత్తగా రేపు ప్రవేశ పెట్టే బడ్జెట్ సమావేశాల్లో కేసిఆర్, విజయశాంతి హడావిడి ఎలా చేయబోతారనేదానికి ఇది ఉదహారణగా చూపించారని, కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తెంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ , టీడీపీ ఎంపీల వ్యూహం పార్లమెంటులో ఎలా ఉంటుందోనన్నది మాత్రం మనం చెప్పాలేం. దానికి కొంత సమయం వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more